Archive

Archive for the ‘మతమార్పిడి’ Category

హిందూ వ్యతిరేక దళితిస్టువాదం

దేశంలో కొంతమందికి హిందూమతాన్ని విమర్శించడం ఫ్యాషనైపోయింది. హిందూమతాన్ని తిడుతూ, ఇతర మతాలను వెనకేసుకొస్తూంటారు. వీళ్ళు కాలం చెల్లిన, బూజు పట్టిన పాత కబుర్లు చెబుతూ, “మనుస్మృతిలో అలా చెప్పారు, రామాయణంలో ఇలా చెప్పారు, కొన్ని కులాల వాళ్ళను వేదం చదవనీయలేదు, కృష్ణుడు ఇలా చేసాడు, దేవుళ్ళంతా కొన్ని కులాలకే చెందినవాళ్ళు, ఇతర కులాలకు దేవుళ్ళు లేరు..” – ఇలాంటి అరిగిపోయిన వాదనలు చేస్తూంటారు. ఇలాంటి వాదనలు చేసేవాళ్ళను దళితిస్టువాదులు అనీ, వీళ్ళ వాదాన్ని దళితిస్టువాదం అని అంటారు. బ్రాహ్మణవాదం, బ్రాహ్మిణికల్ యాటిట్యూడ్ అంటూ ఒక ఆలోచనాధోరణి ఉందని అంటూంటారు చూసారూ.. అలాంటిదే ఈ దళితిస్టువాదం. ఈ దళితిస్టువాదం కేవలం దళితకులాలవాళ్ళే చేస్తారని అనుకుంటే అది పొరపాటు; ఎవరైనా చేస్తారు. అలాగే దళితవాదం దళితిస్టువాదం ఒకటేనని కూడా పొరపాటు పడకూడదు. దళితవాదం దళితుల అభ్యున్నతి గురించో, దళితుల గురించో మాట్టాడుతుంది. ఇదలాక్కాదు.. దీనిముఖ్యమైన లక్షణమేంటంటే ప్రతిదానికీ హిందూమతాన్ని పట్టుకు విమర్శించడం! ఒక్క ఉదాహరణ చెబితే గబుక్కున అర్థమౌతుంది..

ఇదిగో మా ఇంట్లో ఇవ్వాళ పాలు విరిగిపోయాయి, మీ ఊళ్ళో నిరుడు శివరాత్రికి వాన కురిసిందిగదా.. అందుకే ఇలా జరిగింది. కాబట్టి తప్పంతా హిందూమతానిదే, అంచేత నువ్వు వెంఠనే మతం మారిపోవాలి.

ఇలా ఎవరైనా మాట్టాడితే వాళ్ళని దళితిస్టువాదులంటారు. దాన్ని దళితిస్టువాదం అంటారు.

దళితిస్టువాదులు ‘ఇతర మతం’ చేతిలో బొమ్మలు. ఆ మత ప్రచారకులకు వల్లమాలిన దొంగ తెలివితేటలుంటాయి. ఖతర్నాక్‌లు వాళ్ళు. వాళ్ళు ఈ దళితిస్టువాదులను ఆడిస్తూంటారు. వీళ్ళచేత మాట్టాడిస్తూంటారు. హిందూమతానికి వ్యతిరేకంగా మాట్టాడ్డానికి పురాణాలు వేదాలపై కత్తులు ఝళిపించేవాళ్ళు గతంలో. కానీ తమ కత్తిని హిందూవ్యతిరేకత మీద సానబట్టే క్రమంలో దాన్ని అరగదీసి, అరగదీసి, అరగదీయగా కత్తి పూర్తిగా అరిగిపోయి ఉత్త పిడి మిగిలింది వీళ్ళ చేతుల్లో. అది పట్టుకోని పిడివాదం చేస్తూంటారు. దళితిస్టువాదుల వాదాలు కొన్ని చూద్దాం.

గతంలో హిందూమతం నిరంకుశంగా పాలించి కొన్ని కులాలను అణిచేసింది. కాబట్టి వాళ్ళంతా ఇప్పుడు గబగబా మతం మార్చేసుకోవాలి అని అంటూంటారు. అందుకోసం ఒక భావజాలాన్ని వాడతారు వీళ్ళు. కొందరు, ‘దళితుల తిండి వేరు, వాళ్ళ సంస్కృతి వేరు,’ అంటారు. కొందరు ఇంకాస్త అతికిపోయి ‘అసలు వాళ్ళు హిందువులే కాదు. వాళ్ళ దేవుళ్ళు వేరు, హిందూ దేవుళ్ళు వేరు’ అంటూంటారు. పోచమ్మ, పోలేరమ్మలు హిందూ దేవతలు కారని ఒక ప్రొఫెసరు మాట్టాడితే ఓ పత్రికాసంపాదకుడు ఉదాహరణలతో సహా గట్టిగా జవాబిచ్చాడు.

ఇంకొంతమంది మాటల్లో విషం గక్కుతూ ఉంటారు. కొన్ని కులాలవాళ్ళ ఆహారపుటలవాట్లను హేళన చేస్తూంటారు, అక్కడికి వీళ్ళేదో రోజులో ఏడెనిమిదిపూట్ల ఉపవాసముంటున్నట్టు. ఇంకొందరుంటారు.. అసలు హిందూమతం అనే మతమే లేదంటారు. అదెప్పుడో తెలుసాండి.. ఎల్లప్పుడూ ఆమాట అనరు. దళితులు ఏ మతమైనా అవలంబించొచ్చు అని చెప్పేటపుడు ‘అసలు హిందూ మతమనేదేలేదు, అంచేత మతమార్పిడి మార్పిడే కాదు ‘ అంటారు. కొన్ని కులాలను అణచివేసింది అని చెప్పేటపుడు మాత్రం వాళ్ళకి హిందూమతం ఉంటుంది. ఎందుకంటే అణచివేసిందెవరో చెప్పేందుకు ఒక మతం ఉనికి కావాలి కదా, అదన్నమాట! ప్రభుత్వంవారి దరఖాస్తుల్లో మతం అనేచోట హిందూ అని రాసేస్తూంటాం. మళ్ళీ అప్పుడు హిందూమతం ఉంటది.

