Home > మతం, సమాజం > బాబ్రీకట్టడపు కూల్చివేత వార్షికోత్సవం

బాబ్రీకట్టడపు కూల్చివేత వార్షికోత్సవం

పురుషోత్తముడి గుడిని కూల్చేసి మసీదునొకదాన్ని కట్టాడో దురాక్రమణదారు. తన జాతి వారసత్వంపై మక్కువ, గర్వమూ ఉన్న ఏ స్వతంత్ర ప్రభుత్వమైనా ఆ కట్టడాన్ని పడేసి మళ్ళీ గుడి కట్టుకుంటుంది. ఎందుకంటే అది జాతి గౌరవంతో ముడిపడి ఉన్నది కాబట్టి. ఎంచేతో మన ప్రభుత్వాలు ఆ పని చెయ్యట్లేదు. మరి ఇవి ప్రభుత్వాలు కావో, లేక వాటికి ఈ జాతి వారసత్వం పట్ల గౌరవం లేదో!! ప్రభుత్వాలు ఎలాగన్నా పోనీండి.., ఆ పనేదో తామే చేసుకోవాలనుకున్నారు, హిందువులు. ఆ పనిలో సగభాగం పూర్తై మరో ఏడాది గడిచిపోయింది. గుడి కట్టే కార్యక్రమం మాత్రం ఇంకా మొదలు కాలేదు.

ఇన్నేళ్ళుగా ‘అక్కడ గుడిని కట్టలేదేఁ?’ అని హిందువులెవరూ అడగలేదు. కానీ మైనారిటీ నాయకులు, మైనారిటీవాదపు మహారాజ పోషకులు మాత్రం మసీదు కట్టలేదేంటని వాపోతున్నారు, కళ్ళనీళ్ళు పెట్టేసుకుంటున్నారు, కుళ్ళికుళ్ళి ఏడుస్తున్నారు. హిందూ మతస్తులకు వ్యతిరేకంగా ఐక్యవేదికనొకదాన్ని పెట్టేసుకున్న కొందరు (దానికి హిందూ మతోన్మాద వ్యతిరేక వేదిక అని పేరు పెట్టుకున్నారు) ఆ వేదిక మీద కూచుని హిందువులపై విషం గక్కారు. ఈనాడులో వచ్చిన ఆ వార్త చూడండి..

బాబ్రీ మసీదును కూల్చిన చోటనే నిర్మించాలని విప్లవ రచయితల సంఘం (విరసం) రాష్ట్ర నాయకులు ——— డిమాండ్‌ చేశారు. రాష్ట్ర హిందూ మతోన్మాద వ్యతిరేక ఐక్య వేదిక ఆధ్వర్యంలో ‘డిసెంబర్‌ 6ను హిందూ మతోన్మాద వ్యతిరేక దినంగా పాటిద్దాం’ అని ధర్నా నిర్వహించారు. బాబ్రీ మసీదు కూల్చివేతపై నియమించిన లిబర్హన్‌ కమిషన్‌ నివేదికలో ఉన్న దోషులను ఇంతవరకూ శిక్షించలేదన్నారు. భాజపా నాయకులు మాజీ ప్రధాని వాజ్‌పేయి, అప్పటి ప్రధాని పి.వి.నరసింహరావు కూడ మసీదు కూల్చివేతకు సహకరించారని ఆరోపించారు. సామ్రాజ్యవాదులు, హిందూమతోన్మాద శక్తులు ముస్లింలపై దాడులు చేస్తున్నారని వివరించారు. అందులో భాగంగానే గతంలో నగరంలో జరిగిన మతకల్లోలాలు వారు సృషించినవేనని ఆయన ఆరోపించారు. …  

 ఈ వేదికనెక్కిన శ్రేష్ఠులందరూ కూడా కావాలనుకున్నప్పుడల్లా గుడ్డితనం, బెమ్మజెముడూ పొందగలిగే వరమొకదాన్ని కమ్యూనిజం/మార్క్సిజం/లెనినిజం/మావోయిజం/పోవోయిజం/రావోయిజం/లేవోయిజం/… వగైరాల నుండి సంపాయించారు. స్వచ్ఛంద మరణం లాగా స్వచ్ఛంద అంగవైకల్యమన్నమాట! వీళ్ళకున్న మానసిక వైకల్యాలకు ఈ శారీరిక వైకల్యాలు తోడై, వీళ్ళను హిందూమత వ్యతిరేక రాక్షసులుగా మార్చాయి. హిందూ వ్యతిరేక, మైనారిటీ పక్షపాత రజాకార్లు వాళ్ళు. పాపం అంచేతే, వీళ్ళకి..

మక్కా మసీదులో, లుంబినీలో, గోకుల్ చాట్‌లో, దేశంలో ఇంకా అనేక చోట్ల బాంబులు పేలిన ఘటనలు  కనబడవు, ఆ మోతలు వినబడవు. ఒకవేళ వినబడ్డా.. “ఈ పేలుళ్ళకు ముస్లిములను కారకులని అనుమానించడం తగదు.” అంటూ కారుకూతలు కూస్తారు. చివరాకరికి ఆ బాంబులేసినది ఇస్లామిక ఉగ్రవాదులే అని తేలిన తరవాత, ఒక్కడు కనబడ్డు, ఒక్ఖడు ఇనబడ్డు. తమతమ మురికి కూపాల్లోకి, తమ తిమిరలోకాల్లోకి జారిపోతాయి ఈ కప్పలు. శవాగారాల్లాంటి తమతమ కలుగుల్లో నక్కుతాయి, జవసత్వాలను కొరికేసి, జాతిని నిర్వీర్యపరచే ఈ ఎలుకలు, పందికొక్కులు! ప్రతీ డిసెంబరు 6 న మాత్రం బెకబెకమంటూ, కిచకిచమంటూ బయటికొస్తాయి.

వేదికనెక్కి కారుబెకబెకలు, కారుకిచకిచలూ కూసే ఈ కప్పలూ, నికృష్టపు టెలుకలూ, పందికొక్కులూ.., బాంబుపేలుళ్ళకు బాధ్యులుగా ముస్లిములను అనుమానించరాదంటూ మైకులెట్టుకు మోగిమోగీ ఊగిపోయాయి. ఆ పేలుళ్ళు ఇస్లామిక ఉగ్రవాదుల పనేనని తేలాక, ఇవి వీటి కూపాల్లోంచి, కలుగుల్లోంచి బైటకే రాలేదు. ఇప్పుడు మాత్రం ‘హిందూ మతోన్మాద వ్యతిరేకత’ను వినిపించేందుకు కాళ్ళగ్గజ్జెలు కట్టుకోని, చేతుల్లో చిడతలతో వేదికలెక్కి తైతక్కలాడతన్నై. (నాస్తికులమని చెప్పుకునే ఈ జనం.. మసీదు కట్టాల్సిందేనని  చిందులెయ్యడం చూస్తే వీళ్ళమీద వెగటు కలుగుతోంది!) సమాజాన్ని హిందూ వ్యతిరేకతతో విషపూరితం చెయ్యబూనిన భ్రష్టులారా..! అప్పుడేమైందోయ్, మీ మార్క్సిజమ్ము? ఎక్కడ నక్కాయోయ్, మీపౌరహక్కుల నిఘా సంఘాలూ? ఆనాడెక్కడ దాక్కున్నారోయ్, నేడు మీతో గొంతు కలిపిన ఈ హిందూ వ్యతిరేక మదోన్మత్త చిత్తులు, మీ మిత్రులు? ఈ గాంధారీ పుత్రులు?

Advertisements
Categories: మతం, సమాజం
 1. December 7, 2009 at 7:57 pm

  బాగా అడిగారు…

 2. December 7, 2009 at 8:16 pm

  చాలా బాగా కడిగేసారండి!!

 3. December 7, 2009 at 8:22 pm

  http://samatalam.blogspot.com/2009/02/blog-post_9829.html చదువు నాయనా. ఎవరు హిందూ వ్యతిరేకులో, ఎవరు కళ్ళున్న గుడ్డివాళ్ళో అర్థమవుతుంది. ఇస్లాం మతాన్ని సమర్థించాల్సిన అవసరం కమ్యూనిస్టులకి లేదు. అఫ్ఘనిస్తాన్ లో మావోయిస్ట్ నాయకుడు ఫయజ్ అహ్మద్ ని చంపింది హెజ్బ్-ఇ-ఇస్లామీ అనే ఇస్లామిక్ చాందసవాద పార్టీ. ఆ పార్టీకి పాకిస్తాన్ సపోర్ట్ తో పాటు అమెరికా సామ్రాజ్యవాదుల సపోర్ట్ కూడా ఉండేది. నిజాం నియంతలని పొగిడే పార్టీలకి వోట్లేసి గెలిపిస్తున్న వాజెమ్మలం కదా. మనకి నిజాలు రుచించవులే.

 4. December 7, 2009 at 8:32 pm

  (నాస్తికులమని చెప్పుకునే ఈ జనం.. మసీదు కట్టాల్సిందేనని చిందులెయ్యడం చూస్తే వీళ్ళమీద వెగటు కలుగుతోంది!)

  Well said.

 5. December 7, 2009 at 8:40 pm

  అభ్యంతరం మస్జీద్ కూల్చివెయ్యడం పై కాదు, మస్జీద్ కూల్చివెయ్యడం ద్వారా మత వోట్లు పొందాలనుకోవడం పైన.

 6. December 7, 2009 at 8:43 pm

  అయ్యో భలే పిచ్చివారండీ మీరు. మరి ప్రపంచ చరిత్రలో మనకు మనంగా మన హైందవులు తెచ్చుకున్న ఒక బిరుదు ఉందే అది “పరమత సహనం”. ఆ గుణాన్ని ఈరోజు విస్మరించాము కదా అందుకని మీరు చెప్పిన ఆ పెద్దమనుషుల కడుపుమంట. మతోన్మాదం తలకెక్కిన ఇతర మతాలవారు మనమీద ఏ రకంగానైనా అత్యాచారాలు చెయ్యొచ్చు, మనం మాత్రం మనకున్న ఆ అమూల్యమైన గుణాన్ని విడువరాదు. ఇప్పటికీ మన నరనరాల్లో జీర్ణించుకుపోయింది కాబట్టే అన్ని మతాలవారు (మనం తప్ప) ఈ సమాజంలో సుఖ శాంతులతో బ్రతుకుతూ ఇలా అప్పుడప్పుడూ వేదికలెక్కి ఉపన్యాసాలు దంచుతున్నారు.

 7. December 7, 2009 at 8:46 pm

  మందిరాన్ని కూల్చిన వాడువెధవైతే, మసీదునుకూల్చిన వాడు ఇంకా పెధ్ధవెధవ, ఇప్పుడు మళ్ళీ మసీదు కట్టాలని ఏడ్చేవాడు వీళ్ళిద్దరికంటే పెధ్ధవెధవ. దేశంలో అంతకంటే పెద్ద సమస్యలుండగా అదేదో తిండిపెడుతుందన్నట్లు ప్రార్ధనాస్థలాలకోసం కొట్లాడుకోవటం మూర్ఖత్వానికి నిదర్శనం.

 8. December 7, 2009 at 8:48 pm

  మీరు మాట్లాడుతుంది ఏ జాతి గురించి? భారతీయుల్లో చాలా జాతులు ఉన్నాఇ కదా.

 9. December 7, 2009 at 8:56 pm

  నాస్తికులమని చెప్పుకునే ఈ జనం.. మసీదు కట్టాల్సిందేనని చిందులెయ్యడం చూస్తే
  __________________________________________________

  LOLLLLLLL

 10. December 7, 2009 at 8:57 pm

  మందిరాన్ని కూల్చిన వాడువెధవైతే, మసీదునుకూల్చిన వాడు ఇంకా పెధ్ధవెధవ, ఇప్పుడు మళ్ళీ మసీదు కట్టాలని ఏడ్చేవాడు వీళ్ళిద్దరికంటే పెధ్ధవెధవ
  __________________________________________________

  LOL again!!!!!

 11. December 7, 2009 at 9:01 pm

  ప్రశ్న బాగుంది. హిందువులలో వేరువేరు కులాలూ, జాతులూ ఏనాడూ ఐక్యంగా ఉండలేదు. ముస్లింలలో సున్నీలూ, షియాలూ ఒకరినొకరు కొట్టుకున్నా, హిందువులకి వ్యతిరేకంగా మాత్రం ఐక్యంగా ఉంటారు. హిందువులలో మాత్రం ఆ ఐక్యత లేదు. కుల వ్యవస్థకి వ్యతిరేకంగా కబుర్లు చెప్పడం సులభమే కానీ కులాంతర వివాహాలు చేసుకోవడం మాత్రం ఇష్టం ఉండదు. అడవి బాపిరాజు వ్రాసిన నారాయణ రావు నవలలో ఒక డయలాగ్ ఉంది “వెధవ కబుర్లు ఎన్నైనా చెప్పొచ్చు” అని. ఆ డయలాగ్ ఎందుకొచ్చిందో తెలుసా? జగన్మోహనరావు తాను విధవని పెళ్ళి చేసుకుంటానని వాగ్దానం చేస్తాడు కానీ అతను కన్యనే పెళ్ళి చేసుకుంటాడు, అది కూడా కట్నం తీసుకుని పెళ్ళి చేసుకుంటాడు. కులాంతర వివాహాలు గురించి మాట్లాడుతూ తమ కులం వాళ్ళనే పెళ్ళి చేసుకునేవాళ్ళు కూడా అలాంటి వాళ్ళే. హిందువులలో ఐక్యతలేదు కానీ ముస్లింలని నిందించడం మాత్రం బాగా వచ్చు. నేనేమీ ఇస్లాం మతాన్ని నమ్మడం లేదు. హిందూ మతం కులతత్వ ఫాసిస్ట్ మతం అయితే ఇస్లాం మతం టెర్రరిస్ట్ మతం. రెండు మతాల మధ్య ఫండమెంటల్ తేడా లేదు.

 12. December 7, 2009 at 9:57 pm

  చదువరి గారు very well said! వీళ్ళందరిది ఒక స్ట్రాటజీ, దేశాన్ని నాశనం చేయాటనికి ! గత నాలుగు , ఐదు సంవత్సరాలు గా చూడండి వీళ్ళు ముస్లిం ఉగ్రవాదులు గా అనుమానించిన వాళ్ళను వెనకేసుకు రావటం, వాళ్ళను సమర్ధించటం అనేవి ఒక ఉద్దేశ్యపుర్వకం గా చేస్తున్నారు.

 13. December 7, 2009 at 10:45 pm

  chaduvaree baaga chadivinchavu

 14. December 7, 2009 at 11:03 pm

  “ప్రతీ డిసెంబరు 6 న మాత్రం బెకబెకమంటూ, కిచకిచమంటూ బయటికొస్తాయి. ” Well Said.

 15. December 7, 2009 at 11:13 pm

  చదువరి గారు, చాలా బాగా చెప్పారు.

 16. December 7, 2009 at 11:23 pm

  http://img189.imageshack.us/i/clipboard01xw.png/ హైదరాబాద్ మత ఘర్షణల విషయంలో క్రిస్టియన్ రాజశేఖర రెడ్డిని కూడా వరవరరావు గారు విమర్శించారు.ఈ రాజకీయ నాయకులు నిజాంని పొగిడారని తెలిసి వోట్లు వేశారు, చర్చిలలో ఎన్నికల ప్రచారం చేశారని కూడా తెలిసి వోట్లు వేశారు. మరి ఇప్పుడు ఏదో గొప్ప మత భక్తులలాగ మాట్లాడడం ఏమిటి? I am always atheist but what about those people who are neither faithful to religion nor secularism?

 17. December 8, 2009 at 12:18 am

  well said. I appreciate you.

 18. December 8, 2009 at 12:32 am

  చదువరిగారు.. చాలా బాగా చెప్పారు.. నేను వేరే బ్లాగులొ ఇది చెప్పాను.. డిసెంబర్ 6 హిందు మతొన్మాద వ్యతిరేక దినం గా జరుపుకొవాలంటే మిగతా 364 రోజులు మైనారిటి మతోన్మాద వ్యతిరేక దినాలుగా జరుపుకోవాలి.
  ఈ వెధవలకి ఉరి శిక్ష పడికూడా అమలు జరపలేక జైల్లొ పందిలా తింటున్న కరుడుగట్టిన టెర్రరిస్ట్లు కనపడరు. వాజమ్మలు. నేను మనసులొ వున్నవన్ని మీరు చెప్పేసారు. ధన్యవాదాలు.

 19. December 8, 2009 at 12:33 am

  హిందువ్యతిరేఖ మాఫియాకి వీళ్ళు, మన దౌర్బాగ్యపు ఇంగ్లిషు మీడియా రెండుకళ్ళు లాటివారు.

 20. December 8, 2009 at 7:52 am

  బాగా చెప్పారు.

 21. December 8, 2009 at 9:20 am

  ఏ రోజు మొదటి ముస్లిం ఈ దేశంలో అడుగుపెట్టాడో, అప్పటి నుంచీ, రావణకాష్టం రగులుతునే ఉంది. ఎన్ని తరాలు ఈ పాపాన్ని మోయాలో ఏమో అంతుబట్టకుండా ఉంది.

 22. December 8, 2009 at 10:05 am

  కడిగేశారండి……బాగా చెప్పారు…!!

 23. December 8, 2009 at 1:01 pm

  కుహనా సెక్యులరిష్టులు, కమ్యూనిష్టు విద్యావేత్తలు వ్రాసిన టెస్ట్ బుక్స్, పత్రికలు చదువుకుని పెరగడంవల్ల మనం అంతా ఈ కుహనా సెక్యులరిజాన్నే నమ్ముతున్నాం.

 24. December 8, 2009 at 2:04 pm

  బోనగిరి గారు, తమరు నిజమైన సెక్యులరిస్ట్ అయితే నాస్తికురాలైన తస్లీమా నస్రీన్ ని హత్య చెయ్యాలని ముస్లిం చాంధసవాదులు ఫత్వా జారీ చేసినప్పుడు హిందూ చాంధసవాదులు ఎందుకు నోరు మూసుకున్నారో చెప్పగలరా? http://blogzine.sahityaavalokanam.gen.in/2009/12/blog-post_08.html తస్లీమా నస్రీన్ బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులని వ్యతిరేకించింది కానీ ఆమె నాస్తికురాలు కావడం వల్ల హిందూ చాంధసవాదులు కూడా ఆమె చావు కోరుకున్నారు. ఇది మన హిందువుల నీతి?! మనకీ, ముస్లిం చాంధసవాదులకీ ఉన్న తేడా ఏమిటి?

 25. December 8, 2009 at 5:53 pm

  వ్యాఖ్యాతలందరికీ నెనరులు.

  ప్రవీణ్: నేనసలు ఇస్లామును ఏమీ అనలేదిక్కడ. ఇస్లామును సమర్ధించి, హిందువులను గుడ్డిగా వ్యతిరేకించే కమ్యూనిస్టులను విమర్శించానంతే! పోతే.., మీరిలా విషయంతో సంబంధం లేకుండా రాత్రి చదివిన పుస్తకంలోని సంగతులను వ్యాఖ్యలుగా రాసుకుంటూ పోతుంటే మాకు కుసింత అయోమయంగా ఉంటది. మనం గతంలో ఒక సంగతి అనుకున్నాం.. టపాకు సంబంధం ఉండేట్టుగా వ్యాఖ్యానించాలని. మీరు మర్చిపోయారనుకుంటా.

  మంచుపల్లకీ: ఆ బ్లాగులో మీ వ్యాఖ్య చూసానండి. మీ 1:364 తర్కం నిజం. నేనూ రెండు వ్యాఖ్యలు రాసాను. ప్రచురించలేదు -ఇంకా చూళ్ళేదేమో!

 26. December 8, 2009 at 6:34 pm

  క్రిస్టియన్ రాజశేఖర రెడ్డిని కూడా వరవరరావు గారు విమర్శించారు. అది కేవలం హిందూ వ్యతిరేకత అని ఎలా అనుకున్నారు?

 27. December 28, 2009 at 5:54 pm

  ఇది వారసత్వ సంపద అని చెప్పడానికి ఎక్కడ గీత గీస్తారు? హిందువుల ఆధిపత్యం కోసం ఎన్నో బౌద్ధారామాలను కూల్చి హిందూ గుల్లను కట్టినట్టు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. మచ్చుకు మన రాష్ట్రంలో ఉన్న గుంటూరు లోని అమరావతికి వెల్తే అక్కడ బౌద్ధారామాన్ని కూల్చి హిందూ గుడిని కట్టారు. మరి ఇలాంటి హిందూ గుల్లన్నీ కూల్చి మల్లీ బౌద్ధారామాలను నిర్మిద్దమ? అలా చేసి వారసత్వ సంపదను కాపాడుకున్నట్లు గొప్పలు చెబుదామా?

