Home > తెలంగాణ > శ్రీకృష్ణ కమిటీకి తెలంగాణ ప్రజల అభిప్రాయం

శ్రీకృష్ణ కమిటీకి తెలంగాణ ప్రజల అభిప్రాయం

తెలంగాణ ప్రజలు తమకు తెలంగాణ కావలసిందేనంటూ తమ అభిప్రాయం స్పష్టంగా చెప్పారు. వివిధ వేదికల మీద ఇన్నాళ్ళుగా చెబుతూ వచ్చిందే ఇప్పుడు అది ఓటేసి – ఒట్టేసి – మరీ చెప్పారు.

దాదాపుగా అందరూ ఊహించిన ఫలితమే ఇది. ఎన్నికలు పూర్తిగా తెలంగాణ వాదం ప్రాతిపదికగానే జరిగాయి. ప్రజలు తెలంగాణ కావాలని బలంగా కోరుకుంటున్నారనేది సర్వవిదితం. కాబట్టి, మొత్తమన్ని స్థానాల్లోనూ తెరాస, బీజేపీలే గెలుస్తాయని అనుకున్నదే. అయితే ఈ స్థాయిలో గెలుస్తారని, మెజారిటీలు ఇంత ఎక్కువగా ఉంటాయనీ, మిగతా పార్టీలను ఇలా ఊడ్చవతల పారేస్తారనీ ఊహించలేదు. ఆ విధంగా ఈ ఎన్నికల ఫలితాలు కొంత ఆశ్చర్యం కలిగించేవే!

ఈ ఫలితాల ద్వారా కొత్తగా తెలంగాణ వాదానికి ఒనగూడిందేమీ లేదు. వచ్చే డిసెంబరు దాకా పరిస్థితిలో కొత్తగా వచ్చే మార్పులేమీ లేవు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇచ్చేంతవరకూ తెలంగాణ సమస్యలో కొత్తగా వచ్చే మలుపులేమీ ఉండవు. ఈ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కాంగ్రెసు, తెదేపాలు తమతమ విధానాలను సమీక్షించుకుని, కొత్త విధానాలను అనుసరిస్తారనో, మరేదైనా మార్పుచేర్పులు చేస్తారనో నాకైతే అనిపించడం లేదు. అయితే ఎంతో కొంత మథనం ఉండే అవకాశం లేకపోలేదు.

అన్ని స్థానాలనూ గెల్చుకున్నందుకు తెరాస, బీజేపీలు సంతోషిస్తున్నారు. ప్రజలు తెలంగాణ పట్ల ఇంత తీవ్ర పట్టుదలతో ఉన్నారన్నది వాళ్లకు సంతోషం కలిగించవచ్చు. అయితే, ఈ గెలుపుకు వాళ్ళ సొంత బలమేమీ కారణం కాదు. ప్రజల్లో తెలంగాణ పట్ల ఉన్న బలమైన ఆకాంక్షే, అద్బుతమనిపించే మెజారిటీలతో వాళ్లను గెలిపించింది. వాళ్ళ స్థానంలో వేరే ఎవరున్నా గెలిచేవారే. ఆ సంగతి అందరితో పాటు వాళ్లకూ తెలుసు.

నేపథ్యంలో ఉండి, ఈ గెలుపు కృషి చేసినవాళ్ళు ఉన్నారు. తెలంగాణ వాదాన్ని గెలిపించడం ఎంత కీలకమో ప్రచారం చేసి, ప్రజలకు ఉద్బోధించిన ఉద్యమకారులు వాళ్ళు -ఉద్యోగులు, లాయర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు వగైరాలు.

ఈ ఎన్నికల ఫలితాల శ్రేయస్సులో సింహభాగం ప్రజలకే చెందుతుంది. తెలంగాణను కోరుకున్నారు కాబట్టే.. డబ్బు, మందులాంటివి ఈ ఎన్నికల్లో పనిచెయ్యలేదు. తెలంగాణ ఏర్పడితే అతి తక్కువ లాభపడే వర్గం ఈ ఓటర్లలోని దాదాపు 80 శాతం మంది. లాభమంతా పై రెండువర్గాల వాళ్లకే. ఈ వర్గమే, పై రెండువర్గాలకూ బలం.

ఏదెలాగైనా ఉణ్ణీండి.., ఈ ఫలితాల ద్వారా శ్రీకృష్ణ కమిటీకి తెలంగాణ ప్రజలు తమ అభిప్రాయం చెప్పేసినట్టే!

Categories: తెలంగాణ
  1. July 31, 2010 at 7:50 pm

    అసలు సమస్య హైదరాబాద్ !

  2. July 31, 2010 at 8:46 pm

    బహుశా సమైక్యవాదులు ఎన్నికల ఫలితాల గురించి వేలెత్తి చూపడం వలననో ఏమో, ఈసారి ప్రజలు తెలంగాణా వాదానికి, ఎన్నికలకి ప్రత్యక్షసంబంధం ఉన్న విషయం (ఆలస్యంగా నైనా) గుర్తించారు. అందుకే ఈ ఫలితాలు. బాబ్లీయాత్ర కూడా ఏమాత్రం ప్రభావం చూపలేదంటే ప్రత్యేకతెలంగాణా వల్ల తమకుగల లాభాల పట్ల ప్రజలు స్పష్టంగానే ఉన్నారని అర్థమౌతుంది. ఏదేమైనా మీరన్నట్లు శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇచ్చే వరకూ వేచిచూడ వలసిందే.

  3. July 31, 2010 at 9:03 pm

    TRS రెండు మూడు స్థానాలలో ఓడిపోయినా తెలంగాణావాదాన్ని సమాధి చేసేయొచ్చు అని కాంగ్రెస్ వాళ్లు అనుకున్నారు. కానీ అలా జరగలేదు. శ్రీకృష్ణ కమిటీని నమ్మలేం. కమిటీ కేవలం సలహాలు ఇవ్వడం వరకే కానీ విధాన నిర్ణయం తీసుకోలేదు.

  4. Anonymous
    July 31, 2010 at 10:04 pm

    11 నియోజక వర్గాలు కాదు, ఆంధ్రా రాయలసీమ , తెలంగాణా కలిసి కోరినా 100% కోరినా విభజించడం రాష్ట్రానికి శ్రేయస్కరం కాదు. బలప్రయోగంతో 70 లలో జరిగిన ఇలాంటి ఆందోళనలను అణిచివేసినట్లు అణిచేయాలి. అదే జరిగేది కూడా

  5. July 31, 2010 at 10:07 pm

    శ్రీకృష్ణ కమిటి కి తమ నిర్ణయాన్ని చెప్పటానికా ఈ ఎన్నికల ఖర్చు ?
    ఇప్పుడు సమైక్యవాదులంతా , అలాగే తెలంగాణా మిగిలిన నియోజక వర్గాల శాసన సభ్యులు కూడా రాజీనామా చేసి మళ్ళి గెలిస్తే వాళ్ళ నిర్ణయాన్ని స్పష్టం గా చెప్పినట్లా ? ఏమిటో ఎన్నికల ఫార్సు నాకర్ధం కాదు ఎన్ని సార్లు రాజీనామాలు చేస్తారు ఎన్నిసార్లు మళ్ళి గెలుస్తారు . ఈ ఖర్చు అంత ఎవడి నెత్తిన ?

  6. July 31, 2010 at 10:23 pm

    ఇది ఖచ్చితంగా ప్రజల విజయం. తెలంగాణా విజయం. రాజకీయపార్టీలది ఎంత మాత్రం కాదు. చాలా చోట్ల “TRS డౌన్ డౌన్. తెలంగాణా జిందాబాద్” “KCR డౌన్ డౌన్. కారు గుర్తుకే మీ ఓటు” లాంటి నినాదాలతో ఎన్నికలు జరిగాయి.

  7. July 31, 2010 at 10:24 pm

    election results have strengthened KCR . but is congress in a position to give telangana now?. if congress gives telangana now credit will go to KCR,which is not what congress wants.on the other hand jagan will use the opportunity to raise samaikyandhra & damage congress in andhra area. so congress will loose both telangana & andhra. now i think the situation is similar to the year 1982. ruling party is in doldrums & in utter disarray & the opposition in no better situation. now the time is ripe for a new leadership to emerge & take control of the situation. in the elections of 1983 each & every indivisual has contributed for the down fall of congress. i feel the time has come for a new leader to emerge & take situation under control.

  8. Anonymous
    July 31, 2010 at 10:51 pm

    చదువరి గారు,
    మీరు చెప్పినట్లు ఈ ఎన్నికలలో ఎవ్వరు ఇంత మేజారిటి వస్తుందని ఎవరు ఊహించలేదు. ఎర్ర సినేమాల నారయణమూర్తి తీసిన ఒక సినెమాలో నాకు ఒక సన్ని వేశం గుర్తుకు వస్తున్నాది. అతను కార్మిక నాయకుడు గా ఉండి ఫాక్టరి లో జీతం, సౌకర్యాల సమస్యల పై పోరాడుతూ ఉంటే యజమానులు కార్మికులకు నచ్చె విధంగా గోల్డెన్ షేక్ హాండ్ ప్రకటించి వారికి లక్షల్లో డబ్బు ఆఫర్ చేస్తుంది. అప్పటి వరకు నారాయణ మూర్తి వేంట ఉన్న వాళ్ళు జీతం పెంపుదల కంటె లక్షల్లో వచ్చె రీటర్మెంట్ డబ్బు కి ఆశపడి గోల్డెన్ షేక్ హాండ్ తీసు కోవటానికి మొగ్గు చూపుతారు.
    నారాయణ మూర్తి తన తోటి మిత్రుడు ఓరే సుబ్బారావు వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారు, మీరు దానిని తీసుకోకండి అంటె, సుబ్బారావు అనే కార్మీకుడు నారాయణ మూర్తిని “సే” సుబ్బారావ్ “గారు” అని అంటాడు. నారాయణ మూర్తి కార్మికులంతా యజమానులు చెప్పినదానికి మొగ్గు చూపితే చేసేది ఎమీ లేక చూస్తూ ఉండి పోతాడు.
    ———————————————–
    చదువరి గారు, ఇక్కడ మీలాంటి వారు తెలుగు వారిని చీల్చటానికి జరిగిన కుట్రని అందులోని మర్మాలను, వాస్తవాలాను అందరికి అర్థమయ్యేటట్ట్లు చెప్పటానికి చేతనైన కృషి చేశారు. కాని అవతలి వారు ఎంత సేపటికి తామని అందరూ మోసం చేసారని భవిస్తూ కొంతమంది స్వార్థ రాజకీయ ఎతుగడలో పావులైపోయారు, నచ్చ చెప్పె కొద్ది ఇంకొంచెం అతి తెలివితో వాదిస్తూ చివరికి ఇన్ని అనవసరపు ఆత్మ హత్య లుచేసుకొంట్టునారు. మనం 6 అని ఒక సంఖ్య చూపిస్తె వాళ్ళకది 9 గా కనిపిస్తున్నాది. కనుక మన ఆంధ్ర వాళ్ళంతా ఈ వాదనని ఇక్కడి తో వదిలి వేయటం మంచిది. Let us wait and see what happens. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం.

  9. Anonymous
    July 31, 2010 at 10:52 pm

    @K. Mahesh Kumar
    ఊరందరిది ఒక దారి అయితె ఊరపిట్టది ఇంకో దారంట
    ఎక్కడ చూశావు సామి ఆ బోర్డులను…

  10. July 31, 2010 at 11:02 pm

    ఈ ఫలితాల ద్వారా తెలంగాణా వాదానికి ఒనగూడేదేమీ లేక పోవడం ఏమిటి?
    తెలంగాణా వాదానికి నిజమైన ప్రతినిదులేవరో దొంగ ప్రతినిదులేవరో …
    నయవంచక నాటకాలాడి లబ్ది పొందాలని చూస్తున్న దెవరో …
    ప్రజలు స్పష్టంగా గ్రహించారు. మరింత సంఘటిత మయ్యారు . అవకాశ వాద రాజకీయ పార్టీలకు పాక్షికంగానైనా గోరీ కట్టారు.

