Home > రాజకీయాలు > పోయినోళ్ళందరూ మంచోళ్ళే..

పోయినోళ్ళందరూ మంచోళ్ళే..

పోయినోళ్ళందరూ… మంచోళ్ళు! ఉన్నోళ్ళూ పోయినోళ్ళ తీపి గురుతులు!!  -ఆత్రేయ చెప్పాడంట.

రాశేరె కూడా పోయాడు. కాబట్టి చాల మంచోడు! 

రింగురోడ్డు వ్యవహారంలో  స్వజనుల కోసం, స్వలాభం కోసం  రాశేరె ప్రభుత్వం మెలికెలు తిరిగిందనీ, రింగురోడ్డును మెలికెలు తిప్పిందనీ ఇప్పుడు తేలిపోయింది.  అది రింగురోడ్డు కాదు, రాంగురోడ్డని తేలిపోయింది. అయినా సరే.., చచ్చిపోయాడు కాబట్టి, మంచోడే! స్టాంపులు వెయ్యొచ్చు!

ముఖ్యమంత్రిగా ఉండగా బాగా డబ్బు సంపాదించుకున్నాడని, పాపం సోనియా కూడా చెప్పుకుని వాపోయిందంట. ఆ సంగతి తెలిసి  కూడా, అతడు “పార్టీకి చేసిన సేవల”ను  దృష్టిలో ఉంచుకొని రెండుసార్లు ముఖ్యమంత్రిని చేసానని చెప్పిందంట.   “పార్టీకి సేవ” చెయ్యడంలో అంతరార్థం ఏమిటో, అతడు చేసినది పార్టీ సేవో, సోనియా సేవో జనపథికులకెరుక! మనకు మాత్రం ఒక సంగతి తెలిసింది – “పార్టీ” సేవలో భాగంగా మన డబ్బు మింగేసాడని! “పార్టీ”కి సేవ చేస్తున్నాడు కాబట్టి సోనియాకు సమ్మగానే ఉండేది కాబోలు!

ఏదేమైనప్పటికిన్నీ.., రాశేరె చచ్చిపోయాడు కాబట్టి, అతడు చాల మంచోడు. వీధివీధికీ విగ్రహాలు పెట్టొచ్చు.

అల్లుడికి ఎకరాలు రాసియ్యడం చూసాం. కానీ ఊళ్ళు రాసిచ్చెయ్యడం మాత్రం బయ్యారంలో చూసాం. ఊరుమందే తోసెయ్ అన్న సినిమా డైలాగు విన్నాం. కానీ ఊరు మందే తవ్వేయ్ అని చెప్పి, అప్పజెప్పేసినవాణ్ణి చూసాం మనం. మన ఖర్మ అది!  అయినా సరే… అతడు చచ్చిపోయాడు కాబట్టి రాశేరె  చాల మంచోడే! అతడి పేరు జిల్లాకి పెట్టెయ్యొచ్చు.

సిమెంటు  ఫ్యాక్టరీ, స్టీలు ఫ్యాక్టరీ, విద్యుత్తు ప్రాజెక్టులు, రియలెస్టేటు,  పేపరు, టీవీ,..  ఐదంటే ఐదే ఏళ్ళలోపు ఇవన్నీ సాధ్యపడ్డాయి. మన డబ్బుల్ని అడ్డంగా దోచేస్తే ఇవేంటి, ఇంకేమైనా సాధ్యమే!  వీటన్నిటికీ మూలధనం కింద సెజ్జుల పేరుతో భూములు, జలయజ్ఞాలు, (అ)సత్యాలు మొదలైనవి ఆహుతయ్యాయి.

ఐనా సరే…   

రాశేరె ముఖ్యమంత్రిగా ఉండగా పనిచేసి రిటైరైన అయ్యేయెస్ అధికారి రామచంద్ర సమాల్ ఇలా అన్నాడు..
“ఆంధ్రప్రదేశ్ భూగర్భాన్ని సముద్రంలోపల, సముద్రం బయటా ఇంత వ్యవస్థీకృతంగా దోపిడి చేయటం ఎప్పుడూ చూడలేదు.”
“..అన్ని ఇంజినీరింగ్ విభాగాల్లో ప్రస్తుత నాణ్యత నియంత్రణ వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. ప్రత్యామ్నాయం ఒక భ్రమ. అందరూ కాంట్రాక్టర్లుగా మారిపోయారు.”

ఐనా సరే… చచ్చిపోయాడు కాబట్టి అతడు చాల మంచోడే!

పోయినోళ్ళందరూ మంచోళ్ళే.. ఉన్నోళ్ళం మాత్రం వాళ్ళ కాటుకు, వాళ్ళ వేటుకు , వాళ్ళ  మేళ్ళకూ బలైన వాళ్ళం.

Advertisements
 1. September 10, 2010 at 6:38 pm

  Excellent.

 2. Anonymous
  September 10, 2010 at 7:05 pm

  good one..!!

 3. September 10, 2010 at 7:21 pm

  పోయినోళ్ళందరూ… మంచోళ్ళు! ఉన్నోళ్ళూ పోయినోళ్ళ తీపి గురుతులు!! -ఆత్రేయ చెప్పాడంట.
  పోయినోళ్ళందరూ… మంచోళ్ళు! ఉన్నోళ్ళూ పోయినోళ్ళ తీపి గురుతులు!! – jajan kuda ade cheptunnadu…

 4. September 10, 2010 at 7:29 pm

  ఔ ఔ…శానా మంచోడు

 5. September 10, 2010 at 7:57 pm

  @శ్రావ్యగారు: దాడి అనగానే ఎగేసుకుంటూ వచ్చా…ఏదీ ఎక్కడ దాడి ?

 6. September 10, 2010 at 8:03 pm

  నాగార్జున గారు అంత సరదా నా 🙂
  ఇంతకు ముందు ఒక అభిమాని గారు వారి పెద్ద మనసు చూపించారు లెండి .

 7. Anonymous
  September 10, 2010 at 8:04 pm

  నాకు రాశేరె మీద కంటే ఇప్పటికీ అతన్ని గుడ్డిగా నమ్మి అతన్ని దేవుణ్ణి చేస్తున్న ప్రజలను చూస్తే కోపమొస్తుంది. వాళ్ళకు ఏం చెప్తే అర్ధమవుతుందో, ఎలా చెప్తే అర్ధమవుతుందో తెలియటం లేదు. జనాన్ని నమ్మించటానికి వ్యవస్థలనన్నీ నిర్వీర్యం చేశాడు. ఖజానా అంతటినీ కొల్లగొట్టాడు. అయినా మనోళ్ళకింకా బుద్ది రావటం లేదు. ఇది నిజంగా మన ఖర్మే.

 8. September 10, 2010 at 8:04 pm

  దాడి ఎక్కడ ?

 9. September 10, 2010 at 8:04 pm

  Sravya Vattikuti: ఔనండి! 🙂 బ్రూక్లిన్ లో ఉన్నా, స్కోలాస్టిక్ లో పనిచేస్తున్నా బూతుకూతలు పోలేదు.

  nagarjuna: 🙂 సారీ అండీ.., తీసేసాను. హారంలో చూడండి, కనబడొచ్చు. అయితే దాడిని బ్రూక్లిన్ లో, స్కోలాస్టిక్కులో చేస్తే ఎలా ఉంటుందా అని చూస్తున్నాను. 🙂

 10. September 10, 2010 at 8:09 pm

  harephala, అజ్ఞాత,ప్రేమిక: నెనరులు
  అజ్ఞాత: “ఖజానా అంతటినీ కొల్లగొట్టాడు.” -నిజం!
  శ్రీనివాస్: 🙂

 11. September 10, 2010 at 8:19 pm

  నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది – ఇలా నాయకులు అక్రమంగా సంపాదించుకునే ప్రజాస్వామ్యం కంటే వంశపారంపర్యంగా ఆస్తులు సంక్రమించే రాజఱికాలేమీ చెడ్డవి కావు అని. ఒక రకంగా అవే నయం, ఇంకా ఎక్కువ సంపాదించేద్దామన్న కాంక్ష గానీ, జనం డబ్బుని దోచుకుందామనే ఆబ గానీ ఉండవు. వాళ్ళ దగ్గఱ అప్పటికే చాలా ఉంటుంది గనుక. ఆ ఆస్తులకు వ్యవస్థ భద్రత కల్పిస్తుంది గనుక. కనీసం పూర్వపరిపాలకులైన తమ వంశస్థుల పేరు నిలబెట్టాలన్న యావ అయినా కొంత ఉంటుంది.