కేవలం హిందూమతం మీద ఉన్న కసి కారణంగా తమకు తోచిన విధంగా హిందూమతాన్ని అడ్డగోలుగా విమర్శిస్తూంటారు. వీళ్ళ వాదనలు వైరుధ్యాల పుట్టలు.

కానీ ఇతరమతాలను పల్లెత్తి మాట అనరు. ఆయా మతాలతో రహస్య ఒప్పందమేదో ఉన్నట్టు ప్రవర్తిస్తూంటారు. ఆ మతాలను వెనకేసుకు వస్తూంటారు. లేదు లేదు, ఆయామతాలే వీళ్ళను ముందుపెట్టుకు వస్తూంటాయి. ఇస్లామిక ఉగ్రవాదులు ముంబైలో మారణకాండ సృష్టించారని ఎవరైనా అన్నారనుకోండి.. “అలా మతం పేరుపెట్టి అనకూడదు, తప్పు తప్పు”, అంటూ మీదకొస్తారు. వీళ్ళు మాత్రం హిందూమతాన్నే కాదు, హిందూదేవుళ్ళను కూడా అడ్డగోలుగా విమర్శిస్తూంటారు.

‘హిందూమతం మిమ్మల్ని అణచేసింది కాబట్టి మీరు హిందూమతాన్ని వీడిపోవాలి, పదండి పదండి’ అని అమాయకులను ఎగదోస్తూ ఉంటారు. (ఈ సందర్భంలో హిందూమతం అనేది ఉంది -గమనించండి) అక్కడికి అవతలి మతాలేదో స్వర్గతుల్యమైనట్టు! ప్రపంచంలోని మతాలన్నిటికంటే ఈ దళితిస్టువాదులను నడిపిస్తున్న మతాలే భయంకరమైనవి. క్రూసేడ్లు చూడండి. తెల్లోడు మన దేశాన్ని ఆక్రమించుకునే క్రమంలో మతాన్ని ఒక ఆయుధంగా వాడిన సంగతి చూడండి. అసలు మన సంగతి ఎంత లెండి.. చాలా చిన్నది.. మొన్నటిదాకా జింబాబ్వే పేరు రోడీషియా. రోడ్స్ అనేవాడి పేరిట ఆ పేరు వచ్చింది. సంగతేంటంటే వాడు ఇంగ్లండు నుండి ఆ దేశానికి వలసవెళ్ళి, అక్కడ మైనింగు కోసమని భూముల్ని కాజేసి స్థిరపడిపోయాడు. వాడు పెట్టిన కంపెనీయేనట, డి బీర్స్ అనే వజ్రాల వ్యాపార సంస్థ. కాజెయ్యడమంటే మన దొరగారిలాగా ప్రభుత్వభూమి ఓ ఆరేడొందల ఎకరాలను ఆక్రమించేసుకోడం కాదు, మొత్తం దేశాన్ని ఆక్రమించేసుకుని దేశానికి తన పేరు పెట్టేసుకున్నాడు వాడు. ఇదీ వాళ్ళ గొప్పదనం. అమెరికాలో ఉన్నదెవరు? ఆస్ట్రేలియాలో ఉన్నదెవరు? -వీళ్ళు అణచివేత గురించి దళితిస్టువాదులచేత మనకు చెప్పిస్తూంటారు, భలే!

యూరపులో ననుకుంటా.. ఒక సన్నటి కొండ ఉంది.. ప్రాచీన మానవులు వేలాది గుర్రాలను మూడువైపుల నుండి కమ్ముకుని తమ ఆయుధాలు, కాగడాలతో భయపెట్టి, బెదరగొట్టి, తరిమికొట్టి వాటిని ఆ కొండకొమ్ముకు పరుగెత్తించి అక్కడినుంచి కింద లోయలోకి దూకేసేలా చేసేవారంట. అంత ఎత్తునుంచి అవి పడిపోయి తక్షణం చచ్చిపోయేవి. ఆనక తీరిగ్గా వాటిని తినేవారట.

ఇప్పుడు హిందూ వ్యతిరేకవాదులు, ప్రచ్ఛన్న మతప్రచారకులు కలిసి అమాయక హిందువులను తమ భావజాలంతో, దళితిస్టువాదంతో భయపెట్టి ‘ఇతరమతం’ లోకి దూకేలా చేస్తున్నారు. అదుగదుగో ఆ కొండకొమ్ముకు వెళ్ళి ‘ఇతరమతం’ లోకి దూకండి, అక్కడ మీకు స్వర్గం ఉంది అని చెబుతున్నారు. దూకాక ఇంకేముంది.. ఆనక ఆ ‘ఇతరమతస్తులు’ వాళ్ళను తీరుబడిగా నంజుకు తింటారు, అది ఖాయం!

ప్రజలను మతమార్పిడి కోసం ఉసిగొల్పేందుకుగాను, హిందూమతం గురించి ఎట్టా మాట్టాడినా పరవాలేదని దళితిస్టువాదం అనుకుంటోంది. వీళ్ళ వాదనల్లోని డొల్లతనాన్ని మనం బయటపెడుతూనే ఉండాలి.

——————- — X — ——————-
Advertisements

కులమార్పిడి బిల్లు తెండి

హిందూమతం నుండి ఇతర మతాల్లోకి వెళ్ళినవాళ్ళకు కూడా కులప్రాతిపదికన రిజర్వేషనులిస్తారట. హిందూమతం కాదనుకుని పోయినవాడికి హిందూమత సౌకర్యాలు ఎలా ఇస్తారు? తక్కువ కులమనే పేరుతో గతంలో వివక్ష చూపించారు, అణచివేసారు.. అంచేతే కులప్రాతిపదికన రిజర్వేషనులిస్తున్నారు. బానే ఉంది. ఇతర మతాల్లో వివక్ష ఉండదు, అందరూ సమానమే. అసలు కులమనే ప్రసక్తే లేని మతాలు అవి. ఇక్కడ వివక్ష ఉందిగదాని మతం మార్చుకుని, అద్భుతమైన సర్వసమానత కలిగిన ఆ మతాల్లోకి పోతున్నపుడు.. -మరి వీళ్ళకి కులరిజర్వేషను ఎందుకు? అసలు కులమనేదే లేని చోట కుల రిజర్వేషన్లా?

ఇది అధికారపార్టీ ద్రోహబుద్ధితో చేసిన కుట్ర తప్ప మరోటి కాదు. ఈ ముఖ్యమంత్రిలోని హిందూ ద్వేషం పడగనెత్తుతోంది. భాజపా, లోక్‌సత్తా మాత్రమే దీన్ని వ్యతిరేకించాయి. మిగతా పార్టీలన్నీ కూడా ఈ పనికి కొమ్ముకాసాయి. కులమనేదే లేనివాడికి కుల రిజర్వేషన్లిస్తున్నారు. సభల్లో ప్రశ్నలడగడానికి లంచాలు తిన్న ముష్టి సన్నాసుల్ని చూసాం గతంలో. ఆ రకంగానే వీళ్ళుగానీ ఈ బిల్లు మీద సంతకాలు పెట్టేందుకు ఎవడో విదిల్చిన కాసిని కూసిని డాలర్లకు, సెంట్లకూ కక్కుర్తి పడలేదుగదా? లేక వీళ్ళు కూడా మనకు తెలీకుండా మతం మార్చేసుకుని, బైటికి చెప్పకుండా దొంగ హిందువులుగా చెలామణీ అవుతున్నారా? ఛి.. చ్ఛీ, అకశేరుకాలు!

కొందరి వోట్ల కోసం కక్కుర్తి పడి హిందూమతానికి చేటు తెచ్చే ఈ పని చేసారు. అవున్లే, మతమంటే అభిమానం లేని జనాలకి, మానాభిమానాలే లేని జనాలకి, మనం వోట్లివ్వలా? మన ఖర్మ ఇంతే! చేసిన తప్పుకు ఫలితం అనుభవించాల్సిందే! కానీ వీళ్ళూ అనుభవించాలి.. వీళ్ళు చేసిన ఈ ద్రోహానికి గాను మళ్ళీ జీవితంలో ఏ ఎన్నికలోనూ గెలవకుందురుగాక! ఏ డాలర్ల కోసమైతే కక్కుర్తి పడి బహుశా వీళ్ళీ బిల్లుకు వోట్లేసారో ఆ చిల్లర వీళ్ళకు అందకుండుగాక! ఒకవేళ అందినా.., చిల్లరను ఏరుకోవడానికి వీళ్ళు ఏ నడుమునైతే వొంచుతారో ఆ నడుం అలాగే పడిపోవుగాక! వీళ్ళ పెళ్ళాం బిడ్డలు వీళ్ళను ఛీ.. దరించుకుందుగాక! అమ్మలారా అయ్యలారా.. మీకు తెలిసినవాళ్ళెవరైనా ఈ బిల్లుకు వోటేసిన _ _ _ ల్లో ఉంటే వాళ్ళకు చెప్పండి.. వాళ్ళెదురైతే హిందువులు మొహం మీదే..

~~~~~~~~~~~

ఇతర మతాల్లోని జనాలకి రిజర్వేషనులిస్తే రిజర్వేషను శాతం పెరిగిపోద్దేమోననేది నా బాధ కాదు. అందువలన కలిగే నష్టం కొంతే -హిందువుల పిల్లలకు ఉద్యోగం రావడం మరింత కష్టమౌతుంది. కానీ హిందూమతం కాదనుకుని వెళ్ళినవాడికి కూడా హిందూమతంలో ఉండే అన్ని సౌకర్యాలనూ కల్పిస్తున్నారు చూసారూ.. ఇది హిందూమతాన్ని అణచివేసే తీవ్రమైన చర్య.

ఎదురుగా చిల్లర డబ్బులు కనబడితే వంగకుండా, మోకాళ్ళమీద కూచ్చోకుండా, సాగిలపడకుండా ఉండలేరనుకుంటా మనమెన్నుకున్నవాళ్ళలో కొందరు -అకశేరుకాలు కదా! అంచేత మనం కూడా తలా పావలానో ముప్పావలానో చందాలేసుకుని ఈళ్ళ మొహాన కొడదాం.. కులమార్పిడి బిల్లు కూడా తెచ్చిపెట్టండి, హిందువన్నవాడు మతాన్ని మార్చుకునే అవకాశమున్నట్టే కులాన్ని కూడా మార్చుకునే బిల్లు తెండి. ఇదిగో ఈ చిల్లర తీసుకోండి అని వాళ్ళమొహాన కొడదాం. ఏనుగులు మింగోటోడికి ఈ పలహారం ఆనదేమో అని అంటున్నారా.. చేస్తార్లెండి, సిల్లరెదవకి ఏ చిల్లరైనా ఒకటే!

హిందూమతంపై దాడి

August 24, 2009 8 comments

* ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దేవాదాయ శాఖ మంత్రి గాదె వెంకటరెడ్డి, ‘ హిందూ దేవాలయాల్లో పనిచేసేవారు హిందువులే అయ్యుండాల్సిన అవసరం లేదు. ఏ మతస్తులైనా పనిచెయ్యవచ్చు ‘ అని చెప్పాడు.

* మనదేశంలో మతమార్పిడి చెయ్యడం ఎంత చురుగ్గా జరుగుతోందో మనకు తెలుసు. ఈ మతబేహారులు చాపకింద నీరులాగా సమాజమంతా పాకి ఉన్నారు. డబ్బులు ఎరవేసి, ప్రజల మతం మారుస్తారు. కానీ మతం మార్చాక కూడా వాళ్ళను హిందువులుగానే చెలామణీ చేయిస్తారు. హిందువులకుండే రిజర్వేషనులు అనుభవించాలిగదా మరి! హిందువులుగా చెలామణీ అవుతున్న కొందరు హిందువులు కారు. హైందవం వద్దనుకుని బయటికిపోయినవారు .

~~~~~~~~~

కోదండరామస్వామి గుడిలో పూజారి దేవుడి నగలను తాకట్టు పెట్టుకున్నాడు. పూజారి చేసినది తప్పే. అందుకు తగిన శిక్ష పడాల్సిందే. ఇంకా అలాంటి తప్పులెక్కడెక్కడ జరిగాయో అవన్నీ కూడా తేలాలి, శిక్షలూ పడాలి. తప్పు చేసినది పూజారైనా పడాలి, ప్రభుత్వ అధికారైనా పడాలి. అడ్డదారినో దొడ్డిదారినో గుడుల్లోకి జొరబడ్డ రాజకీయులైనా సరే శిక్ష పడాల్సిందే! గతంలో తప్పులుచేసినవాళ్ళకు ఏం శిక్ష వేసారో కూడా చెప్పాలి. హైదరాబాదులోని తితిదే సత్రంలో తాగి తందనాలాడినవాళ్ళను ఏంచేసారో చెప్పాలి. ఆ తాగుబోతుల నాయకుణ్ణి ఏంచేసారో చెప్పాలి. తితిదే పాలక సంస్థలోకి ప్రత్యేక ఆఫీసరు పేరిట అర్హత లేనివాళ్ళు ఎలా వచ్చారో చెప్పాలి.గుడుల్లో అన్యమతప్రచారం చేసినవాళ్ళకు ఏం శిక్ష వేసారో కూడా చెప్పాలి.

~~~~~~~~~

కానీ వీళ్ళందరినీ శిక్షించినంత మాత్రాన పరిస్థితులు చక్కబడతాయా? హైందవ ద్వేషులు అక్కడితో ఆగుతారా? అసలు కథ ఇంకోటుంది. ఈ సంఘటనను ఆసరాగా చేసుకుని గుడులమీద ప్రభుత్వ పెత్తనాన్ని విస్తరించేందుకు ప్రయత్నాలు జరుగుతాయి. ‘చ్చొ..చ్చొ..చ్చొ చూసారా.. దేవుడి సొమ్ముకు భద్రత లేకుండా పోయింది. దీనిమీద ప్రభుత్వ ఆజమాయిషీ మరింతగా పెరగాలి’ అంటారు. నగల సంగతి చూట్టానికి ఇంకో అధికారిని వెయ్యాలంటారు. ఆ తరవాత ఆ నగలు, డబ్బులన్నిటినీ ఒకచోటికి తరలించి ప్రభుత్వ నియంత్రణలో పెడదామంటారు.  అసలు పూజారులందరూ అధికారుల పర్యవేక్షణలోనే మంత్రాలు చదవాలంటారు. గుడులను, ఆచార వ్యవహారాలను పూర్తిగా ప్రభుత్వ ఆజమాయిషీలోకి తెచ్చేందుకు కుటిల యత్నాలు చేస్తారు. ప్రభుత్వం మనదే కదా, మనమెందుకు వద్దనాలి?

~~~~~~~~~~

  1. దేవాదాయశాఖ మంత్రి ‘హిందూ దేవాలయాల్లో పనిచేసేవారు హిందువులే అయ్యుండాల్సిన అవసరం లేదు. ఏ మతస్తులైనా పనిచెయ్యవచ్చు’ అని చెప్పాడు. ఇలాంటివాళ్ళు మనకు మంత్రులుగా ఉన్నప్పుడు హిందూమతానికి రక్షణ ఏముందిక? హైందవమంటే ఏమీ తెలవనివాడు గుడిలో కార్యక్రమాలను నిర్వహిస్తాడు. హిందవమంటే ద్వేషం కలిగినవాడూ గుడిలో పనులు చేస్తాడు. ఎంత నీచమైన ఆలోచనో చూడండి. పైగా దేవాలయాల వ్యవహారాలను చూడాల్సిన మంత్రి ఆలోచన ఇది.
  2. మతబేహారుల చేతుల్లో మతమార్పిడికి గురై అస్తిత్వం కోల్పోయి, కొత్త ముఖాలు, కొత్తపేర్లు  తెచ్చుకుంటారే.. వీళ్ళు హిందువుల్లాగానే చెలామణీ అవుతూంటారు. ప్రభుత్వ లెక్కల్లో తమను హిందువులుగానే రాయించుకుంటారు. ఈ దొంగ హిందువులు కూడా మిగతావాళ్ళలాగానే ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరతారు. అందుకు ఆక్షేపణేమీ లేదు. వాళ్ళు దేవాదాయ ధర్మాదాయ శాఖలోనూ చేరతారు. వాళ్ళే గుడుల్లో అధికారులూ అవుతారు. వాళ్ళే గుడి రోజువారీ వ్యవహారాల్లో కలగజేసుకుంటారు. హిందువుకానివాళ్ళు హిందూ దేవాలయ వ్యవహారాలు చూస్తూ ఉంటారు! పైకి వాళ్ళు హిందువులే, కానీ కేవలం ప్రభుత్వ లెక్కల్లోనే హిందువులు, అంతే! దేవాలయ వ్యవస్థను కూలగొట్టడానికి ఇది చాలదా?

వీటి పర్యవసానాలు హిందూమతానికి, మత కేంద్రాలైన గుడులకూ చేటు. మనందరం ఈ ప్రభుత్వ జోక్యాన్ని వ్యతిరేకించాలి. గుడుల్లో ఏ పని ఏ కులస్తుడు పనిచేసినా తప్పులేదు. కానీ ఏ మతస్తుడైనా చెయ్యొచ్చనడం మాత్రం తప్పు! అసలా మాట అనడమే హిందువులకు అవమానం! అసలు రాజకీయ నాయకులు గుడి వ్యవహారాల్లోకి ఎందుకు రావాలి? గుడుల నిర్వహణకు ధార్మిక సంస్థలతో కూడిన వ్యవస్థ ఒకటి ఉండాలి. ప్రభుత్వానికి గుడి సంగతి అనవసరం! లౌకికరాజ్యం అని చెప్పుకుంటున్నాం గదా.. గుడి సంగతి రాజ్యానికెందుకు?

హైందవాన్ని అణచేద్దామని మాటేసి ఉన్న కేటుగాళ్ళ పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి. మతమార్పిళ్ళను వ్యతిరేకించాలి. మతమార్పిళ్ళను, మతం పేరిట దేశంలోకి డబ్బు రాకడను నిషేధించాలి. మతమార్పిడి రానున్న కాలంలో మనమెదుర్కోబోతున్న అతిపెద్ద సామాజిక సమస్య. హిందువులెందరో, దొంగ హిందువులెందరో, ఇతర మతస్తులెందరో సరిగ్గా లెక్కతేల్చాలి. ఇతర మతాలను వ్యతిరేకించడం కాదు, ఇతర మతాలు హిందూమతమ్మీద చేస్తున్న గుట్టుచప్పుడు దాడిని ఎదుర్కోవాలి.

———————-         ———————          ——————–

కంధమాల్ కథేమిటి?

October 11, 2008 17 comments
ఒరిస్సాలోని కంధమాల్ జిల్లాలో జరుగుతున్న కుల/మత ఘర్షణలు ఈమధ్య కాలంలో దేశవ్యాప్తంగా కలకలం కలిగించాయి. ఆ కలహాలకు మూల కారణమైన క్రైస్తవం బయటి దేశాలతో మతపరమైన సంబంధాలు కలిగి ఉండటాన, ఆ మతం, ఆ దేశాలు అంతర్జాతీయ రాజకీయాల్లో పలుకుబడి కలిగినవి కావటాన, ఈ ఘర్షణలు అంతర్జాతీయ దృష్టికి చేరాయి. ప్రధానమంత్రిని ఫ్రాన్సులో నిలదీసిన సంఘటన కూడా జరిగింది. “రెండేళ్ళ కిందట మీ పారిస్‌లో ముస్లిములపై అలా దౌర్జన్యాలు చేసారేంటని నేను అడిగానా? మీకెందుకు మా సంగతి?” అని ఆయన అడగాల్సింది. లేదూ.. క్రైస్తవ మిషనరీలు భారత్‌లో లేపుతున్న కల్లోలాల గురించి చెప్పి, “ముందు మీవాళ్ళని అదుపులో పెట్టండి. ఆ తరవాత గొడవల గురించి మాట్టాడండి” అని చెప్పుండాల్సింది. కనీసం “అది మా ఇంటిసంగతిలే, మేం చూసుకోగల్దుంలే” అనైనా అనుండాల్సింది. (పాపం ఒకచేతిలో యురేనియమ్ జోలె ఉండటాన ఆ మాట అడగలేకపోయి ఉండొచ్చు.) ఏదో తప్పు చేసినవాడిలాగా అక్కడేం మాట్టాడకుండా, ఇంటికొచ్చి దిండులో తలదూర్చి ఎక్కెక్కి ఏడిస్తే ఏం లాభం!?

అసలు కంధమాల్‌లో జరిగిన గాథ క్లుప్తంగా ఇక్కడ...

———————————

కంధమాల్ జిల్లా జనాభాలో ఎస్సీలు, ఎస్టీలదే ప్రాబల్యం. ఎస్సీలు  17 శాతం ఉంటే, ఎస్టీలు 52 శాతం. బ్రిటిషువారి కాలంలోనే మిషనరీలు కంధమాల్ జిల్లాలో ప్రవేశించి ఇక్కడి ప్రజలను క్రైస్తవంలోకి మార్పిడి చెయ్యడం మొదలుపెట్టాయి. అసలు బ్రిటిషు సైన్యం అక్కడ కాలూనలేని పరిస్థితిలో మిషనరీలను ముందు పంపించారట. దేశంలోని ఇతర ప్రాంతాల్లో లాగానే ఇక్కడ కూడా స్వాతంత్ర్యం తరవాత మత మార్పిళ్ళు వేగం పుంజుకున్నాయి. కంధమాల్ జిల్లాలో ఈ మార్పిళ్ళు మరింత ఎక్కువగా జరిగాయి. అక్కడ మొత్తం క్రైస్తవుల్లో 60 శాతం మంది ఎస్సీలు కాగా, మిగిలిన వాళ్ళలో అత్యధికులు ఎస్టీలు.

ఇక్కడొక ప్రధానమైన విషయాన్ని మనం గమనించాలి. క్రైస్తవం తీసుకున్నవారిలో (ఇప్పించబడ్డవారు) – ముఖ్యంగా దళితుల్లో – ఎక్కువమంది అధికారికంగా తమను తాము క్రైస్తవులుగా నమోదు చేసుకోరు  జనగణకులకు తాము హిందువులమని చెబుతారు. మిగతా ప్రపంచానికంతటికీ వాళ్ళు క్రైస్తవులే! మనకు ఆశ్చర్యం కలుగుతుంది.. అలా ఎందుకు, తన మతమేదో గర్వంగా చెప్పుకోవచ్చు గదా అని! దానికి ప్రధానమైన కారణం.. హిందువుగా చెప్పుకుంటే తప్ప మన ప్రభుత్వం కులపరమైన రిజర్వేషను వంటి సౌకర్యాలను వాడుకోనివ్వదు. ఈ కారణాన అసలైన క్రైస్తవుల జనాభా లెక్కలు బయటికి రావు. కొన్ని లక్షల మంది ఉద్యోగులను పెట్టి, దేశవ్యాప్తంగా, ఇంటింటికీ వెళ్ళి జనాభా లెక్కలను తయారు చేసే జనగణన వారి నిర్వాకమేంటంటే.. తప్పుడు లెక్కలు! క్రైస్తవ మిషనరీలు, ప్రచార సంస్థలకు ఉన్న నెట్‌వర్కును దృష్టిలో పెట్టుకుని చూస్తే.. వాళ్ళ దగ్గర ఈ విషయమై ఖచ్చితమైన లెక్కలు దొరకొచ్చని నా ఉద్దేశ్యం.

ఇలా హిందువుగా చెప్పుకోడానికి నా ఉద్దేశ్యంలో మరో కారణముంది.. క్రైస్తవ ప్రచారకుల, మిషనరీల భయం. నిజమైన లెక్కలు బయటికి వస్తే ప్రజల్లో ఆందోళన కలగవచ్చు, తమ మత మార్పిడి పనులకు అభ్యంతరాలు ఎదురవచ్చు అనే కారణమొకటి. మరొకటేంటంటే.. నిజం చెబితే, తత్కారణంగా  రిజర్వేషను సౌకర్యం పోతే మతం  మార్చాల్సిన మిగతా ప్రజలు ఒప్పుకోరనే భయం.

మతమార్పిళ్ళూ, కుల రిజర్వేషన్ల అంతరార్థం, అందులో కేంద్రప్రభుత్వం వారి దృష్టిలోపం, మొదలైనవాటి కథ ఇది! ఇది చాలదన్నట్టు, ప్రభుత్వం వారిదే మరో ఫర్మానా ఉంది.. మతం మారిపోతే ఎస్సీలు కుల రిజర్వేషన్లు కోల్పోతారు. ఎస్టీలకు మాత్రం మతం మారినంత మాత్రాన, సదరు సౌకర్యాలకు లోటేం ఉండదు. అంటే…

నేను ఎస్సీని, మతం పుచ్చుకున్నాను. మీరు ఎస్టీ, మీరూ మతం పుచ్చుకున్నారు. క్రైస్తవుణ్ణని చెప్పుకున్నందుకు గాను, నా కుల రిజర్వేషను పోయింది. మీరు ఎస్టీ కాబట్టి, మీకు మాత్రం ఆ సౌకర్యం అలానే ఉంది. ఈ పరిస్థితిలో రిజర్వేషను సౌకర్యాన్ని వొదులుకోకూడదంటే నేనేం చెయ్యాలి.. “నేను క్రైస్తవుణ్ణి కాదు, హిందువునే” అని చెప్పుకోవాలి లేదా నేను ఎస్టీనని చెప్పుకోవాలి. 2000 దాకా కంధమాల్ ఎస్సీలు మొదటి మార్గాన్నే నడచారు. ఆ తరువాత, 2001 జనగణనలో వాళ్లను క్రైస్తవులుగా గుర్తించారు – ఎలా జరిగిందో మరి! ఇహ అప్పటి నుండి వాళ్ళకు, ఎస్టీలమని చెప్పుకోవాల్సిన అవసరం ఏర్పడింది.

భూమి తగాదాలు: దీనికి తోడు, ఎప్పటినుండో భూమి తగాదాలూ ఉన్నాయి. ఎస్సీలు ఎస్టీల కంటే చదూకున్నవారు, ధనబలం, రాజకీయబలం కలిగినవారు. జిల్లాలోని ఎస్టీల భూమిని తనఖాల రూపంలోగానీ, ఆక్రమించుకోవడం ద్వారాగానీ, ఎస్సీలు తమ సొంతం చేసుకున్నారు. కొన్ని చోట్ల ఈ భూముల్లో చర్చీలు కూడా కట్టారు. గిరిజన చట్టాల ప్రకారం ఎస్టీల భూమిని మరొకరికి బదిలీ చెయ్యడం కుదరదు – అమ్మడం ద్వారాగానీ, మరే విధంగాగానీ! (ఇది మన రాష్ట్రంలో కూడా ఉంది. దీన్నే 1/70 చట్టం అని అంటారు. ఖమ్మం, పశ్చిమ తూర్పు గోదావరులు, ఇంకా కొన్ని  జిల్లాల్లోని ప్రాంతాల్లో ఈ చట్టం అమల్లో ఉంది. ఈ చట్టం కారణంగా జంగారెడ్డిగూడెం ప్రాంతాల్లో గొడవలు జరిగేవి కూడా! గిరిజనులు మైదాన ప్రాంతాల వారు సాగు చేసుకునే పొలాల్లో పంట కోసుకుపోవడం లాంటివి చేసేవారు. కమ్యూనిస్టులు – ముఖ్యంగా సీపీఎమ్ – గిరిజనులకు మద్దతుగా నిలబడింది.) ఈ కారణంగా ఎస్సీల అధీనంలో ఉన్న ఆ భూములను ఎస్టీలకి ఇచ్చేయాల్సి వచ్చింది. దీన్నిబట్టి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు! ఈ భూములు తమ చేజారకుండా ఉండాలంటే తమకూ ఎస్టీ హోదా ఉండాల్సిందేనని ఎస్సీలు భావించారు.

అసలింతకీ ఈ క్రైస్తవ ఎస్సీలు తాము ఎస్టీలమని చెప్పుకోడానికి ఆధారాలేంటి? ఏదో ఒక ఆధారం చూపించాలి గదా! వాళ్ళేం చేసారంటే.. తము మాట్లాడే కుయి అనే భాషను ఒక ఎస్టీ తెగగా రికార్డుల్లోకి ఎక్కించారు. ఆనక తాము కుయి అనే భాష మాట్లాడుతున్నాం కాబట్టి తాము కుయి తెగకు చెందినవారమే -అంటే ఎస్టీలమే అని వాదించారు. సహజంగానే గిరిజనులైన కోంధులు ఒప్పుకోలేదు. అలా అయితే ఆ ప్రాంతంలోని అగ్రవర్ణాలకు చెందిన వారు కూడా కుయి భాష మాట్లాడుతారు, వాళ్ళూ కుయి తెగకు చెందిన వారేనా అని అడిగారు. ఒక ఎంపీ, ఒక రాష్ట్ర మంత్రీ ఎస్సీల పక్షం వహించారు. (దరిమిలా, సదరు మంత్రి చేత ఎలాగో కష్టపడి, నైతిక బాధ్యత వహింపజేసి రాజీనామా చేయించారు.) దొంగ కుల ధృవీకరణ పత్రాలు కూడా జారీ అయ్యాయి. ఇన్ని ఛండాలాలు జరిగినచోట ప్రజల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయో ఊహించవచ్చు. ప్రజలు రెండు వర్గాలుగా చీలిపోయారు. ఎస్సీలకు, ఎస్టీలకు గొడవలు జరిగాయి. ఈ విధంగా మత మార్పిడి కారణంగా కంధమాల్ సమాజం ఉద్రిక్తతకు లోనైంది, తరచూ కల్లోలాల బారిన పడింది. 1994 లోనే గొడవలు జరిగాయి. 2001 తరవాత ఎక్కువయ్యాయి. 2007 క్రిస్ట్‌మస్ రోజున పెద్ద గొడవలే జరిగాయి. స్వామి లక్ష్మణానంద అనే హిందూ మత ప్రచారకుడిపై క్రైస్తవులు హత్యాయత్నం చేసారు. వారి ఇళ్ళను వీళ్ళూ, వీరి ఇళ్ళను వాళ్ళూ తగలబెట్టుకున్నారు. హిందూ దేవాలయాలను క్రైస్తవులూ, చర్చిలను హిందువులూ నాశనం చేసారు.

ఈ మొత్తం ఘటనలలో హిందూ సంస్థల పాత్రేంటి? చప్పట్లకు రెండు చేతులూ అవసరమే! అ రెండో చేయి హిందూ సంస్థలదే! క్రైస్తవ మత ప్రచారకుల దుష్ట పన్నాగాలను తిప్పికొట్టేందుకే కంధమాల్లోకి స్వామి లక్ష్మణానంద ప్రవేశించాడు. అప్పటికి హిందూ సంస్థలు లేవు. వాళ్ళను వ్యతిరేకించడం వల్లనే ఆయనకూ మిషనరీలకు వైరం పెరిగింది. గొడవలయ్యాయి. స్వామి దాదాపు 40 ఏళ్ళుగా క్రైస్తవుల మత మార్పిడులను ఎదుర్కొంటూ కంధమాల్ జిల్లాలో గిరిజనులకు పెద్ద దిక్కుగా ఉంటూ వస్తున్నాడు. పాఠశాలలు, గుడులూ స్థాపించి గిరిజనుల్లో మతమార్పిడిని నిరోధించాడు. గిరిజనుల సంస్కృతిని వివరిస్తూ దాన్ని నిలుపుకోవాల్సిన అవసరాన్ని తెలియజేసాడు. క్రైస్తవ వ్యాప్తికి అడ్డంకిగా నిలిచాడు. ఆయన కారణంగా గిరిజనుల మతమార్పిడి ఆగడమే కాక, పునర్మతాంతరీకరణలు కూడా జరిగాయి. సహజంగానే క్రైస్తవ ప్రచారకులకు ఇది నచ్చలేదు. క్రమేణా ఇది ఘర్షణకు దారితీసింది. గిరిజనులు ఒకవైపు, మతం పుచ్చుకున్న ఎస్సీలు ఒకవైపు చీలిపోయారు. చివరకు 2008 ఆగస్టులో స్వామి హత్య చేయబడ్డాడు.

స్వామి హత్య తరవాత జరిగిన గొడవలను మతఘర్షణలుగా అభివర్ణించారు. కానీ అవి మతఘర్షణల కంటే కూడా అవి ఎస్సీ ఎస్టీల మధ్య మతమార్పిడులు సృష్టించిన తగాదాలని స్పష్టమౌతోంది. స్వామి హత్య ఈ ఉద్రిక్త వాతావరణంలో నిప్పురవ్వయై పేలుడు సృష్టించింది.

—————————-
ఇదీ కంధమాల్ కథ. మత ప్రచారమూ, మతమార్పిళ్ళూ సృష్టించిన సామాజిక బీభత్సం. గొడవలు ఎవరు చేసినప్పటికీ ఖండించాల్సిందే! దౌర్జన్యాన్ని అణిచెయ్యాల్సిందే! దానవత్వాన్నీ, పాశవికతనూ నిర్ద్వంద్వంగా నిర్మూలించాల్సిందే! అది ప్రభుత్వ తక్షణ కర్తవ్యం. దుండగుడు హిందువా, క్రైస్తవుడా, దళితుడా, గిరిజనుడా, అగ్రకులస్తుడా అనేది చూడకూడదు. అలాగే, ఈ సమస్య మళ్ళీ తలెత్తకుండా చెయ్యాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది. అన్ని వర్గాల వారికీ ఆమోదయోగ్యంగా ఉండేలా పరిష్కారాన్ని అమలు చెయ్యాలి. దూరదృష్టి, సద్వివేచన, పెద్దరికం ఉన్న నాయకులకే ఇది సాధ్యం! గొడవలకు మూలాన్ని పట్టుకుని మళ్ళీ తలెత్తకుండా చావుదెబ్బ కొట్టాలి.మూలకారకుల పీచమణచాలి.

ఈ సమస్యలోని మరో విషాదకర పార్శ్వమేంటంటే.. స్వామి హత్య ఎవరు చేసారనేది ఇంతవరకు తేలలేదు సరికదా, దాని సంగతీ పట్టించుకునేవాడే లేడు. ఉరుకులు పరుగులతో “క్రైస్తవులపై హిందువుల దాడి”ని ఖండించేందుకు అత్యుత్సాహం చూపించే లౌకికవాదులేగానీ, స్వామిని చంపిందెవరని అడిగేవాడే లేడు. స్వామిది వర్గ హత్య అని, ఆ తరవాత జరిగింది మాత్రం మత ఘర్షణ అనీ వ్యాఖ్యానించారు. మాధ్యమాలు కూడా అంతే!

కంధమాల్లో జరిగినది భారతంలో ఎక్కడైనా జరగొచ్చు. అక్కడ ఎస్సీలు, ఎస్టీల మధ్య జరిగింది. ఇతర చోట్ల వేరేవారి మధ్య జరగొచ్చు. ఉదాహరణకు దళిత హిందువులకు, దళిత క్రైస్తవులకూ జరగొచ్చు. జనగణన లెక్కలు ఖచ్చితంగా జరిగితే ఈ వివాదం బయటపడొచ్చు. దళిత క్రైస్తవులకు, దళిత ముస్లిములకు రిజర్వేషన్లు ఇవ్వాలనే వాదనొకటి ఉంది, గమనించే ఉంటారు. ఈ మధ్య అదేదో కమిషనొకటి వేసి దాని చేతా వీళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పించారు. మతమార్పిడికి అనుకూలంగా క్రైస్తవ ప్రచారకులు చెప్పే ప్రధానమైన వాదనేంటంటే.., క్రైస్తవంలో కులాల్లేవు, కులవివక్ష లేదు, అణచివేత లేదు అని. మతమార్పిడి సమర్ధకుల వాదనల్లో కూడా ఇదొకటి. అలా అయితే రిజర్వేషన్లు కావాలని ఎందుకడుగుతున్నారు? హైందవాన్ని దెబ్బతీసే క్రమంలో క్రైస్తవ మిషనరీలు చేస్తున్న దీర్ఘకాలిక కుట్రలో ఇదీ ఒక భాగమే.

మతం పుచ్చుకున్నవారు హాయిగా జీవిస్తూ జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారనేది పూర్తిగా అవాస్తవమేమీ కాదు.. కొందరు హాయిగానే ఉన్నారు. గుర్రం జాషువా లాగా వెతలనుభవించినవారూ ఉన్నారు. క్రైస్తవంలోని ఆంక్షలకు, వివక్షకు జాషువా ఒక నిదర్శనం. కంధమాల్లో కూడా రోజుకో గుప్పెడు ధాన్యాన్ని ప్రతి ఒక్కరు చర్చికి సమర్పించాలంట. తమ దొడ్లో పుట్టిన ఆవుదూడగానీ, బర్రెదూడగానీ మొదటిదాన్ని చర్చికి సమర్పించాలంట. వివక్ష పేరుచెప్పి మతాలు మార్చి, క్రైస్తవులు చేసేది ఇది.

మతమార్పిడి, మత ప్రచారమూ లేకపోతే కంధమాల్ జరిగేది కాదు అని స్పష్టం. అంచేత ఈ మతమార్పిడులను ప్రచారాలను నిషేధించాల్సిన అవసరం ఉంది.