    ఈ చైతన్యం 1969 ఉద్యమ సమయంలో లాగా తెలంగాణా కు ఇంటి దొంగలు ఎవరూ వెన్నుపోటు పొడిచే పరిస్థితి లేకుండా చేస్తుంది. అంతిమ విజయానికి బాటలు వేస్తుంది.

    రెండు కళ్ళు, ఇద్దరు కొడుకులు, బాబ్లీ డ్రామా , బంగారు పళ్ళెం లో తెలంగాణా తేవడం లేక బంగారు పళ్ళెంలో తెలంగాణా ఉద్యమాన్ని తీసుకెళ్ళి ఆంద్ర పెట్టుబడి దార్లకు టోకున అమ్మేయడం వగైరా అన్ని వేషాలనూ ఈనాటి తెలంగాణా ప్రజలు గ్రహించారు. అందుకు ఈ ఉప ఎన్నికలు ఎంతో దోహదం చేసాయి.

    ఎన్నికలోస్తేనే కదా మన దగుల్భాజీ రాజకీయ నాయకుల రంగు బయట పడేది!. లేకపోతె ఐదేళ్ల వరకు నియోజక వర్గం మొహం చూడకుండా మేస్తూ కూచోవడమే కదా వీళ్ళ పని.

    ఈ ఉపఎన్నికల ప్రభావం ఎంత తీవ్రంగా వుండ బోతుందో కొద్ది రోజుల్లోనే తెలుస్తుంది ! చూస్తుండండి.

  11. July 31, 2010 at 11:12 pm

    a2zdreams: సమస్యల్లో ఒకటి హైదరాబాద్ అయితే కావచ్చేమో, కానీ ముఖ్యమైన సమస్య నీళ్ళు. చీల్చాలని తేలితేనే ఆ సమస్యలు తలెత్తుతాయనుకోండి.
    హరి దోర్నాల: ఈ ఎన్నికల్లో తెలంగాణ తప్ప మరో అంశమే లేదు కదండి. నీకు తెలంగాణ కావాలో వద్దో చెప్పు అంటూ ఎన్నికలను ఓటరు నెత్తిన రుద్దారు.
    Praveen Sarma: కమిటీ రికమెండేషనిస్తుందండి, విధాన నిర్ణయం చెయ్యదు.
    అజ్ఞాత: “విభజించడం రాష్ట్రానికి శ్రేయస్కరం కాదు” – ఒప్పుకుంటాను. బలప్రయోగం – 🙂 చూద్దాం.
    Sravya Vattikuti: ప్రజల చేత అభిప్రాయం చెప్పించడం తప్ప మరో ప్రయోజనమే ఈ ఎన్నికలకు కనిపించడం లేదు.
    K. మహేష్ కుమార్: ఓ!
    tarakam: ఒకవేళ వెంటనే తెలంగాణ ఏర్పడినా, ఆ రాష్ట్రంలో అధికారం కాంగ్రెసుదే! 2014 లో జరిగే ఎన్నికల నాటికి (రెండేళ్ళన్నా ఉంటది అప్పటికి) అన్ని పార్టీలూ తమతమ మామూలు స్థానాల్లోకి సర్దుకుంటాయి. అంటే, ఎవడి ఓటుబ్యాంకు వాడికే ఉంటుంది. తెలంగాణ వచ్చేవరకే తెరాస కావాలి, ఆపైన అక్కర్లేదు. రాష్ట్రం ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు తెరాస అవసరం ఉండదు. 2004, 2009 ఎన్నికల్లో చూడండి.. తెరాసవి అరుపులే, ఓట్లూ సీట్లూ మాత్రం కాంగ్రెసు, తెదేపాలవి. అసలు నన్నడిగితే వెంటనే తెలంగాణ ఇస్తే అందరికంటే తెదేపాకు ఎక్కువ లాభం. ప్రతిపక్షంలో ఉండి కాంగ్రెసుతో ఆడుకుంటారు, 2014 ఎన్నికల నాటికి అధికారానికొస్తారు.

  12. July 31, 2010 at 11:29 pm

    అజ్ఞాత: నిజానికి తెలంగాణ వస్తే కొద్దో గొప్పో బాగుపడే అతికొద్ది మంది కలిసి మిగతా ప్రజలను ఎగదోసారు. ఇవ్వాళ టీవీలో ఒక నిష్పాక్షిక విశ్లేషకుడు తన వక్రవాణి వినిపిస్తూ ’తెలంగాణ ఇవ్వకపోతే ఇప్పుడు ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళే రేపు మానవబాంబులయ్యే ప్రమాదం లేకపోలేదు’ అని అన్నాడు. ఇలాంటి రాబందులు ప్రజలను రెచ్చగొట్టి ఒక ఉన్మాదాన్ని సృష్టించారు. రేప్పొద్దున నిజంగానే ఏ ఉన్మాదో మానవబాంబుగా మారితే ఇవ్వాళ మాట్టాడిన ఆ వక్రవాణినే దోషిగా నిలబెట్టాల్సి ఉంటుంది.
    Ravi: సరే! 🙂

  13. July 31, 2010 at 11:29 pm

    నేను చెప్పేది అదే. ప్రత్యేక రాష్ట్రం రావాలంటే అది పార్లమెంట్ లో జరగాలి. కమిటీకి కేవలం సలహా ఇవ్వడం వరకే పని ఉంటుంది. మొదటి SRC కూడా ఒక కమిటీయే. కాంగ్రెస్ మొదటి SRCని ఎలా ఇగ్నోర్ చేసిందో, శ్రీకృష్ణ కమిటీని అలాగే ఇగ్నోర్ చెయ్యగలదు.

  14. srinivas T, hyderabad
    July 31, 2010 at 11:35 pm

    తెలంగాణ కోసం ప్రజలు ఉద్యమిస్తున్న తీరును హేళన చేయొద్దు.
    ఇందుకు బాధ్యులు ఎవరో విశేలేషించాలి.
    అహంకారం, అసమానతలు తగ్గకుంటే ఎలాంటి పరిణామాలైనా సంభవిస్తాయి.
    టి.శ్రీనివాస్, హైదరబాద్.

  15. August 1, 2010 at 6:46 am

    @అజ్ఞాత: మీరు అర్థమైన సామెతలాగే ఉంది మీ అవగాహన. అది “ఊరపిట్ట” కాదు. “ఉలిపికట్టె”. తెలంగాణా ప్రజలకు తెలంగాణా రావడం ముఖ్యం, KCR,TRS కాదు. ప్రస్తుతం తెలంగాణా ఉద్యమం రాజకీయాలకు అతీతంగా జరుగుతోంది. అందుకే ఓటు తెలంగాణాకే తప్ప రాజకీయానికి కాదు. నినాదాలూ దాన్ని ప్రతిఫలించాయి.

    మీలాంటోళ్ళు ఫీల్డ్ లో ఎలాగూ ఉండరు.ఎద్దేవా చెయ్యడం మానేసి, కనీసం కొంత అవగాహన కోసమైనా ప్రయత్నించండి.

  16. Anonymous
    August 1, 2010 at 7:05 am

    @ మహేష్ కుమార్
    ఆ అజ్ఞాత సామెత అసలు సామెతకన్నా కొద్దిగా వేరుగా వున్న, స్పెల్లింగ్ మిస్టేక్స్ వున్నా , భావ వ్యక్తీకరణ బాగానే జరిగింది, లక్ష్యాన్ని సరిగ్గానే తాకింది. మీకు బుర్రలో ఒరిజినల్ వెలిగింది.
    హ్హా..హా, బాగా చెప్పావ్ అజ్ఞాతా

  17. August 1, 2010 at 7:58 am

    ఓడిపోయినా మాదే పై చెయ్యి అనడం బాలేదు. రెండు బ్లాగుల్లో జరుగుతున్న చర్చ చదువుతున్నాను. ఆ రెండు బ్లాగుల వ్యాఖ్యలు ఇందులో చూడొచ్చు http://teluguwebmedia.asia/aggregator/categories/2

  18. Anonymous
    August 1, 2010 at 9:39 am

    Chaduvari gaaru,

    Please read below article. It is not related to Telangana issue.
    http://www.andhrabhoomi.net/ka-main-feature/1main-ftr-875

  19. Anonymous
    August 1, 2010 at 10:20 am

    @K. మహేష్ కుమార్,
    అయ్యా మహేశ్ గారు, మీరు అపర మేధావులన్నది జగద్విదితం. మీకు తెలిసినంతగా ఎవ్వరికి తెలియదన్న అహం మీ ప్రతి వ్యాఖ్యలోను ద్వనిస్తుంది. ఎదుటి వాడికెమి తెలియదు,అస్సలు విషయంపైనే అవగాహాన లేదన్న రీతిలొ గేలిచేయటం మీ ప్రత్యేక శైలి. స్పెల్లింగు మిస్టెకులు పట్టడానికి ఇదేమి తెలుగు క్లాసు కాదు కదా. విషయం అర్థమైందా కాలేదా అన్నదే ప్రధానం. ఇక మీరు పెంచుకోమన్న అవగాహనను పొందటానికి ప్రయత్నిస్తాడీ అజ్ణాని.

    ఇక మేము పీల్డ్‌‌లో లేమని ఏ లాజిక్‌‌తో తేల్చేశారు ప్రభూ. మీలాంటొళ్ళు, మాలాంటోళ్ళు అని వేర్వెరుగా మాట్లాడారు. మీలాంటోళ్ళు, మాలాంటోళ్ల మద్యలొ తేడాలు వుంటె చెప్పండి గుర్వుగారు. అదేదో మీరు అపరజ్ణానులు, మేమెమో అక్షరముక్క తెలియని సన్నాసులం అన్న అర్థం ద్వనిస్తుంది మీమాటల్లో.

    ఇక దీంట్లో కూడ ఎమన్న అక్షరదోషాలు వుంటె పెద్ద మనస్సుతో చమించు.

  20. August 1, 2010 at 11:14 am

    ఆ లింక్ చదివాను. నువ్వు చెప్పాలనుకున్నది ఏమిటంటే తెలంగాణా వస్తే ఇస్లామీకరణ జరుగుతుందనే కదా. తెలంగాణా కంటే రాయలసీమలో ముస్లింలు ఎక్కువ నాయనా. కరీంనగర్, వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలలో ముస్లిం జనాభా 7% మాత్రమే ఉంది. హైదరాబాద్ జిల్లాలో మరియు ఆదిలాబాద్ జిల్లా భైంసా పట్టణం ఈ రెండు చోట్ల మాత్రం ముస్లిం జనాభా 40% ఉంది. రాయలసీమలో ఇస్లాం మతంలోకి మారినవాళ్లు పేదరికం కారణంగా ముల్లాహ్ లు చూపిన డబ్బులుకి ఆశపడి ఆ మతంలో చేరి ఉండొచ్చు. వాళ్లు జిహాద్ ఇంక్లినేషన్ ఉన్నవాళ్లు కాకపోవచ్చు. తెలంగాణాలో హైదరాబాద్, భైంసా లాంటి ప్రాంతాలు మినహా చాలా చోట్ల ముస్లిం జనాభా తక్కువ కనుక అది సమస్య కాదు.

  21. August 1, 2010 at 11:31 am

    Praveen Sarma: ఆ లింకుకు, తెలంగాణ సమస్యకూ సంబంధం లేదని చెప్పారు. మీ వ్యాఖ్య అసంబద్ధం. ఆ విషయమ్మీద ఇక వ్యాఖ్యానించకండి.

  22. August 1, 2010 at 12:14 pm

    నీళ్లు సమస్య అని నేను అనుకోను. పోతిరెడ్డిపాడు విషయానికి వస్తే అది కడప జిల్లాకి సంబంధించిన సమస్య. ఆ ఇష్యూ తెచ్చిన రాజశేఖరరెడ్డి బతికి లేడు.

  23. Prakash
    August 2, 2010 at 5:32 pm

    @a2zdreams, 31 జూలై 2010 7:20:00 pm GMT+05:30: “అసలు సమస్య హైదరాబాద్!”: Ab aagayana apni aukad par! If andhras want Hyderabad, let 3-4 MLAs resign and contest on a “samaikyandhra” agenda.

    @అజ్ఞాత, 31 జూలై 2010 9:34:00 pm GMT+05:30: “బలప్రయోగంతో 70 లలో జరిగిన ఇలాంటి ఆందోళనలను అణిచివేసినట్లు అణిచేయాలి”: This fascist method will not work now. Eent ka jawab pathar se milega.

    @Sravya Vattikuti, 31 జూలై 2010 9:37:00 pm GMT+05:30: “ఇప్పుడు సమైక్యవాదులంతా, అలాగే తెలంగాణా మిగిలిన నియోజక వర్గాల శాసన సభ్యులు కూడా రాజీనామా చేసి మళ్ళి గెలిస్తే వాళ్ళ నిర్ణయాన్ని స్పష్టం గా చెప్పినట్లా?”: Even if they win (a pipedream in any case), what does it prove? It will show that Andhras want to stay united against the wish of Telangana.

  24. Ram Reddy
    August 4, 2010 at 7:01 am

    K. మహేష్ కుమార్ గారు చెప్పినట్టు కెసిఆర్/తెరాస అంటే ఇష్టం లేకపోయినా తెరాస కు ఓటు వేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తెరాస డౌన్ డౌన్ అంటూనే TDP వాళ్ళు తెరాసకు ఒటేసారు.

    @అజ్ఞాత, “11 నియోజక వర్గాలు కాదు, ఆంధ్రా రాయలసీమ , తెలంగాణా కలిసి కోరినా 100% కోరినా విభజించడం రాష్ట్రానికి శ్రేయస్కరం కాదు. బలప్రయోగంతో 70 లలో జరిగిన ఇలాంటి ఆందోళనలను అణిచివేసినట్లు అణిచేయాలి. అదే జరిగేది కూడా”
    అజ్ఞాత గారు,
    బలప్రయోగం, అణిచివేయటం తెలంగాణ ప్రజలు 40 ఏండ్ల నుండి చూస్తూనే ఉన్నారు. వాల్లకిది అలవాటుకూడా అయింది. ప్రజల అభీష్టానికి విరుద్దంగా ఇలా అణిచివేయటం మంచిదేనా అని మీలాంటి వాళ్ళు ఆలోచించాలి.
    ఏది ఏమయినా తెలంగాణ స్వరాష్ట్రంగా అవతరించక మానదు. హైదరాబాద్ లో ఉన్న ఆంధ్ర lobbyists కు తిప్పలు తప్పవు. మిగిలిన గుడ్ ఆంధ్ర సిటిజెన్స్ హైదరాబాద్ నుండి ఎక్కడికి వెళ్ళరు. వాళ్ళు కూడా తెలంగాణ వాళ్ళే కదా!

  25. August 4, 2010 at 8:23 pm

    ప్రస్తుత రాజకీయాది పరిస్థితుల్లో కేంద్రం తెలంగాణ ఇవ్వడం కష్టం. 11 కాదు, కేసీయార్ 111 సీట్లు గెల్చుకున్నా సరే, ఏమీ లాభం లేదు. అలా ఇవ్వాలంటే కేంద్రానికి మంచి నమ్మకమైన గూఢచారివర్గం నుంచి సానుకూలమైన సమాచార ఉపచయాలు (intelligence inputs) అందాలి. రాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితి ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి అన్నట్లుంది. తొందరపడి తెలంగాణ ఇచ్చేస్తే రెండు ప్రాంతాల్లోను గల్లంతే. మఱోపక్క పుణ్యకాలం చాలావఱకు అయిపోయింది కనుక, పని ముందుకు సాగలేదు కనుక శ్రీకృష్ణ కమిటీవారు కాలపరిమితి పొడిగింపు కోసం అభ్యర్థించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎంత ? అంటే అది మఱో ఆర్నెల్లు కావచ్చు, మఱో ఏడాది కావచ్చు.

  26. August 4, 2010 at 8:27 pm

    కాబట్టి డిసెంబర్ తరువాత టి.ఆర్.ఎస్. వారు మళ్ళీ రాజీనామాలు చేసి ఉప-ఎన్నికలకు వెళ్ళే అవకాశం కనిపిస్తున్నది. ఎలాగైనా ఈ ఇష్యూని నిరంతరాయంగా లైమ్ లైట్ లో పెట్టాలి కదా !

  1. No trackbacks yet.

Leave a reply to Sravya Vattikuti Cancel reply