  వారసత్వ సంపదను కాపాడే నెపంతో చరిత్రలోని తప్పిదాలను సరిచేయాలంటే దాన్ని ఎక్కడ మొదలు పెదతారు, ఎక్కడ ముగిస్తారు? ఇప్పటి కాలం స్టాండర్డ్ గా తీసుకుంటే బాబరీ కట్టడమే వారసత్వ సంపద, అంతే కానీ వందల ఏల్లక్రితం కూల్చిందని మనం నమ్మే రాముని గుడి కాదు. అక్కడ రాముని గుడికి ముందు మరో ఇంద్రుని గుడి ఉండొచ్చు, లేక చంద్రుని గుడి వుందొచ్చు. ఎకాడని ఆపుతారు చరిత్రను తిరగరాసే కార్యక్రమం. ఇలాంటి సిగ్గుమాలిన పనిని ప్రభుత్వమే చేయాలని చెప్పడం అత్యంత హాస్యాస్పదం.

  ఇక ఇస్లాం తీవ్రవాదం గురించి..గోకుల్ చాట్ లో గానీ, మరో చోట గానీ బాంబు పెట్టిన తీవ్ర వాదుల్ని శిక్షించొద్దని ఎవ్వరూ చెప్పలేదు. అది కేవలం మీ ప్రాపగాండా. కానీ ఆ నెపంతో ముస్లిములందరిని తీవ్రవాదులుగా చూపించే మీ పదజాలం హిందూ తీవ్రవాదం గురించి కన్వీనియెంట్ గా విస్మరిస్తుంది.

 28. December 28, 2009 at 10:07 pm

  Karan Kumbh: మీరు ఇక్కడ చెప్పిన కొలబద్దను వాడి, ‘తెలంగాణ మాదే, హైదరాబాదు మాదే’ అనేవాళ్ళ నోరు మూయించండి. అలా అనేవాళ్ళ జాబితాలో మీరూ ఉన్నారు కాబట్టి, వాళ్ళ నోళ్ళు మూయించి తరవాత మీరూ నోరు మూసుకోండి.

 29. December 29, 2009 at 1:29 am

  కొలబద్దను ఎలా వాడాలో కూడా మీరే చెప్పండి. తెలంగానా వాల్లెమైన ఆంధ్ర కట్టడాలను కూలగొదుతున్నారా , వెల్లి ఆపుదాం?

 30. December 29, 2009 at 7:22 am

  Karan Kumbh: మళ్ళీ మీరే అన్న మాట మీద కప్పుగెంతు వేస్తున్నారు. “ఇది వారసత్వ సంపద అని చెప్పడానికి ఎక్కడ గీత గీస్తారు?” ఇది మీరే అన్నమాట. హైదరాబాదు ఎవరిది అని చెప్పడానికి ఎక్కడ గీత గీస్తారు? అని నేను అడుగుతున్నాను. హైదరాబాదు మాది అని మీరు ఎలా అనగలరూ అని నేనడుగుతున్నాను.

 31. December 29, 2009 at 1:32 pm

  అర్ధంలేని అసంబద్ధ వాదన. హైదరాబాదు రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం కల్సిసి 50 ఏల్ల క్రితం ఆంధ్ర ప్రదెష్ గా ఏర్పడ్డాయి. అదేమీ అయిదు వందల సంవత్సరాల క్రితం మాట కాదు.

  ఇప్పటి కాలం అంటె ఈ క్షనం కాదు..నేను రాసి మీరు చదివే లోపల చాలా క్షనాలు గడుస్తాయి. ఇక్కడ ఇప్పటి కాలం అంటే. మన స్వాతంత్రం వచ్చిన తరువాత, రాజ్యాంగం రాసుకున్న తరువాత మన ప్రభుత్వం తీసుకున్న నిర్నయాలు. వాదనను సెమాంటిక్స్ లోకి మార్చి తెల్వైన వాదన్ అనుకోవద్దు.

 32. Chaitu
  January 2, 2014 at 10:55 am

  నీ మొఖం లా ఉంది వివరణ, మొన్న బీహార్ లో మోడీ గడు వాడి మీటింగ్ లో వాడె బాంబ్స్ పెట్టిచుకున్నాడు PM అవడానికి, దానికి తమరి వివరణ ఏంటో?

  నెత్తిన టోపీ పెట్టుకుని, గడ్డం పెంచుకున్న వళ్ళంతా ముస్లిమ్స్ కారురా వెధవ, నిజమైన ముస్లిమ్స్ ఎవరిని ఇబ్బంది పెట్టరు.

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: