Home > తెలంగాణ > తెలుగుతల్లి

తెలుగుతల్లి

పేరు కోసం, పదవి కోసం
అడ్డదారిన వచ్చిపడే
కలిమి కోసం బలిమి కోసం
తమ స్వార్థ యజ్ఞపు హోమగుండంలో
తల్లినైనా సమిధ లాగా వ్రేల్చగలిగిన
కుటిల జీవుల, రాజకీయుల గెలుపు కోసం
జరుగుతున్న ఈ బందును నిరసిస్తున్నా

జనం కోసం, బతుకు కోసం
నిజాయితీగా ఉద్యమించే వారి కోసం నిరీక్షిస్తున్నా

ఈ మదోన్మాదుల, పదవోన్మత్తుల
కొంగ జపాలు, నక్కజిత్తులు
తేటతెల్లమయ్యే రోజు కోసం,
వీళ్ళ బతుకులు నడిబజార్లో బట్టబయలయ్యే రోజుకోసం,
నడమంత్రపు సిరి కోసం అమ్మనైనా తిట్టగలిగిన
వీళ్ళ నోళ్ళు పడిపొయ్యే రోజు కోసం
నిరీక్షిస్తున్నా

మెరుపును చూపించి దీపంగా నమ్మించి,
ఎండమావుల వెంట పరిగెత్తించే నికృష్ట రాజకీయులారా

వేరు కుంపటి ఉపయోగపడేది కాకున్నా,
అడిగే హక్కు మీకుంది. కానీ..
అందుకోసం అమ్మను తిట్టడం ఘోరపాపం

తల్లిని నిందించిన మీ పాపం ఊరక పోదు
అది మిమ్మల్ని కట్టి కుడిపే రోజు రాకపోదు

——

తెలుగు తల్లికి వందనం
తెలుగు జాతికి జయం
తెలుగు నేలకు శుభం

Advertisements
Categories: తెలంగాణ
  1. November 1, 2006 at 7:02 pm

    రాజకీయులు స్వార్థ కుటిల రాజకీయాలకై తల్లిని రోడ్డుకీడుస్తున్నారు. మీ ఆవేదన సహేతుకం.

  2. రవి వైజాసత్య
    November 1, 2006 at 8:14 pm

    ముగ్గురమ్మల మాయమ్మ అని ఇప్పుడు తెలంగాణ తల్లి, సీమ తల్లి, కోస్తా తల్లి వచ్చాయన్న మాట. ఆ తరువాత తరంలో నెల్లూరు తల్లి, కరీం తల్లి, నిజాం తల్లి, నల్గొండ తల్లి, గోదావరి తల్లి. తల్లుల సంతతి వృద్ధి. అప్పుడు తెలుగు తల్లి పోయి తెలుగు ముసలవ్వ అవుతుంది 🙂

  3. November 2, 2006 at 2:39 am

    గుండెల్ని పిండే టట్టు తెలుగు తల్లి గురించి మాట్లాడేవాళ్ళకు తెలుగు తల్లి దీవెనలిస్తుందే కానీ వాళ్ళను చూసి ఆగ్రహించు కోదు అనే సత్యాన్ని ఈ కుటిల రాబందులు ఎప్పుడు గ్రహిస్తారో

    విహారి

  4. November 3, 2006 at 11:33 pm

    సాయంత్రం అయ్యేటప్పటికి బుడ్డి ముందేసుకుని కూర్చొనే తాగుబోతు నోటి వెంట సంస్కారమైన భాష ఎలావస్తుందిలెండి? హతవిధీ… ఈ రాజకీయాల పేరుతో ఇంకెంత దిగజారుడు వ్యవహారాల్ని చూడాల్సివస్తుందో…!!

  5. November 3, 2006 at 11:39 pm

    చెప్పటం మరిచా… మీ కవిత చాల బాగుందండీ…!
    శ్రీశ్రీ మహాప్రస్తానం గుర్తుకు తెచ్చింది 🙂

  6. November 5, 2006 at 10:35 am

    “మెరుపును చూపించి దీపంగా నమ్మించి,
    ఎండమావుల వెంట పరిగెత్తించే నికృష్ట రాజకీయులారా”

    నాకు తెలిసి ఎ౦తో ఉద్వేగ౦లో కానీ ఇలా౦టి మెరుపు రాదు. బాగా రాసారు.

  1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: