Archive

Archive for the ‘మతం’ Category

బాబ్రీకట్టడపు కూల్చివేత వార్షికోత్సవం

December 7, 2009 33 comments

పురుషోత్తముడి గుడిని కూల్చేసి మసీదునొకదాన్ని కట్టాడో దురాక్రమణదారు. తన జాతి వారసత్వంపై మక్కువ, గర్వమూ ఉన్న ఏ స్వతంత్ర ప్రభుత్వమైనా ఆ కట్టడాన్ని పడేసి మళ్ళీ గుడి కట్టుకుంటుంది. ఎందుకంటే అది జాతి గౌరవంతో ముడిపడి ఉన్నది కాబట్టి. ఎంచేతో మన ప్రభుత్వాలు ఆ పని చెయ్యట్లేదు. మరి ఇవి ప్రభుత్వాలు కావో, లేక వాటికి ఈ జాతి వారసత్వం పట్ల గౌరవం లేదో!! ప్రభుత్వాలు ఎలాగన్నా పోనీండి.., ఆ పనేదో తామే చేసుకోవాలనుకున్నారు, హిందువులు. ఆ పనిలో సగభాగం పూర్తై మరో ఏడాది గడిచిపోయింది. గుడి కట్టే కార్యక్రమం మాత్రం ఇంకా మొదలు కాలేదు.

ఇన్నేళ్ళుగా ‘అక్కడ గుడిని కట్టలేదేఁ?’ అని హిందువులెవరూ అడగలేదు. కానీ మైనారిటీ నాయకులు, మైనారిటీవాదపు మహారాజ పోషకులు మాత్రం మసీదు కట్టలేదేంటని వాపోతున్నారు, కళ్ళనీళ్ళు పెట్టేసుకుంటున్నారు, కుళ్ళికుళ్ళి ఏడుస్తున్నారు. హిందూ మతస్తులకు వ్యతిరేకంగా ఐక్యవేదికనొకదాన్ని పెట్టేసుకున్న కొందరు (దానికి హిందూ మతోన్మాద వ్యతిరేక వేదిక అని పేరు పెట్టుకున్నారు) ఆ వేదిక మీద కూచుని హిందువులపై విషం గక్కారు. ఈనాడులో వచ్చిన ఆ వార్త చూడండి..

బాబ్రీ మసీదును కూల్చిన చోటనే నిర్మించాలని విప్లవ రచయితల సంఘం (విరసం) రాష్ట్ర నాయకులు ——— డిమాండ్‌ చేశారు. రాష్ట్ర హిందూ మతోన్మాద వ్యతిరేక ఐక్య వేదిక ఆధ్వర్యంలో ‘డిసెంబర్‌ 6ను హిందూ మతోన్మాద వ్యతిరేక దినంగా పాటిద్దాం’ అని ధర్నా నిర్వహించారు. బాబ్రీ మసీదు కూల్చివేతపై నియమించిన లిబర్హన్‌ కమిషన్‌ నివేదికలో ఉన్న దోషులను ఇంతవరకూ శిక్షించలేదన్నారు. భాజపా నాయకులు మాజీ ప్రధాని వాజ్‌పేయి, అప్పటి ప్రధాని పి.వి.నరసింహరావు కూడ మసీదు కూల్చివేతకు సహకరించారని ఆరోపించారు. సామ్రాజ్యవాదులు, హిందూమతోన్మాద శక్తులు ముస్లింలపై దాడులు చేస్తున్నారని వివరించారు. అందులో భాగంగానే గతంలో నగరంలో జరిగిన మతకల్లోలాలు వారు సృషించినవేనని ఆయన ఆరోపించారు. …  

 ఈ వేదికనెక్కిన శ్రేష్ఠులందరూ కూడా కావాలనుకున్నప్పుడల్లా గుడ్డితనం, బెమ్మజెముడూ పొందగలిగే వరమొకదాన్ని కమ్యూనిజం/మార్క్సిజం/లెనినిజం/మావోయిజం/పోవోయిజం/రావోయిజం/లేవోయిజం/… వగైరాల నుండి సంపాయించారు. స్వచ్ఛంద మరణం లాగా స్వచ్ఛంద అంగవైకల్యమన్నమాట! వీళ్ళకున్న మానసిక వైకల్యాలకు ఈ శారీరిక వైకల్యాలు తోడై, వీళ్ళను హిందూమత వ్యతిరేక రాక్షసులుగా మార్చాయి. హిందూ వ్యతిరేక, మైనారిటీ పక్షపాత రజాకార్లు వాళ్ళు. పాపం అంచేతే, వీళ్ళకి..

మక్కా మసీదులో, లుంబినీలో, గోకుల్ చాట్‌లో, దేశంలో ఇంకా అనేక చోట్ల బాంబులు పేలిన ఘటనలు  కనబడవు, ఆ మోతలు వినబడవు. ఒకవేళ వినబడ్డా.. “ఈ పేలుళ్ళకు ముస్లిములను కారకులని అనుమానించడం తగదు.” అంటూ కారుకూతలు కూస్తారు. చివరాకరికి ఆ బాంబులేసినది ఇస్లామిక ఉగ్రవాదులే అని తేలిన తరవాత, ఒక్కడు కనబడ్డు, ఒక్ఖడు ఇనబడ్డు. తమతమ మురికి కూపాల్లోకి, తమ తిమిరలోకాల్లోకి జారిపోతాయి ఈ కప్పలు. శవాగారాల్లాంటి తమతమ కలుగుల్లో నక్కుతాయి, జవసత్వాలను కొరికేసి, జాతిని నిర్వీర్యపరచే ఈ ఎలుకలు, పందికొక్కులు! ప్రతీ డిసెంబరు 6 న మాత్రం బెకబెకమంటూ, కిచకిచమంటూ బయటికొస్తాయి.

వేదికనెక్కి కారుబెకబెకలు, కారుకిచకిచలూ కూసే ఈ కప్పలూ, నికృష్టపు టెలుకలూ, పందికొక్కులూ.., బాంబుపేలుళ్ళకు బాధ్యులుగా ముస్లిములను అనుమానించరాదంటూ మైకులెట్టుకు మోగిమోగీ ఊగిపోయాయి. ఆ పేలుళ్ళు ఇస్లామిక ఉగ్రవాదుల పనేనని తేలాక, ఇవి వీటి కూపాల్లోంచి, కలుగుల్లోంచి బైటకే రాలేదు. ఇప్పుడు మాత్రం ‘హిందూ మతోన్మాద వ్యతిరేకత’ను వినిపించేందుకు కాళ్ళగ్గజ్జెలు కట్టుకోని, చేతుల్లో చిడతలతో వేదికలెక్కి తైతక్కలాడతన్నై. (నాస్తికులమని చెప్పుకునే ఈ జనం.. మసీదు కట్టాల్సిందేనని  చిందులెయ్యడం చూస్తే వీళ్ళమీద వెగటు కలుగుతోంది!) సమాజాన్ని హిందూ వ్యతిరేకతతో విషపూరితం చెయ్యబూనిన భ్రష్టులారా..! అప్పుడేమైందోయ్, మీ మార్క్సిజమ్ము? ఎక్కడ నక్కాయోయ్, మీపౌరహక్కుల నిఘా సంఘాలూ? ఆనాడెక్కడ దాక్కున్నారోయ్, నేడు మీతో గొంతు కలిపిన ఈ హిందూ వ్యతిరేక మదోన్మత్త చిత్తులు, మీ మిత్రులు? ఈ గాంధారీ పుత్రులు?

Advertisements
Categories: మతం, సమాజం

హిందూమతంపై దాడి

August 24, 2009 8 comments

* ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దేవాదాయ శాఖ మంత్రి గాదె వెంకటరెడ్డి, ‘ హిందూ దేవాలయాల్లో పనిచేసేవారు హిందువులే అయ్యుండాల్సిన అవసరం లేదు. ఏ మతస్తులైనా పనిచెయ్యవచ్చు ‘ అని చెప్పాడు.

* మనదేశంలో మతమార్పిడి చెయ్యడం ఎంత చురుగ్గా జరుగుతోందో మనకు తెలుసు. ఈ మతబేహారులు చాపకింద నీరులాగా సమాజమంతా పాకి ఉన్నారు. డబ్బులు ఎరవేసి, ప్రజల మతం మారుస్తారు. కానీ మతం మార్చాక కూడా వాళ్ళను హిందువులుగానే చెలామణీ చేయిస్తారు. హిందువులకుండే రిజర్వేషనులు అనుభవించాలిగదా మరి! హిందువులుగా చెలామణీ అవుతున్న కొందరు హిందువులు కారు. హైందవం వద్దనుకుని బయటికిపోయినవారు .

~~~~~~~~~

కోదండరామస్వామి గుడిలో పూజారి దేవుడి నగలను తాకట్టు పెట్టుకున్నాడు. పూజారి చేసినది తప్పే. అందుకు తగిన శిక్ష పడాల్సిందే. ఇంకా అలాంటి తప్పులెక్కడెక్కడ జరిగాయో అవన్నీ కూడా తేలాలి, శిక్షలూ పడాలి. తప్పు చేసినది పూజారైనా పడాలి, ప్రభుత్వ అధికారైనా పడాలి. అడ్డదారినో దొడ్డిదారినో గుడుల్లోకి జొరబడ్డ రాజకీయులైనా సరే శిక్ష పడాల్సిందే! గతంలో తప్పులుచేసినవాళ్ళకు ఏం శిక్ష వేసారో కూడా చెప్పాలి. హైదరాబాదులోని తితిదే సత్రంలో తాగి తందనాలాడినవాళ్ళను ఏంచేసారో చెప్పాలి. ఆ తాగుబోతుల నాయకుణ్ణి ఏంచేసారో చెప్పాలి. తితిదే పాలక సంస్థలోకి ప్రత్యేక ఆఫీసరు పేరిట అర్హత లేనివాళ్ళు ఎలా వచ్చారో చెప్పాలి.గుడుల్లో అన్యమతప్రచారం చేసినవాళ్ళకు ఏం శిక్ష వేసారో కూడా చెప్పాలి.

~~~~~~~~~

కానీ వీళ్ళందరినీ శిక్షించినంత మాత్రాన పరిస్థితులు చక్కబడతాయా? హైందవ ద్వేషులు అక్కడితో ఆగుతారా? అసలు కథ ఇంకోటుంది. ఈ సంఘటనను ఆసరాగా చేసుకుని గుడులమీద ప్రభుత్వ పెత్తనాన్ని విస్తరించేందుకు ప్రయత్నాలు జరుగుతాయి. ‘చ్చొ..చ్చొ..చ్చొ చూసారా.. దేవుడి సొమ్ముకు భద్రత లేకుండా పోయింది. దీనిమీద ప్రభుత్వ ఆజమాయిషీ మరింతగా పెరగాలి’ అంటారు. నగల సంగతి చూట్టానికి ఇంకో అధికారిని వెయ్యాలంటారు. ఆ తరవాత ఆ నగలు, డబ్బులన్నిటినీ ఒకచోటికి తరలించి ప్రభుత్వ నియంత్రణలో పెడదామంటారు.  అసలు పూజారులందరూ అధికారుల పర్యవేక్షణలోనే మంత్రాలు చదవాలంటారు. గుడులను, ఆచార వ్యవహారాలను పూర్తిగా ప్రభుత్వ ఆజమాయిషీలోకి తెచ్చేందుకు కుటిల యత్నాలు చేస్తారు. ప్రభుత్వం మనదే కదా, మనమెందుకు వద్దనాలి?

~~~~~~~~~~

 1. దేవాదాయశాఖ మంత్రి ‘హిందూ దేవాలయాల్లో పనిచేసేవారు హిందువులే అయ్యుండాల్సిన అవసరం లేదు. ఏ మతస్తులైనా పనిచెయ్యవచ్చు’ అని చెప్పాడు. ఇలాంటివాళ్ళు మనకు మంత్రులుగా ఉన్నప్పుడు హిందూమతానికి రక్షణ ఏముందిక? హైందవమంటే ఏమీ తెలవనివాడు గుడిలో కార్యక్రమాలను నిర్వహిస్తాడు. హిందవమంటే ద్వేషం కలిగినవాడూ గుడిలో పనులు చేస్తాడు. ఎంత నీచమైన ఆలోచనో చూడండి. పైగా దేవాలయాల వ్యవహారాలను చూడాల్సిన మంత్రి ఆలోచన ఇది.
 2. మతబేహారుల చేతుల్లో మతమార్పిడికి గురై అస్తిత్వం కోల్పోయి, కొత్త ముఖాలు, కొత్తపేర్లు  తెచ్చుకుంటారే.. వీళ్ళు హిందువుల్లాగానే చెలామణీ అవుతూంటారు. ప్రభుత్వ లెక్కల్లో తమను హిందువులుగానే రాయించుకుంటారు. ఈ దొంగ హిందువులు కూడా మిగతావాళ్ళలాగానే ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరతారు. అందుకు ఆక్షేపణేమీ లేదు. వాళ్ళు దేవాదాయ ధర్మాదాయ శాఖలోనూ చేరతారు. వాళ్ళే గుడుల్లో అధికారులూ అవుతారు. వాళ్ళే గుడి రోజువారీ వ్యవహారాల్లో కలగజేసుకుంటారు. హిందువుకానివాళ్ళు హిందూ దేవాలయ వ్యవహారాలు చూస్తూ ఉంటారు! పైకి వాళ్ళు హిందువులే, కానీ కేవలం ప్రభుత్వ లెక్కల్లోనే హిందువులు, అంతే! దేవాలయ వ్యవస్థను కూలగొట్టడానికి ఇది చాలదా?

వీటి పర్యవసానాలు హిందూమతానికి, మత కేంద్రాలైన గుడులకూ చేటు. మనందరం ఈ ప్రభుత్వ జోక్యాన్ని వ్యతిరేకించాలి. గుడుల్లో ఏ పని ఏ కులస్తుడు పనిచేసినా తప్పులేదు. కానీ ఏ మతస్తుడైనా చెయ్యొచ్చనడం మాత్రం తప్పు! అసలా మాట అనడమే హిందువులకు అవమానం! అసలు రాజకీయ నాయకులు గుడి వ్యవహారాల్లోకి ఎందుకు రావాలి? గుడుల నిర్వహణకు ధార్మిక సంస్థలతో కూడిన వ్యవస్థ ఒకటి ఉండాలి. ప్రభుత్వానికి గుడి సంగతి అనవసరం! లౌకికరాజ్యం అని చెప్పుకుంటున్నాం గదా.. గుడి సంగతి రాజ్యానికెందుకు?

హైందవాన్ని అణచేద్దామని మాటేసి ఉన్న కేటుగాళ్ళ పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి. మతమార్పిళ్ళను వ్యతిరేకించాలి. మతమార్పిళ్ళను, మతం పేరిట దేశంలోకి డబ్బు రాకడను నిషేధించాలి. మతమార్పిడి రానున్న కాలంలో మనమెదుర్కోబోతున్న అతిపెద్ద సామాజిక సమస్య. హిందువులెందరో, దొంగ హిందువులెందరో, ఇతర మతస్తులెందరో సరిగ్గా లెక్కతేల్చాలి. ఇతర మతాలను వ్యతిరేకించడం కాదు, ఇతర మతాలు హిందూమతమ్మీద చేస్తున్న గుట్టుచప్పుడు దాడిని ఎదుర్కోవాలి.

———————-         ———————          ——————–

మన భద్రతే మనకు ముఖ్యం

December 6, 2008 73 comments

దేశానికి నాయకుల ప్రాణాలు ఎంత ముఖ్యమో, సామాన్యుడి ప్రాణాలు కూడా అంతే ముఖ్యం -తేడాయే లేదు. ఆఫ్టరాల్ నాయకుడికే జెడ్లూ, జెడ్‌ప్లస్సులూ ఉంటే అతణ్ణి తయారుచేసిన సామాన్యుడికెన్ని ఉండాలి? ముందు మనమీ సంగతిని ఒప్పుకుంటే ఇక ముందుకు పోవచ్చు.

———————————————

నిఘా వర్గాల నివేదికలను బట్టి, విమానాశ్రయాలను, ఓడరేవులను, భవనాలను, నేలను, నీటిని, గాలిని, కాపలా కాసి, దాడి చేసే ఉగ్రవాదులను ఎదుర్కొని, యుద్ధాలు చేసి, బాంబులను నిర్వీర్యం చేసి, వాళ్ళను చంపి, లేదా పట్టుకుని, జైల్లో పెట్టి, కేసులుపెట్టి,..
ఈ పద్ధతిలో ఉగ్రవాదాన్ని అరికట్టడం అసంభవం – కనీసం మన దేశంలో!

ఉగ్రవాదులకు ముఖ్యమైన అవసరాలు – మనుషులు, డబ్బులు, ఆయుధాలు, పేలుడు పదార్థాలు. వీటిని అందకుండా చేస్తేనే ఉగ్రవాదాన్ని అరికట్టగలం. కింది చర్యలు తీసుకోవాలని నా ఉద్దేశ్యం..

 1. పౌరుడి భద్రత తరవాతే – కులం, మతం, సామాజిక వ్యవస్థ, రాజకీయాలు, విదేశాలతో సంబంధాలు,.. – ఏ అంశమైనా సరే! ఇక్కడో సంగతి చెప్పుకోవాలి: ఈ మధ్య మనదేశానికి చెందిన ఓ ప్రభుత్వేతర సంస్థ నుండి కెనడాకు వెళ్తున్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకరిని పారిస్‌లో ఎయిర్ కెనడా విమానం ఎక్కకుండా దింపేసారు. పాస్‌పోర్టులో ఏదో అనుమానాస్పదంగా ఉందని కారణంగా చెప్పారు – కానీ, ఖచ్చితంగా అదేంటో చెప్పలేదు. రెండో వ్యక్తిని పోనిచ్చారు -అతని పేరు దినేష్ మిశ్రా, ఆపేయబడ్ద వ్యక్తి కమాల్ హుస్సేన్. కమాల్ అదే పాసుపోర్టుతో భారత్ నుండి పారిస్‌దాకా ఇబ్బందేమీ లేకుండానే వెళ్ళాడు, అక్కడ మాత్రం తేడా కనిపించింది. వాళ్ళు చెప్పిన కారణం ఏమైనప్పటికీ (అసలు కారణమేంటో ఊహించలేనంత కష్టమేమీగాదు) – వాళ్ళకు అనుమానం వచ్చింది, మొహమాటాలేమీ లేకుండా దింపేసారు, ఎవ్వరూ మాట్టాడలేదు. “ముస్లిము కాబట్టి దింపేసారు” అని గోల చేస్తారేమో అని వాళ్ళు ఆలోచించలేదు, దింపేసారంతే! అంత గట్టిగా మనమూ ఉండాలి. భద్రత విషయంలో సర్దుకుపోయే ప్రసక్తే ఉండకూడదు.. హిందువైనా ముస్లిమైనా, మరొకరైనా కటువుగా ఉండాల్సిందే! మంత్రిగా అమెరికా వెళ్ళిన జార్జి ఫెర్నాండెజ్‌ను ఎలా శోధించారో మనకు తెలిసిందే. అంచేత భద్రత తరవాతే ఏదైనా.
 2. దేశం సంతబజారేమీ కాదు, ఎవడుబడితే వాడు వచ్చిపోయేందుకు.. పాకిస్తాను నుండి, బంగ్లాదేశు నుండి ఎట్టాబడితే అట్టా వచ్చేస్తున్నారు. వాళ్ళకి ఇక్కడ చక్కగా ఉంటానికీ తింటానికీ సకలసౌకర్యాలూ సమకూరుతున్నాయి. ముందీ ఆశ్రయం ఇచ్చే ఇంటిదొంగలను లోపలెయ్యాలి. బయటినుండి వచ్చినవాళ్ళని వెతికి పట్టుకుని నిర్మొహమాటంగా వెనక్కి పంపాలి. పోనివాణ్ణి జైల్లో వెయ్యాలి (ఈ దేశాలు ఎలాగూ వాళ్ళని రానివ్వవు; శత్రు (కిరాయి) సైనికుల శవాలకు కూడా శాస్త్రోక్తంగా శ్రాద్ధకర్మలు నిర్వహించే సంస్కారం మనకుందిగానీ, తమవాళ్ళను తమవాళ్ళేనని చెప్పుకునే ధైర్యం లేని దేశాలవి) జన సమూహపు భద్రత ముఖ్యం, ఎవరో కొందరి – అందునా దొంగల, ఉగ్రవాదుల – మానవహక్కులు కాదు. మానవహక్కుల గురించి మాట్టాడినవాణ్ణి, ముందు గ్వాంటనామో బే గురించి తెలుసుకో బే అనాలి. 
 3. కొందరు రాజకీయనాయకులు నేరస్తులకు వత్తాసుగా నిలబడుతూంటారు. మన రాష్ట్రంలోనే ఒక మంత్రి ఒక నేరస్తుడి ఇంటికెళ్ళి పరామర్శించాడు. ఆ సంగతి ఇప్పటికి అనేకసార్లు పేపర్లలో వచ్చింది కూడాను. అటువంటి వాళ్ళని వ్యవస్థలో ఏ పదవినీ చేపట్టకుండా అనర్హులుగా ప్రకటించాలి. అందుగ్గాను..
 4. రాజకీయాల్లో నేరస్తులను ఏరెయ్యడానికి సుప్రీమ్ కోర్టు చేసిన సూచనలను పాటించి, తగు చట్టం చెయ్యాలి. ఇది చెయ్యకపోతే ఈ రాజకీయ నాయకులకు భద్రతాచర్యలపై చిత్తశుద్ధి లేనట్టే. ఈ చట్టాన్నే గనక కట్టుదిట్టమైన రూపంలో తెస్తే, కాంగ్రెసు ఎంత వెధవాయి పార్టీ అయినా సరే.. ఈ ఒక్క పని చేసినందుకు నా వోటేసేస్తాను.
 5. భద్రతావ్యవస్థలో రాజకీయాల జోక్యం కూడదు. లేదా రాజకీయాల జోక్యం లేని భద్రతావ్యవస్థ ఉండాలి. అంత తేలికైన సంగతి కాదిది.. కానీ మనకు ఎన్నికల కమిషను, విజిలెన్సు కమిషను వంటి రాజ్యాంగ వ్యవస్థలున్నాయి. ఇవి మిగతా ప్రభుత్వ విభాగాల్లాంటివి కావు. వీటి మీద ప్రభుత్వ ఆజమాయిషీ ఉండదు. అలాగే రాజకీయ జోక్యం ఉండకూడని ప్రతిపత్తి కలిగిన జాతీయ భద్రతాసంస్థ ఒకటి ఉండాలి.
 6. పోలీసు వ్యవస్థను సంస్కరించాలి. ప్రస్తుతం పోలీసు శాఖ అంటే మనం దూరందూరంగా ఉంటాం. వాళ్ళకు ప్రజలతో అనుబంధం తక్కువ. బహుశా పోలీసు శాఖకు అనుబంధంగా ప్రజలతో మమేకమై ఉండే ఒక పారా పోలీసింగు వ్యవస్థ ఉంటే బాగుంటుందనుకుంటా. స్థానికంగా సమాజంలో జరుగుతూండే మార్పులను ఈ వ్యవస్థ మరింత చురుగ్గా పసిగట్టగలుగుతుంది. సున్నితమైన ప్రాంతాల్లో ఈ వ్యవస్థ మరింత ప్రభావవంతంగా ఉంటుంది. ముంబై దాడికి సంబంధించి అనుమానం మీద తిరువూరులోని ఒక జాలకేంద్రపు స్వంతదారును అదుపులోకి తీసుకున్నారట. పారాపోలీసుల వలన ఈ సంగతి సంఘటనకు ముందే తెలిసి ఉండేదేమో!
 7. భద్రతలో కన్నాలు ఏర్పడేందుకు ముఖ్యకారణం… ఫెటీగ్! అనుమానితుల కోసం, అనుమానాస్పద వస్తువు లేదా అంశం కోసం చూస్తూంటారు. రోజూ దొరుకుతాయా? దొరకవు. పదేపదే బాంబులు పెట్టారన్న ఫోన్లొస్తూంటాయి.. అన్నీ నాన్నా పులి కథలే! కానీ ఎక్కడో ఒకదాన్లో నిజముంటుంది. ఆ సరికి పోలీసులకు ఈ వెతుకులాట మామూలైపోతుంది.. అలసత్వం ఏర్పడుతుంది. నిజంగా దాడి జరిగే సమయానికి ఎదుర్కోలేని పరిస్థితిలో ఉండవచ్చు. ఏ షాపులోనో చూస్తూంటాం.. అక్కడొక ద్వారం పెట్టి ఉంటుంది, మనం అందులోంచి వెళ్తాం, అది కీబామని అరుస్తూనే ఉంటుంది, కానీ ఎవ్వరూ పట్టించుకున్నట్టుండరు. అసలు ఆ తోరణం లోంచి వెళ్ళకపోయినా అడిగేవాడుండడు. బహుశా దీనికి కారణం ఈ ఫెటీగేననుకుంటా. సరైన శిక్షణ పొందిన సిబ్బంది, సరిపడినంతమంది, సరైన పరికరాలూ ఆయుధ సంపత్తితో భద్రత కోసం సిద్ధంగా ఉండాలి..
 8. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెబుతూంటారు. భద్రతలో మీరూ భాగస్వాములే అని అంటారు. చెప్పేందుకు బానే ఉంటాయి గానీ, మన సామాజిక వ్యవస్థలో ఇవి సాధ్యమవుతాయా? ఫుట్‌పాతుల మీద నిద్రపోయేవాళ్ళు, బాంబులకు భయపడితే ఎక్కడ పడుకుంటారు? నిరుపేదలు, కేవలం చెత్త కుండీలు, చెత్త కుప్పలలో దొరికే ఇనుప, ప్లాస్టిక్కు వ్యర్థాలను సేకరించి, అమ్ముకుని, జీవనం గడిపేవారు అక్కడ బాంబులుంటాయేమోనని వాటి జోలికి వెళ్ళకపోతే వారి జీవనం గడిచేదెలా? ఇవి కేవలం ఉదాహరణలే! ఇలాంటివి మరెన్నో! కేవలం బాంబులు పేల్చడమే, మనుషులను చంపడమే, ప్రజలను భీతావహులను చెయ్యడమే ఉగ్రవాదుల ధ్యేయమైతే, మనమెన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే.., వాళ్ళు ఆ పనులు చెయ్యగలరు – ఆ అవకాశం వాళ్ళకు ఉంటూనే ఉంటుంది. అంచేత ఉగ్రవాదానికి మందు ఉగ్రవాదులు, వాళ్ళ పోషకులు లేకుండా చెయ్యడమే! వాళ్ళకు బాంబులు, ఆయుధాలు దొరక్కుండా చెయ్యడమే!
 9. బాంబుల కోసం పేలుడు పదార్థాలు ఎంత తేలిగ్గా దొరుకుతాయో మనదేశంలో! పేలుడు పదార్థాలు వాడే సంస్థలు అనేకం ఉన్నాయి. ఉదాహరణకు గనుల కంపెనీలు! వాళ్ళకు అనేక నిబంధనలుంటాయి.. ఎంతబడితే అంత పేలుడు పదార్థాల నిల్వలు పెట్టుకోకూడదు, వాటి వాడకానికి సంబంధించిన అన్ని వివరాలనూ ప్రభుత్వానికి తెలియబరచాలి,.. ఇలాగ. ఇన్ని నిబంధనలున్నా, ఈ సంస్థలనుండి పేలుడు సరంజామా మాయమౌతూంటుంది. నక్సలైట్లు ఇలా కూడా పేలుడు పదార్థాలను సేకరిస్తూంటారు. జనాలను లోభపెట్టో భయపెట్టో ఈ సంస్థలనుండి సరంజామా సేకరించడం తేలిక. ఈ వ్యవస్థను, సదరు సంస్థల వ్యవహారాలను కట్టుదిట్టం చెయ్యాలి.
 10. ‘అతడికి ఫలానా విధంగా అన్యాయం జరిగింది. అంచేత పాపం అతడు ఉగ్రవాది అయ్యాడు, తప్పేముంది?‘, ‘ముస్లిము ఉగ్రవాదులు కల్లోలం సృష్టిస్తున్నారు కాబట్టి, హిందువులూ తుపాకులు పట్టొచ్చు‘, ‘గుజరాతులో జరిగినదానికి స్పందనగానే ముస్లిములు ఉగ్రవాదులౌతున్నారు‘ – లాంటి వాదనలు వింటూ ఉన్నాం. ఈ వాదనలు ఉగ్రవాదుల పనులను అన్యాపదేశంగా సమర్ధిస్తూంటాయి. వీటిని ఆపాలి.
 11. అవినీతి, లంచగొండితనం – కనీసం భద్రతావ్యవస్థల్లోనైనా – అరికట్టాలి.
 12. ప్రతీ పౌరుడికీ ఏకీకృత వ్యక్తిగత గుర్తింపు కార్డు ఉండాలి. మన దేశంలో ఇది ప్రవేశపెట్టడం, దాన్ని నిర్వహించడం కష్ట సాధ్యమే. కానీ దీర్ఘకాలిక దృష్టిలో ఇది అవసరం.
 13. ముందే మన సమాజంలో అనేక భేదభావాలున్నాయి. ఉన్నవాటితోటే సతమతమౌతూంటే, అది చాలవన్నట్టు కొత్తవి పుట్టుకొస్తున్నాయి. ఇలాంటివాటిని అరికట్టాలి. ఉదాహరణకు, మత మార్పిళ్ళు. 

ఉగ్రవాదానికి అన్నిటికంటే ముఖ్యమైన ముడిసరుకు, ప్రేరేపక శక్తి – మతం!   
మతం పట్ల ముస్లిముల ధోరణి గురించి ఇక్కడ చెప్పుకోవాలి (ఇక్కడ రాస్తున్నది ఎక్కువమంది ముస్లిముల ధోరణి గురించి, ప్రతీ ఒక్ఖ ముస్లిమూ ఇలాంటివారేనని అర్థం కాదు). ముస్లిములను మత ప్రాతిపదికన ఏర్పడిన ఒకే వోటు బ్యాంకుగా రాజకీయ నాయకులు చూసే స్థాయికి ముస్లిములే తెచ్చుకున్నారు. ప్రతీదాన్నీ మతంతో ముడిపెట్టే ముస్లిముల విధానం వలననే ఈ పరిస్థితి వచ్చింది. వాళ్ళకి ఈ ప్రపంచంలో అన్నిటికంటే మతమే ప్రధానమైనది. మనమంతా భారతీయులం అనే భావన కంటే మనమంతా ముస్లిములం అనే భావన ఎక్కువ. ఒక ఉదాహరణ చూడండి..

‘ముస్లిములలో అభివృద్ధి తక్కువ’, ‘దేశ అభివృద్ధి ఫలాలు వాళ్ళకి దక్కలేదు.’, ‘సామాజికంగా బలహీనంగా ఉన్నారు’ అని చెబుతూ, వాళ్ళు ఉగ్రవాదం వైపు మొగ్గు చూపడానికి ఇదో కారణం అని లౌకికవాదులమని అనుకునే కొందరు చెబుతూంటారు. అబివృద్ధిలో వెనకబడింది ముస్లిములేనా? హిందువులు వెనకబడిలేరా? వాళ్ళు ఉగ్రవాదులుగా మారారా? దేశమ్మీదబడి సాటి దేశీయులనే చంపుతున్నారా? పరాయి దేశస్తులతో కలిసి కుట్రలు చేసి, విధ్వంసాలకు పాల్పడుతున్నారా? లేదే! మరి ముస్లిములలో ఎందుకుందా ధోరణి? ముస్లిములను బయటి దేశీయులతో కలిపే బంధం మతం తప్ప మరోటి ఉందా? లేదు!

అంటే, మన దేశం మన ప్రజలు అనే భావన కంటే మన మతం అనే భావనకే ఇక్కడ ప్రాముఖ్యత ఇచ్చారు. మతపరమైన ఐక్యతాభావన ఎంత బలంగా ఉంటుందంటే.. సద్దాం హుసేన్ను ఉరితీస్తే, మన ఊళ్ళో నిరసన ప్రదర్శనలు, ధర్నాలు చేస్తారు. మన దేశంలో ఏదైనా దుర్ఘటన జరిగితే అంతలా స్పందించరు.

ముస్లిములను కేవలం ఓటుబ్యాంకుగా చూస్తారు రాజకీయులు. హిందువు, ముస్లిము, గొప్పా బీదా, అగ్రకులస్తుడు, నిమ్న కులస్తుడు – రాజకీయులకు ఎవరైనా ఓటరే! కానీ మిగతావాళ్ళతో వ్యవహరించడంలోను, ముస్లిములతో వ్యవహరించడంలోను రాజకీయుడు తేడా చూపిస్తాడు. మీ మతస్తులకు అన్యాయం చేస్తున్నారు అంటూ, ప్రతీ విషయంలోను మతాన్ని వేదికగా చేసుకునే మాట్టాడతాడు. రంజాను రోజుల్లో విందులిచ్చి, షేర్వాణీ, టోపీ పెట్టుకుని పేపర్లలో పడితే వాళ్ళు ముస్లిముల హితైషులని లెక్క. సద్దాము హత్యను విమర్శిస్తే వాళ్ళు ఆప్తులు. తస్లీమా నస్రీనుకు ఆశ్రయం ఇస్తే వాళ్ళు ముస్లిము విరోధులు, కాఫిర్లు, మతవాదులు, లేదంటే స్వచ్ఛమైన లౌకికవాదులు. అమెరికాతో అణు ఒప్పందాన్ని కూడా ముస్లిముల కోణం నుండే చూస్తారు మన నాయకులు.

ఇలా ముస్లిములను బుజ్జగిస్తూ వచ్చి, ఈ రాజకీయులు ముస్లిములకు ఎంత మంచి చేసారోగాని, ముస్లిముల మతభావనల పట్ల – జాతీయత కంటే మతమే ముఖ్యమన్న వాళ్ళ ధోరణి పట్ల – నాబోటి సామాన్యుల్లో కూడా వ్యతిరేకతను కలిగించగలిగారు. మన కుహనా లౌకికవాదులు ఎంత కాదన్నా ఇది నిజం! ముస్లిములు ఈ సంగతిని గ్రహించి తమ ధోరణిని మార్చుకుంటే వాళ్ళు మిగతా భారతీయులతో కలిసిపోగలరు. లేకపోతే ఈ రాజకీయుల క్రూర క్రీడలో పావులైపోతూనే ఉంటారు, లౌకికవాదులంటున్నట్టు పరాయీకరణకు గురవుతూనే ఉంటారు.

కంధమాల్ కథేమిటి?

October 11, 2008 17 comments
ఒరిస్సాలోని కంధమాల్ జిల్లాలో జరుగుతున్న కుల/మత ఘర్షణలు ఈమధ్య కాలంలో దేశవ్యాప్తంగా కలకలం కలిగించాయి. ఆ కలహాలకు మూల కారణమైన క్రైస్తవం బయటి దేశాలతో మతపరమైన సంబంధాలు కలిగి ఉండటాన, ఆ మతం, ఆ దేశాలు అంతర్జాతీయ రాజకీయాల్లో పలుకుబడి కలిగినవి కావటాన, ఈ ఘర్షణలు అంతర్జాతీయ దృష్టికి చేరాయి. ప్రధానమంత్రిని ఫ్రాన్సులో నిలదీసిన సంఘటన కూడా జరిగింది. “రెండేళ్ళ కిందట మీ పారిస్‌లో ముస్లిములపై అలా దౌర్జన్యాలు చేసారేంటని నేను అడిగానా? మీకెందుకు మా సంగతి?” అని ఆయన అడగాల్సింది. లేదూ.. క్రైస్తవ మిషనరీలు భారత్‌లో లేపుతున్న కల్లోలాల గురించి చెప్పి, “ముందు మీవాళ్ళని అదుపులో పెట్టండి. ఆ తరవాత గొడవల గురించి మాట్టాడండి” అని చెప్పుండాల్సింది. కనీసం “అది మా ఇంటిసంగతిలే, మేం చూసుకోగల్దుంలే” అనైనా అనుండాల్సింది. (పాపం ఒకచేతిలో యురేనియమ్ జోలె ఉండటాన ఆ మాట అడగలేకపోయి ఉండొచ్చు.) ఏదో తప్పు చేసినవాడిలాగా అక్కడేం మాట్టాడకుండా, ఇంటికొచ్చి దిండులో తలదూర్చి ఎక్కెక్కి ఏడిస్తే ఏం లాభం!?

అసలు కంధమాల్‌లో జరిగిన గాథ క్లుప్తంగా ఇక్కడ...

———————————

కంధమాల్ జిల్లా జనాభాలో ఎస్సీలు, ఎస్టీలదే ప్రాబల్యం. ఎస్సీలు  17 శాతం ఉంటే, ఎస్టీలు 52 శాతం. బ్రిటిషువారి కాలంలోనే మిషనరీలు కంధమాల్ జిల్లాలో ప్రవేశించి ఇక్కడి ప్రజలను క్రైస్తవంలోకి మార్పిడి చెయ్యడం మొదలుపెట్టాయి. అసలు బ్రిటిషు సైన్యం అక్కడ కాలూనలేని పరిస్థితిలో మిషనరీలను ముందు పంపించారట. దేశంలోని ఇతర ప్రాంతాల్లో లాగానే ఇక్కడ కూడా స్వాతంత్ర్యం తరవాత మత మార్పిళ్ళు వేగం పుంజుకున్నాయి. కంధమాల్ జిల్లాలో ఈ మార్పిళ్ళు మరింత ఎక్కువగా జరిగాయి. అక్కడ మొత్తం క్రైస్తవుల్లో 60 శాతం మంది ఎస్సీలు కాగా, మిగిలిన వాళ్ళలో అత్యధికులు ఎస్టీలు.

ఇక్కడొక ప్రధానమైన విషయాన్ని మనం గమనించాలి. క్రైస్తవం తీసుకున్నవారిలో (ఇప్పించబడ్డవారు) – ముఖ్యంగా దళితుల్లో – ఎక్కువమంది అధికారికంగా తమను తాము క్రైస్తవులుగా నమోదు చేసుకోరు  జనగణకులకు తాము హిందువులమని చెబుతారు. మిగతా ప్రపంచానికంతటికీ వాళ్ళు క్రైస్తవులే! మనకు ఆశ్చర్యం కలుగుతుంది.. అలా ఎందుకు, తన మతమేదో గర్వంగా చెప్పుకోవచ్చు గదా అని! దానికి ప్రధానమైన కారణం.. హిందువుగా చెప్పుకుంటే తప్ప మన ప్రభుత్వం కులపరమైన రిజర్వేషను వంటి సౌకర్యాలను వాడుకోనివ్వదు. ఈ కారణాన అసలైన క్రైస్తవుల జనాభా లెక్కలు బయటికి రావు. కొన్ని లక్షల మంది ఉద్యోగులను పెట్టి, దేశవ్యాప్తంగా, ఇంటింటికీ వెళ్ళి జనాభా లెక్కలను తయారు చేసే జనగణన వారి నిర్వాకమేంటంటే.. తప్పుడు లెక్కలు! క్రైస్తవ మిషనరీలు, ప్రచార సంస్థలకు ఉన్న నెట్‌వర్కును దృష్టిలో పెట్టుకుని చూస్తే.. వాళ్ళ దగ్గర ఈ విషయమై ఖచ్చితమైన లెక్కలు దొరకొచ్చని నా ఉద్దేశ్యం.

ఇలా హిందువుగా చెప్పుకోడానికి నా ఉద్దేశ్యంలో మరో కారణముంది.. క్రైస్తవ ప్రచారకుల, మిషనరీల భయం. నిజమైన లెక్కలు బయటికి వస్తే ప్రజల్లో ఆందోళన కలగవచ్చు, తమ మత మార్పిడి పనులకు అభ్యంతరాలు ఎదురవచ్చు అనే కారణమొకటి. మరొకటేంటంటే.. నిజం చెబితే, తత్కారణంగా  రిజర్వేషను సౌకర్యం పోతే మతం  మార్చాల్సిన మిగతా ప్రజలు ఒప్పుకోరనే భయం.

మతమార్పిళ్ళూ, కుల రిజర్వేషన్ల అంతరార్థం, అందులో కేంద్రప్రభుత్వం వారి దృష్టిలోపం, మొదలైనవాటి కథ ఇది! ఇది చాలదన్నట్టు, ప్రభుత్వం వారిదే మరో ఫర్మానా ఉంది.. మతం మారిపోతే ఎస్సీలు కుల రిజర్వేషన్లు కోల్పోతారు. ఎస్టీలకు మాత్రం మతం మారినంత మాత్రాన, సదరు సౌకర్యాలకు లోటేం ఉండదు. అంటే…

నేను ఎస్సీని, మతం పుచ్చుకున్నాను. మీరు ఎస్టీ, మీరూ మతం పుచ్చుకున్నారు. క్రైస్తవుణ్ణని చెప్పుకున్నందుకు గాను, నా కుల రిజర్వేషను పోయింది. మీరు ఎస్టీ కాబట్టి, మీకు మాత్రం ఆ సౌకర్యం అలానే ఉంది. ఈ పరిస్థితిలో రిజర్వేషను సౌకర్యాన్ని వొదులుకోకూడదంటే నేనేం చెయ్యాలి.. “నేను క్రైస్తవుణ్ణి కాదు, హిందువునే” అని చెప్పుకోవాలి లేదా నేను ఎస్టీనని చెప్పుకోవాలి. 2000 దాకా కంధమాల్ ఎస్సీలు మొదటి మార్గాన్నే నడచారు. ఆ తరువాత, 2001 జనగణనలో వాళ్లను క్రైస్తవులుగా గుర్తించారు – ఎలా జరిగిందో మరి! ఇహ అప్పటి నుండి వాళ్ళకు, ఎస్టీలమని చెప్పుకోవాల్సిన అవసరం ఏర్పడింది.

భూమి తగాదాలు: దీనికి తోడు, ఎప్పటినుండో భూమి తగాదాలూ ఉన్నాయి. ఎస్సీలు ఎస్టీల కంటే చదూకున్నవారు, ధనబలం, రాజకీయబలం కలిగినవారు. జిల్లాలోని ఎస్టీల భూమిని తనఖాల రూపంలోగానీ, ఆక్రమించుకోవడం ద్వారాగానీ, ఎస్సీలు తమ సొంతం చేసుకున్నారు. కొన్ని చోట్ల ఈ భూముల్లో చర్చీలు కూడా కట్టారు. గిరిజన చట్టాల ప్రకారం ఎస్టీల భూమిని మరొకరికి బదిలీ చెయ్యడం కుదరదు – అమ్మడం ద్వారాగానీ, మరే విధంగాగానీ! (ఇది మన రాష్ట్రంలో కూడా ఉంది. దీన్నే 1/70 చట్టం అని అంటారు. ఖమ్మం, పశ్చిమ తూర్పు గోదావరులు, ఇంకా కొన్ని  జిల్లాల్లోని ప్రాంతాల్లో ఈ చట్టం అమల్లో ఉంది. ఈ చట్టం కారణంగా జంగారెడ్డిగూడెం ప్రాంతాల్లో గొడవలు జరిగేవి కూడా! గిరిజనులు మైదాన ప్రాంతాల వారు సాగు చేసుకునే పొలాల్లో పంట కోసుకుపోవడం లాంటివి చేసేవారు. కమ్యూనిస్టులు – ముఖ్యంగా సీపీఎమ్ – గిరిజనులకు మద్దతుగా నిలబడింది.) ఈ కారణంగా ఎస్సీల అధీనంలో ఉన్న ఆ భూములను ఎస్టీలకి ఇచ్చేయాల్సి వచ్చింది. దీన్నిబట్టి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు! ఈ భూములు తమ చేజారకుండా ఉండాలంటే తమకూ ఎస్టీ హోదా ఉండాల్సిందేనని ఎస్సీలు భావించారు.

అసలింతకీ ఈ క్రైస్తవ ఎస్సీలు తాము ఎస్టీలమని చెప్పుకోడానికి ఆధారాలేంటి? ఏదో ఒక ఆధారం చూపించాలి గదా! వాళ్ళేం చేసారంటే.. తము మాట్లాడే కుయి అనే భాషను ఒక ఎస్టీ తెగగా రికార్డుల్లోకి ఎక్కించారు. ఆనక తాము కుయి అనే భాష మాట్లాడుతున్నాం కాబట్టి తాము కుయి తెగకు చెందినవారమే -అంటే ఎస్టీలమే అని వాదించారు. సహజంగానే గిరిజనులైన కోంధులు ఒప్పుకోలేదు. అలా అయితే ఆ ప్రాంతంలోని అగ్రవర్ణాలకు చెందిన వారు కూడా కుయి భాష మాట్లాడుతారు, వాళ్ళూ కుయి తెగకు చెందిన వారేనా అని అడిగారు. ఒక ఎంపీ, ఒక రాష్ట్ర మంత్రీ ఎస్సీల పక్షం వహించారు. (దరిమిలా, సదరు మంత్రి చేత ఎలాగో కష్టపడి, నైతిక బాధ్యత వహింపజేసి రాజీనామా చేయించారు.) దొంగ కుల ధృవీకరణ పత్రాలు కూడా జారీ అయ్యాయి. ఇన్ని ఛండాలాలు జరిగినచోట ప్రజల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయో ఊహించవచ్చు. ప్రజలు రెండు వర్గాలుగా చీలిపోయారు. ఎస్సీలకు, ఎస్టీలకు గొడవలు జరిగాయి. ఈ విధంగా మత మార్పిడి కారణంగా కంధమాల్ సమాజం ఉద్రిక్తతకు లోనైంది, తరచూ కల్లోలాల బారిన పడింది. 1994 లోనే గొడవలు జరిగాయి. 2001 తరవాత ఎక్కువయ్యాయి. 2007 క్రిస్ట్‌మస్ రోజున పెద్ద గొడవలే జరిగాయి. స్వామి లక్ష్మణానంద అనే హిందూ మత ప్రచారకుడిపై క్రైస్తవులు హత్యాయత్నం చేసారు. వారి ఇళ్ళను వీళ్ళూ, వీరి ఇళ్ళను వాళ్ళూ తగలబెట్టుకున్నారు. హిందూ దేవాలయాలను క్రైస్తవులూ, చర్చిలను హిందువులూ నాశనం చేసారు.

ఈ మొత్తం ఘటనలలో హిందూ సంస్థల పాత్రేంటి? చప్పట్లకు రెండు చేతులూ అవసరమే! అ రెండో చేయి హిందూ సంస్థలదే! క్రైస్తవ మత ప్రచారకుల దుష్ట పన్నాగాలను తిప్పికొట్టేందుకే కంధమాల్లోకి స్వామి లక్ష్మణానంద ప్రవేశించాడు. అప్పటికి హిందూ సంస్థలు లేవు. వాళ్ళను వ్యతిరేకించడం వల్లనే ఆయనకూ మిషనరీలకు వైరం పెరిగింది. గొడవలయ్యాయి. స్వామి దాదాపు 40 ఏళ్ళుగా క్రైస్తవుల మత మార్పిడులను ఎదుర్కొంటూ కంధమాల్ జిల్లాలో గిరిజనులకు పెద్ద దిక్కుగా ఉంటూ వస్తున్నాడు. పాఠశాలలు, గుడులూ స్థాపించి గిరిజనుల్లో మతమార్పిడిని నిరోధించాడు. గిరిజనుల సంస్కృతిని వివరిస్తూ దాన్ని నిలుపుకోవాల్సిన అవసరాన్ని తెలియజేసాడు. క్రైస్తవ వ్యాప్తికి అడ్డంకిగా నిలిచాడు. ఆయన కారణంగా గిరిజనుల మతమార్పిడి ఆగడమే కాక, పునర్మతాంతరీకరణలు కూడా జరిగాయి. సహజంగానే క్రైస్తవ ప్రచారకులకు ఇది నచ్చలేదు. క్రమేణా ఇది ఘర్షణకు దారితీసింది. గిరిజనులు ఒకవైపు, మతం పుచ్చుకున్న ఎస్సీలు ఒకవైపు చీలిపోయారు. చివరకు 2008 ఆగస్టులో స్వామి హత్య చేయబడ్డాడు.

స్వామి హత్య తరవాత జరిగిన గొడవలను మతఘర్షణలుగా అభివర్ణించారు. కానీ అవి మతఘర్షణల కంటే కూడా అవి ఎస్సీ ఎస్టీల మధ్య మతమార్పిడులు సృష్టించిన తగాదాలని స్పష్టమౌతోంది. స్వామి హత్య ఈ ఉద్రిక్త వాతావరణంలో నిప్పురవ్వయై పేలుడు సృష్టించింది.

—————————-
ఇదీ కంధమాల్ కథ. మత ప్రచారమూ, మతమార్పిళ్ళూ సృష్టించిన సామాజిక బీభత్సం. గొడవలు ఎవరు చేసినప్పటికీ ఖండించాల్సిందే! దౌర్జన్యాన్ని అణిచెయ్యాల్సిందే! దానవత్వాన్నీ, పాశవికతనూ నిర్ద్వంద్వంగా నిర్మూలించాల్సిందే! అది ప్రభుత్వ తక్షణ కర్తవ్యం. దుండగుడు హిందువా, క్రైస్తవుడా, దళితుడా, గిరిజనుడా, అగ్రకులస్తుడా అనేది చూడకూడదు. అలాగే, ఈ సమస్య మళ్ళీ తలెత్తకుండా చెయ్యాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది. అన్ని వర్గాల వారికీ ఆమోదయోగ్యంగా ఉండేలా పరిష్కారాన్ని అమలు చెయ్యాలి. దూరదృష్టి, సద్వివేచన, పెద్దరికం ఉన్న నాయకులకే ఇది సాధ్యం! గొడవలకు మూలాన్ని పట్టుకుని మళ్ళీ తలెత్తకుండా చావుదెబ్బ కొట్టాలి.మూలకారకుల పీచమణచాలి.

ఈ సమస్యలోని మరో విషాదకర పార్శ్వమేంటంటే.. స్వామి హత్య ఎవరు చేసారనేది ఇంతవరకు తేలలేదు సరికదా, దాని సంగతీ పట్టించుకునేవాడే లేడు. ఉరుకులు పరుగులతో “క్రైస్తవులపై హిందువుల దాడి”ని ఖండించేందుకు అత్యుత్సాహం చూపించే లౌకికవాదులేగానీ, స్వామిని చంపిందెవరని అడిగేవాడే లేడు. స్వామిది వర్గ హత్య అని, ఆ తరవాత జరిగింది మాత్రం మత ఘర్షణ అనీ వ్యాఖ్యానించారు. మాధ్యమాలు కూడా అంతే!

కంధమాల్లో జరిగినది భారతంలో ఎక్కడైనా జరగొచ్చు. అక్కడ ఎస్సీలు, ఎస్టీల మధ్య జరిగింది. ఇతర చోట్ల వేరేవారి మధ్య జరగొచ్చు. ఉదాహరణకు దళిత హిందువులకు, దళిత క్రైస్తవులకూ జరగొచ్చు. జనగణన లెక్కలు ఖచ్చితంగా జరిగితే ఈ వివాదం బయటపడొచ్చు. దళిత క్రైస్తవులకు, దళిత ముస్లిములకు రిజర్వేషన్లు ఇవ్వాలనే వాదనొకటి ఉంది, గమనించే ఉంటారు. ఈ మధ్య అదేదో కమిషనొకటి వేసి దాని చేతా వీళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పించారు. మతమార్పిడికి అనుకూలంగా క్రైస్తవ ప్రచారకులు చెప్పే ప్రధానమైన వాదనేంటంటే.., క్రైస్తవంలో కులాల్లేవు, కులవివక్ష లేదు, అణచివేత లేదు అని. మతమార్పిడి సమర్ధకుల వాదనల్లో కూడా ఇదొకటి. అలా అయితే రిజర్వేషన్లు కావాలని ఎందుకడుగుతున్నారు? హైందవాన్ని దెబ్బతీసే క్రమంలో క్రైస్తవ మిషనరీలు చేస్తున్న దీర్ఘకాలిక కుట్రలో ఇదీ ఒక భాగమే.

మతం పుచ్చుకున్నవారు హాయిగా జీవిస్తూ జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారనేది పూర్తిగా అవాస్తవమేమీ కాదు.. కొందరు హాయిగానే ఉన్నారు. గుర్రం జాషువా లాగా వెతలనుభవించినవారూ ఉన్నారు. క్రైస్తవంలోని ఆంక్షలకు, వివక్షకు జాషువా ఒక నిదర్శనం. కంధమాల్లో కూడా రోజుకో గుప్పెడు ధాన్యాన్ని ప్రతి ఒక్కరు చర్చికి సమర్పించాలంట. తమ దొడ్లో పుట్టిన ఆవుదూడగానీ, బర్రెదూడగానీ మొదటిదాన్ని చర్చికి సమర్పించాలంట. వివక్ష పేరుచెప్పి మతాలు మార్చి, క్రైస్తవులు చేసేది ఇది.

మతమార్పిడి, మత ప్రచారమూ లేకపోతే కంధమాల్ జరిగేది కాదు అని స్పష్టం. అంచేత ఈ మతమార్పిడులను ప్రచారాలను నిషేధించాల్సిన అవసరం ఉంది.

రక్తపాత రహిత కుట్ర !

ఈ జాబుకు ప్రేరణ నాగప్రసాదు రాసిన మీరు దేవుణ్ణి తింటారా అనే జాబు. నిజానికి ఈ జాబు అంతా అక్కడే వ్యాఖ్యగా రాయాల్సింది.. పెద్దదై పోయింది, పైగా కాస్త అసందర్భం అవుతుందేమోనన్న శంక.. అంచేత ఇదిగో ఇక్కడ..

నా దేవుణ్ణి నేను పూజించుకుంటున్నాను. నా మతాచారాలను, అనూచానంగా వస్తూ ఉన్న సంప్రదాయాలను నేను పాటిస్తున్నాను. ఇప్పుడు ఎవరో వచ్చి, మీ ఆచారాలు తప్పు, మీ దేవుడు మిధ్య, మా దేవుడు గొప్ప, ఈ విగ్రహాలేంటి, ఆ బొట్టేంటి ఇవన్నీ తప్పు అని చెబితే ఎలా ఉంటుంది? ‘ఇక ఈ అనాచారాలను ఆపేసి, మా మతంలో చేరిపో, ఇదిగో నీకీ లాభాలు కలుగుతాయి’ అని ఊదరగొడితే ఎలా ఉంటుంది. ‘పోనీలే, తన మతాన్ని తాను ప్రచారం చేసుకుంటున్నాడు, మనకెందుకులే’ అని ఊరుకోగలమా? నా దేవుణ్ణి కించపరచకుండా తమ దేవుడి గురించి చెప్పుకుంటే అలాగే అనుకోవచ్చు. కానీ వీళ్ళు చేస్తున్నది అది కాదే! నాగప్రసాదు గారి విషయంలో జరిగిందీ అది కాదు.

నేనూ మత మార్పిడి ప్రచారకులను చూసాను, చూసిన వాళ్ళు చెప్పగా విన్నాను.. ఏ ఒక్ఖరు కూడా తన మతంలోని మంచి వరకు చెప్పి ఊరుకోలేదు. ఎవరూ కూడా నా మతాన్ని విమర్శించకుండా తమ ప్రచారాన్ని ముగించలేదు. నా మతంలోని తప్పులను ఎంచకుండా ఎవరూ ఊరుకోలేదు. అసలు అలాంటివాళ్ళు అసలే ఉండరని అనను. ఉంటేగింటే ఖచ్చితంగా వాళ్ళు గంజాయి వనంలో తులసిమొక్కలని మాత్రం చెప్పగలను.

అందరినీ గౌరవించాలి -అది ధర్మం. కానీ నన్ను తక్కువగా చూసేవాణ్ణి, తేలిక చేసేవాణ్ణి నేనెలా గౌరవించను!? నా దగ్గరకొచ్చి తన దేవుడి గురించి చెప్పి, నా దేవుణ్ణి విమర్శించి, నా ఆచారాలను విమర్శించి, ‘నువ్వు మతం మార్చుకుని నా మతంలోకి వచ్చేయ్’ అని చెప్పేవాడు సరైన వాడెలా అవుతాడసలు ? ‘ఇదిగో మీ మతంలో ఇలా ఉంది, కానీ మా మతంలోనైతే ఇది ఇలా భలేగా ఉంటది’ అని చెప్పేవాడు మంచిమాటలు చెబుతున్నట్టా ? అలాంటివాళ్ళను ఎదిరించడం తప్పా? నా మతమంటే నా సంస్కృతి, నా వారసత్వం! తన మతం గొప్పదనం చెప్పుకోడం కోసం, నా సంస్కృతిని విమర్శిస్తే నేను ఊరుకోలేను గదా!

~~~~~~~~~~~~~

వాళ్ళు చాపకింద నీరులాగా మార్పిళ్ళు చేస్తూంటారు. ప్రచారాలు, ప్రలోభాలు, డబ్బులు,… ఇవీ, ఇలాంటివీ వీళ్ళ ఆయుధాలు. ఈ ఆయుధాలతో కనిపించని హింస సృష్టిస్తున్నారు. సమాజంలో కొత్త విభజనలు తెస్తున్నారు. రక్తపాత రహిత కుట్ర ఇది (ఇలా మార్పిళ్ళు చెయ్యకుండా చట్టాలు తేవడం తప్పని పోపు మనకు చెప్పిన నీతుల గురించి గతంలో రాసాను.). బలవంతపు మార్పిళ్ళకూ, వీటికీ తేడా లేదు. ఈ మార్పిళ్ళు అనేక అనర్ధాలకు దారితీయడం ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. గతంలో ఎన్నో అనర్ధాలు జరిగాయి కూడా! ఇవి సమాజంలో ఉద్రిక్తతలకు, హింసకు దారి తీస్తున్నాయి. ఈ పరిస్థితి మారాలి. మత మార్పిడిని, అందుకోసం చేసే ప్రచారాలను నిషేధించాలి.

——————————————-

(మతం వర్గంలో నేను రాసిన ఇతర వ్యాసాలను కూడా చూడండి.)

Categories: మతం

అమరనాథ దేవాలయ స్థల వివాదం

సమర్థంగా వివాదాలను సృష్టించడంలోను, అత్యంత అసమర్థంగా వాటితో వ్యవహరించడంలోను కాంగ్రెసు మేటి. సరికొత్తగా అమరనాథ్ దేవాలయానికి స్థలం ఇచ్చినట్టే ఇచ్చి, మళ్ళీ తీసేసుకుని లేని గొడవొకదాన్ని సృష్టించారు. ఒక సున్నితమైన విషయాన్ని ఎంతలా కెలకొచ్చో అంతలానూ కెలికారు. ఎంత అసమర్థంగా వ్యవహరించారంటే..

ముందు దేవాలయ బోర్డుకు వందెకరాల అటవీస్థలాన్ని ఇచ్చారు. ఎందుకూ..? అమరనాథ యాత్ర చేసుకునే యాత్రికుల తాత్కాలిక వసతి నిమిత్తం గుడారాలను వేసేందుకు. కాంగ్రెసు, పీడీపీల ఉమ్మడి ప్రభుత్వం ఈ భూమిని ఇచ్చింది. సంతకం పెట్టిన మంత్రి పీడీపీకి చెందినవాడే. ఓ చేత్తో భూమిని ఇచ్చిన పీడీపీ నాయకులే, ఆ వెంటనే వీధుల్లోకి వచ్చి దాన్ని నిరసిస్తూ నాటకాలు మొదలుపెట్టారు.

ఆ నిరసనలకు కారణం తెలిస్తే బాధ కలుగుతుంది…

కేవలం గుడారాలు వేసుకునేందుకు ఇచ్చిన ఆ భూమిలో శాశ్వత కట్టడాలు కట్టి, హిందువులకు అక్కడ నివాసం ఏర్పాటు చేస్తారట. దానితో కాశ్మీరు లోయలో ముస్లిములకు ఉన్న మెజారిటీ పోతుందట !! (డెమోగ్రఫీ – జనతుల్యత – మారిపోతుంది అని వాళ్ళ వాదన) లక్షలాది మంది హిందువులను కాశ్మీరు నుండి తరిమికొట్టినపుడు మారిపోయిన జనతుల్యత గురించి అడిగినవాడు లేడు. అలా తరిమికొట్టి మరీ సాధించిన తిరుగులేని మెజారిటీ పోతుందని వారి భయం.

 • హిందువులందరినీ కాశ్మీరు నుండి ఎప్పుడో వెళ్ళగొట్టేసారు. ఇప్పుడు, యాత్రికులుగా వెళ్ళేవారి వలన ఈ ముస్లిములకు ప్రమాదమొచ్చిందట!
 • సంవత్సరంలో రెండే నెలల పాటు వస్తారు యాత్రికులు. వాళ్ళు కూడా దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వస్తారు. యాత్ర అవగానే వెళ్ళిపోయేవాళ్ళే. ఆ వచ్చే కొద్ది మంది కారణంగా జనాభా లెక్కలు తారుమారయి పోతాయా?
 • జమ్మూకాశ్మీరు రాష్ట్రం విస్తీర్ణం కొన్ని లక్షల ఎకరాలుంటుంది. అందులోంచి కేవలం వంద ఎకరాలు ఒక గుడికి ఇస్తే కొంపలంటుకుంటాయా? (ఈ ప్రశ్న వేసుకుంటూంటేనే ఏదోలా ఉంది.., మన దేశంలోనే మనం అడుక్కోవడమేంటని)

ఆ భూమిలో శాశ్వత కట్టడాలు కడతారా లేదా అనే సంగతి పక్కన పెడదాం.. దేశం నుండి విడిపోతామనే శక్తులతో గొంతు కలిపి ఈ రాజకీయ పార్టీల వాళ్ళు అంటున్నదేమిటి? కాశ్మీరు మాది, ఇతర ప్రాంతాల నుండి ప్రజలు ఇక్కడకు వచ్చి ఉండటానికి వీలు లేదు అని! ఈ దేశంలో పౌరుడికి ఎక్కడికైనా వెళ్ళి బతికే స్వేచ్ఛను రాజ్యాంగం కల్పిస్తోంది కదా! రాజ్యాంగం కల్పించిన ఈ హక్కును కాలరాస్తూ దేశ సమగ్రతకు భంగం కల్పించేవారిని అదుపులో పెట్టలేకపోయిన కేంద్ర ప్రభుత్వం చవటతనం ఎలాంటిదంటే…

 • ఇచ్చిన భూమిని వెనక్కు తీసేసుకుంటే దాని వలన ఎలాంటి పరిణామాలు ఎదురౌతాయో, అది హిందువులకు బాధ కలిగిస్తుందేమోనని ఆలోచించలేదు.దేశాన్ని చీల్చాలనుకున్న వారి కోరికను మన్నించి, కేటాయింపును రద్దు చేసింది.
 • ఇప్పుడు ఆ కేటాయింపు రద్దుకు నిరసనగా జమ్మూలో హిందువులు గొడవ చేస్తూంటే రెండు మూడు వారాల దాకా వాళ్ళలో కదలిక రాలేదు. వాతావరణం వేడెక్కుతూంటే బీజేపీ, అద్వానీ గుర్తొచ్చారు.
 • భూకేటాయింపు రద్దును నిరసిస్తూ జమ్మూలో ప్రజలు చేపట్టిన సమ్మెకు ప్రతిగా ఈ వేర్పాటువాద శక్తులు ఏం చేస్తున్నాయీ… నియంత్రణరేఖను దాటి పాక్ ఆక్రమిత ప్రాంతంలోకి వెళ్ళి తమ యాపిలు పళ్ళను అమ్ముకుంటారట. దానికి మంత్రి శివరాజ్ పాటిల్ ఇలా అన్నాడు: “మీరా దారిని పోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. అది మాకూ మంచిది కాదు, మీకూ మంచిది కాదు”. ఇక్కడ “మేము” ఎవరు, “మీరు” ఎవరు? మేం మీ దేశస్తులం కాదు, మా కాశ్మీరు మీ దేశంలో భాగం కాదు అని అంటున్నవారితో ఈయన కూడా అదే ధోరణిలో మాట్టాడుతున్నాడు. ఈ రకం వేర్పాటు శక్తుల పట్లేమో ఉదారత్వం చూపిస్తారు, న్యాయమైన కోరిక కోరుతున్నవారినేమో పట్టించుకోరు.

ఒక సంగతి గుర్తొస్తోంది.. ప్రధానమంత్రి మన్మోహన్ సింగు చెప్పాడు – “దేశంలోని వనరులపై మొదటి హక్కు ముస్లిములకే ఉంద”ని. మతపరంగా ప్రజలను చీల్చి, మైనారిటీలను బుజ్జగించి, పక్షపాతంతో వ్యవహరించే బాటలో కాంగ్రెసు ప్రభుత్వం పోతోందనడానికి ఇలాంటి నిదర్శనాలు ఇంకా ఉన్నాయి.

ఇక్కడ (కాశ్మీరులో) ముస్లిములు మాత్రమే ఉండాలి, హిందువులు ఉండరాదు అని మాట్లాడ్డం ఒక్క ముస్లిములకే చెల్లుతుంది ఈదేశంలో. (ముంబైలో థాకరేలు చేస్తున్నదానితో పోల్చే లౌకికవాదులు లేకపోలేదు) ఆ ధోరణికి ఎదురు తిరిగి, అది తప్పని చెప్పిన వాళ్ళేమో మతవాదులు, మితవాదులు!

దార్లు కొట్టేవాళ్ళూ డాక్టర్లను కొట్టేవాళ్ళూ

దోపిడీ దొంగలు, దార్లు కొట్టేవాళ్ళూ ఎలా పనిచేస్తారు? అవకాశం చూసుకుని ఒక్కసారిగా మీదపడి, దౌర్జన్యం చేసి, ఎంత హఠాత్తుగా వచ్చారో అంతే అకస్మాత్తుగా మాయమైపోతారు. మళ్ళీ తరువాతి దోపీడీ దాకా కనబడరు.

ఆ ఎమ్మెల్యేల మాట సాధారణంగా వినబడదు పత్రికల్లో, శాసనసభలో కూడా. ఈ మధ్య మాత్రం అన్ని పత్రికల్లోనూ పతాక శీర్షికలకెక్కుతున్నారు. తస్లీమా నస్రీన్‌ను కొట్టి ఓ రోజు, నీలోఫర్లో ఓసారి, ప్రసూతి ఆసుపత్రిలో ఓసారి డాక్టర్లను కొట్టి వార్తల్లోకెక్కారు. కొట్టి వెళ్ళిపోయాక మళ్ళీ వాళ్ళ మాటా పేరూ వినబడవు.., తరువాతి దౌర్జన్యం వరకూ. ఈలోగా ప్రభుత్వం మాత్రం ఆ దెబ్బలు తిన్నవాళ్ళ మీదే కేసులు పెట్టి, ఎస్మాలు పెట్టి హడావుడి చేస్తూ ఉంటుంది.

మొన్న డాక్టర్లను కొట్టిన వాళ్ళు ఇప్పుడేమంటున్నారు.. డాక్టర్లు ముస్లిములకు వ్యతిరేకులట. ఎంత అసంబద్ధమైన మాట! తెలిసిపోతోంది కదా.. వీళ్ళ దొంగ బుద్ధి! తిప్పి తిప్పి మతం దాకా తెచ్చి, ఇదిగో ముస్లిములను రక్షించడం కోసమే మేమీ దాడులు చేస్తున్నాం. మేమే మీ రక్షకులం అని చెప్పుకోవడమన్నమాట. వారి కోసం మేము ఎంతో పాటు పడుతున్నామని చెప్పుకుంటూ, వారి ఓట్లు కొల్లగొట్టే చవకబారు ఎత్తు తప్ప మరోటి కాదు.

మరి ప్రభుత్వ నేతలెందుకు ఊరుకుంటున్నట్టు? వాళ్ళక్కూడా ఓట్లు కావాలి కదా, వాళ్ళకి మాత్రం చేదా. పైగా ఎమ్మైయెమ్ పార్టీ భుజాలెక్కి హైదరాబాదు ఎన్నికలను దాటాలని గదా, కాంగ్రెసు ప్రయత్నం! అంచేత, వాళ్ళీ దౌర్జన్యాలను పట్టించుకోరు. గట్టిగా మాట్టాడితే దెబ్బలు తిన్నవారిమీదే కేసులు పెడతారు, తస్లీమాపై పెట్టినట్టు!

మానవ హక్కుల సంఘాల వారు, పౌరహక్కుల సంఘాల వారు ఎక్కడా వినబడరూ, కనబడరే? పోలీసుల మీద ఒంటి కాలి మీద లేస్తారే.., మరి ఈ దౌర్జన్యాల గురించి మాట్లాడరేంటి?