 12. September 10, 2010 at 9:48 pm

  ఒక తాపీ మేస్త్రీ & ఖూనీ కోరు, బందిపోటు, మరియు దొంగల ముఠా నాయకుడు కొడుకు , ఒక సాదా సీదా factionist , సోనియా గాంధి దయతో ముఖ్య మంత్రి అయి , తొటి factionist లందరిని ఒక త్రాటి మేదకు తీసుకొచ్చి గొడవలు కొట్లాటలు లేకుండ ప్రజల సొమ్ము ఎలా లూటీ చేయాలో నేర్పి క్రోనీ కాపిటలిసం పాటించి అందరూ థగ్గులు పిండాకోర్లు లాగా రాష్త్ట్రాన్ని దొచుకుని కుక్క చావు చచ్చినా పోయినోళ్ళందరూ మంచోళ్ళే.

 13. September 10, 2010 at 10:13 pm

  ఆహా! 🙂

  చిన్నప్పుడు పిశాచాల కథ విని బోల్డు ఆశ్చర్యపోయేవాడిని. అందులోనూ 60-70 శాతం మంచి పిశాచాలే ఉండేవి. మంత్రాలకు భయపడో, బోల్డు దెబ్బలు తినో, ముంతపొగలెడితోనో, చివరికి అవే బాధపడో మిగిలిన శాతంలోవి మొత్తానికి కథ అయిపోయేసరికి మంచివైపోయేవి..కట్ చేసి ఈ కాలానికొస్తే ఈ కాలం పిశాచాలు అలా కనపడట్లా. ఏదో విధంగా – అనగా – మీరు చెప్పిన పైవిధాలే గాక బోల్డు పిండప్రదానాలతో పీక్కుతింటున్నాయి. పాత పిశాచాలు చెట్ల మీద, పాడుకొంపల్లోనూ వాసం చేస్తూ ఉండేవని గుర్తు, ఇప్పుడు “రాజకీయాల్లో” ఆవాసమేర్పరుచుకున్నాయిట.

  పాతతరం పిశాచాలకు కడుపులొక్కటే పెద్దవి. ఇప్పటివాటికి నోరూ, కడుపూ అన్నీ పెద్దవే. కడుపులోకి ఎంత వేసినా గంగాళంలో చుక్క తాగినంతే తంతుగా ఉన్నది. ఎవరో పెద్దాయనన్నట్టు, కుంభాలతో తృప్తీ లేదు, దిగదుడుపులతో తనివి తీరటమూ లేదని….

  పోయినోళ్ళంతా పిశాచాలవుతున్నారో లేదో తెలీదు కానీ, మంచోళ్ళు అన్న ఆత్రేయ గారి మాట మాత్రం మన నాలిక మీద మిగిలిపోయింది. అదండీ సంగతి… అయినా మూర్ఖులకు పునరుక్తి అంటే తెలీక అలా అంటూ ఉంటారండీ బాబు…ఈగలు గాయాలు వెతికితే, దుష్టులు దుర్గుణాలు వెతుకుతారంట…రుచుల నుంచి బాధలూ, అత్యాశ నుంచి పాపాలు వస్తాయి….

  రాశేరె గారున్నప్పుడు తినటం ఎలాగున్నా, ఈనాటి విభజనల గోలలలొక్కటే కాకుండా, కిక్కురుమనకుండా అందరూ ఎవరి పని వారు చేసుకున్నారు. అందుకు ఆయన్ని మెచ్చుకుంటాను నేను. పోయాక ఇట్టాంటివన్నీ బయటకొస్తాయనుకోండి….అది వేరే సంగతి…మరి మళ్ళీ అదే మాట…మూర్ఖులకు పునరుక్తి అంటే తెలీక ఆత్రేయగారి మాటలకు వేరే అర్థాలు తీస్తారనిన్నూ, పట్టుకుంటారనిన్నూ…. 🙂

  ఆత్రేయా – పోయి ఏ లోకానున్నావో కానీ, శతకోటి దండాలయ్యా…

  PS: Could not agree more with tADEpalli gAru….

 14. September 10, 2010 at 11:17 pm

  gooppore !!!

 15. September 11, 2010 at 12:59 am

  తాడేపల్లి గారు, మీరు చెప్పిందాంట్లొ నిజమున్నాది. ఎందుకంటె మన దేశం లో బ్రిటిష్ వారి పాలన తో పోలిస్తె మన రాజుల పాలన ఎంతో మెరుగు. మైసూర్, ట్రవంకోర్, బరోడా రాజుల పాలన గురించి చదివితె తెలుస్తుంది. ప్రతి దేశం లో లా మన దేశంలో విప్లవాలు లాంటి జరగక పోవటం ఇందుకు నిదర్శనం. అలా ప్రజలను నిజం గా పీక తిన్న వారి పై తేలంగాణా వారు పోరటాం చేశారు. కాని ఈ రాజరికం మీద ఎక్కడలేని దుష్ప్రచారాన్ని కమ్యునిస్ట్లు చెపట్టరు. వీరు ఆదేశ విప్లవ చరిత్ర ,ఈ దేశా విప్లవ చరిత్ర చదివి, అదేదో ఇక్కడ కూడా వచ్చేస్తున్నాదై ప్రజలకి అందమైన భవిషత్ ను అరచేతిలో చూపుతూ, గతం అంతా చెత్తని బురద జాలి, దానిని పుస్తకాలలో నింపారు. అంతకు మించి వీరు సాదించింది ఎమైనా ఉందా అంటె ఆపార్టీలో వారు ఎప్పటికి అధికారం లో రారు కనుక నిజాయితీ పరులైనట్లు మాట్లాడటం. వ్యవస్తలో లోపాలు ఎత్తి చూపటం, ప్రభుత్వాన్ని బెదిరించటం లాంటివి చేస్తూ నాలుగు రూకలు జేబులో వేసుకోవటం. ఈ పార్టి చరిత్ర బాగా తెలిసిన, ఈ పార్టి సభ్యులు కొందరు ఇలా రోజు వీధి పోరాటాలు చేసి డబ్బులు సంపాదించే కన్నా సోఫెస్టికేటేడ్ గా పేపరు పెట్టుకొని డబ్బులు సంపాదించటం ఉత్తమమని నిర్ణయించి తెర వెనుక ఉండి డబ్బులు దండటం, రాజకీయ చక్రం తిప్పటం మొదలు పెట్టారు. ఇప్పుడి ఈ కిటుకు అందరికి అర్థమై మీడీయా బాట పట్టారు. ఈ దెబ్బతో కమ్యునిస్ట్లు ములా పడ్డా, వారు రాసిన పుస్తకాల లోని రాజరికం చాలా ఘోరమైందన్న భావన నుంచి మనం బయట పడలేకున్నాము.
  ————————————————-
  మీడియాలో జరిగె చర్చల లో కమ్యునిస్ట్ మేధావులు ఎక్కువగా పాలోగొనటం వలన వారు కుళ్ళి పోయిన ఈ వ్యవస్తను ఇంకా బాగు పరచగలం, ఆ చట్టం తేవాలి ఈ చట్టం తేవాలి అని వాగుతూండటం వలన చూసేవారికి ఒక ఆశని కలిగిస్తారు. ప్రజాస్వామ్యం లేక పోతె అసలికి ప్రభుత్వమే నడపలేమని, ప్రజాస్వామ్యానికి ఒక ప్రత్యామ్న్యమే లెదనే విధం గా బుర్రని కడుగుతున్నారు. నిజం చెప్పాలి అంటె రాజరికం వ్యవస్థ ఈ రోజులలో లా దిగజారి ఉంటె కనీసం ఒక చాణ్యుక్యుడిలాంటి వాడు సమాజంలో పుట్టి బాగు పరచి ఉండేవడనే ఒక ఆశ అన్నా ఉండేది. ఇప్పుడది లేదు. ఇప్పుడు మన వ్యవస్త మారాలి అంటె డబ్బు తీసుకొని వోటు వేసె వోటరు లో విప్లవాత్మకమైన మార్పులు రావాలి. వారు కనీసం వరుసగా నాలుగు ఎన్నికలు నిజాయితి ఐన ప్రజా ప్రతి నిధులకు మద్దతిస్తె గాని రాజకీయ పార్టీల పని తీరు మారదు. ఇదంతా జరిగే పనేనా? 60సం|| స్వాతంత్ర కాలంలో మనం చదివే చదువులలో ప్రగతి గురించి, విదేశాలలో మన తెలివి, తేటల గుర్తింపు గురించి మాట్లాడు తామే కాని, సంవత్సరం కిందట వేసిన రోడ్ నుజ్జ్జు నుజ్జు గా తయారైతె చూస్తూ ఉరుకుంటాం. సర్దుకు పోతున్నాము. ఇలా ఎంత కాలమో మనకు ఓపిక ఉంట్టుందో చూడాలి.

 16. September 11, 2010 at 1:39 pm

  మన దేశంలో ప్రజాస్వామ్య రాజఱికం రావాలి. అది కూడా లిఖిత రాజ్యాంగబద్ధంగా నడవాలి. 90 శాతం అధికారాలు ప్రజలెన్నుకున్న సభకూ, దాని ద్వారా వచ్చిన కేబినెట్ కూ ఉండాలి. మిహతా పది శాతం అధికారాలు (వాటిలో ఎక్కువభాగం వీటో/ అబేయన్స్ పవర్స్) మాత్రమే రాజుకు ఉండాలి. Semi-executive Monarchy అన్నమాట. ఈ వ్యవస్థ అఖిలభారతస్థాయిలో సాధ్యపడదు కనుక ఏ రాష్ట్రానికా రాష్ట్రంలో ఒక రాజుండాలి. దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్టితో రాజుల వల్ల జాతి యొక్క జీవనంలో చాలా ఉపయోగం ఉంది. రాజవంశాలు ఆయా ప్రాంతాలకు రాజకీయవారసత్వాన్ని, ఉమ్మడి చరిత్రనీ అందిస్తాయి. ఆయా రాజ్యాలకు జాతీయవాదాన్ని ఏర్పఱుస్తాయి. ఉదాహరణకు – మన ఆంధ్రప్రదేశ్ కి అంతా కలిపి ఒక రాజవంశం ఉంటే వేర్పాటువాదాలెప్పటికీ తలెత్తవు. ప్రజాస్వామ్యమనేసరికి ప్రతివాడూ నా ముక్క నేను పెఱుక్కుని పోతానంటాడు.

 17. Anonymous
  September 11, 2010 at 4:35 pm

  >> మన దేశంలో ప్రజాస్వామ్య రాజఱికం రావాలి.

  తాడేపల్లి గారు, ఇప్పుడు నడుస్తుంది అదేగదండి. మన యువరాజా వారి కోసం ఆపద్దర్మ మన్మోహనుడు ఎదురుచూడట్లేదా? యువరాజు గారు దేశదేశాలు విహరించి ప్రజల కష్టసుఖాలు తెలుసుకొని రాగానే సిమ్హసనం అదిష్టిస్తారు.

 18. Anonymous
  September 11, 2010 at 4:37 pm

  is there any virgin land that our raja didn’t eyed on?

 19. September 11, 2010 at 11:36 pm

  గొంగట్లో తింటూ వెంట్రుకలేఱుకోవడం లేదు కదా మనం ? అనిపిస్తుంది. అవినీతికి పాల్పడకుండా పరిపాలించడం అంత కష్టమా ? అనిపిస్తుంది. ప్రభుత్వాధినేత తాను స్వయంగా అవినీతిపరుడు కాకపోయినా తన పార్టీవారూ, తన మంత్రివర్గ సహచరులూ అవినీతికి పాల్పడుతూంటే చూసీ చూడనట్లు పోవాల్సిందే. లేకపోతే అందఱూ కలిసి అతన్ని దించేస్తారు. తాను వ్యక్తిగత స్థాయిలో చేయాలనుకున్న ఆ కాస్త మంచి కూడా చేయలేనివాడై ఇంటికెళ్ళాల్సి వస్తుంది.

  కానీ ఒక మాట మాత్రం నిజం. ప్రభుత్వాధినేతలు సరైనవాళ్ళయితే ఈ అవినీతిజాడ్యం సగమైనా తగ్గుతుంది. తగ్గి తీఱుతుంది. కానీ అలాంటి “సరైనవాణ్ణి” అసలు కుర్చీ ఎక్కనిస్తారా మన ప్రజలు గానీ, నాయకులు గానీ, పార్టీలు గానీ ? అత్యాశలా ధ్వనించడం లేదూ ?

  రెండోది – డబ్బున్నవాడి కనుచూపుకే పరవశించిపోతుంది మన సమాజం. అతని పలకరింపుకు నిలువెల్లా పులకించిపోతుంది. సంపాదించే యావ లేని నాయకుడు (?) ప్రజల మధ్య సోదిలోకి కూడా రాడు. “తాను బాగుపడ్డమే చేతకానివాడు మనల్నేం బాగుచేస్తాడులే ?” అని వ్యాఖ్యానిస్తారు అతితెలివిగా ! అలాంటివాడు ప్రజల దృష్టిలో Dull, uninspiring.. దేశాన్ని బాగుచేయాలంటే ఒక మంచి నాయకుడికి కనీసం రెండు హయాములైనా కావాలి. అయిదేళ్ళలో అద్భుతాలేమీ జఱగవు. కాబట్టి రెండోసారి ఎన్నికల్లో నిలబడాలంటే డబ్బు కావాలి. మఱి తినక చస్తాడా మానవుడు ?

 20. September 12, 2010 at 6:53 am

  Evaro Agnatha post chesadu .. YSR ni prajalu guddi ga believe chesaru ani..
  Nee / naa laanti news paper jeevulu maatrame YSR ni believe cheyyandi.. Yendukanate.. paper jeevulaki burra vundudu.. what ever they read in news paper they blindly believe that. They dont know the ground reality…
  Anni kotla mandi guddi ga yenduku nammutunnaro.. okka saari computer / blogs vadili villages ki vellu telustadi…

 21. September 12, 2010 at 7:49 am

  చదువరి గారూ…,వినాయక చవితి శుభాకంక్షలు

  హారం

 22. satya
  September 12, 2010 at 4:22 pm

  sreeny, what a cynical attitude. U must feel ashamed of supporting such a corruptionist.

 23. Anonymous
  September 13, 2010 at 10:13 pm

  okka saari computer / blogs vadili villages ki vellu telustadi…

  Sreeny Garu…U Know the GROUND REALITY..which these people can’t understand. Your comment is a exact reply to this useless post!

 24. September 13, 2010 at 10:50 pm

  చివరి అజ్ఞాతా, నేను చెబుతోంది “గ్రౌండు రియాలిటీ షో” ల గురించి కాదు. రాశేరె చేసిన “గ్రాండ్ రియాల్టీ షో” గురించి చెబుతున్నాను.

  ————-
  నిన్ను నువ్వు బాగు చేసుకుంటే దేశాన్ని బాగు చేసినట్టే అనే సూత్రాన్ని త్రికరణ శుద్ధిగా పాటించిన ఆ అవినీతి చక్రవర్తి, ఆ అభినవ షాజహాను చేసిన అవినీతి నిజమేనని ఒక్కొక్కటే బైట పడుతూంటే, ఇంకా “రియాలిటీ ఏంటా” అని వెతుక్కునే అనామకులను చూస్తోంటే జాలేస్తోంది.

 25. Anonymous
  September 14, 2010 at 12:23 am

  పొయినొల్లందరు ముంచారు,వున్నొల్లు ముంచుతారు(యెవరైనా మిగులుంటె).తారకంగారు గ్రేట్,గ్రౌండ్ రియాలిటి మొత్తం చెప్పారు.మల్లీ రాజరికాల?

 26. September 14, 2010 at 11:50 pm

  మహా నేత, ఆపధ్బందు, జనహృదయ నేత గురించి మా గొప్పగా రాసారండీ….

 27. Giri
  September 15, 2010 at 12:37 am

  రాశేరె ఎలా దేవుడవుతున్నాడన్న సందేహాన్ని, రాశేరె వీర భక్తులముందు ఉంచి…కొంత వేడి వేడి వాదులాటల తర్వాత – చిలికిన మజ్జిగ మీది వెన్నంతా దొంగిలించి, మజ్జిగ నీళ్ళు (ఆరోగ్య శ్రీ, ఫీజుల రీఎంబర్స్మెంట్ లాంటివి) మీ మొహాన కొట్టాడు అని చెబితే – రాశేరె తప్ప, ఆ మజ్జిగ నీళ్ళనైనా మా మొహాన కొట్టిన వాళ్ళు ఇప్పటి వరకూ ఎవరూ లేరుగా అన్నారు.
  వాళ్ళకేమి సమాధానం చెప్పి ‘ఓదార్చాలి’?

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: