Archive

Archive for the ‘శబ్దం’ Category

కంప్యూటరు ఈ యుగపు ఋక్కు

September 12, 2009 11 comments

సమకాలీన తెలుగు కవుల్లో గరికపాటి నరసింహారావు ప్రసిద్ధులు. దేశవిదేశాల్లో దాదాపు 250 అవధానాలు చేసిన పండితుడాయన. టీవీల్లో కావ్యపఠనం చేస్తూ పండిత పామరులను అలరిస్తూ ఉంటారు. ఛందోబద్ధ పద్యాలను వినసొంపుగా పాడి పండిత పామరులను అలరిస్తూ ఉంటారు.

సాగర ఘోష ఆయన రాసిన పద్యకావ్యం. ప్రాచీన కాలం నుండి ప్రస్తుతం వరకు మానవాభ్యుదయం గురించి 1100 పద్యాల్లో రాసిన కావ్యమది. మానవ చరిత ప్రస్థానంలో చోటుచేసుకున్న యుద్ధాలు, సాంకేతిక ఆవిష్కరణలవంటి అనేక ముఖ్యఘట్టాలను, అనేకమంది ప్రముఖ వ్యక్తులను స్పృశిస్తూ సాగుతుంది ఈ కావ్యం. కంప్యూటరు ఆవిష్కరణ గురించి కూడా రాసారు. ఊరికినే రాయడం కాదు, కంప్యూటరుకు ఎంతో ప్రాముఖ్యతనిస్తూ ఏకంగా ఒక పెద్ద దండకమే రాసారు. కావ్యం రాసేసి చదూకోండి ఫోండ నలేదాయన, చక్కగా గానం చేసి, మనకు వినిపించారు. ఈ కంప్యూటరు దండకాన్ని ఇక్కడ వినిపిస్తున్నాను.

http://static.odeo.com/flash/player_audio_embed_v2.swfముందు, కంప్యూటరు గురించి ఆయన రాసిన ఒక చక్కటి పద్యం.. లయబద్ధంగా అశ్వగతిలో సాగుతుంది, ఈ లయగ్రాహి పద్యం. (రాకేశ్వరుని లయగ్రాహి వివరణ గురించి చూసారా?) ఇదిగో ఈ పద్యం చదువుతూ, వినండి. వింటూ చదవండి.

లెక్కలను చెప్పగను చిక్కుముడి విప్పగను పెక్కుపను లొక్కపరి చక్కగను జేయన్
క్కరము లంపగను మక్కువలు నింపగను దిక్కులను చల్లగను చుక్కలను బంపన్
చుక్కలను సూక్ష్మమును ముక్కలును మూలమును ఒక్కటె సమస్తమను అక్కజము చూపన్
దిక్కెవరు ఈ యుగపు ఋక్కెవరు యంత్రముల దిక్కరివి నీవెగద మ్రొక్కులను గొమ్మా!

ఈ పద్యం తరవాత మొదలౌతుంది లయబద్ధంగా సాగే దండకం. కవికి, కంప్యూటరు విఘ్నేశ్వరుని తలపిస్తుందట -విఘ్నేశ్వరీదేవి యట! 🙂
http://static.odeo.com/flash/player_audio_embed_v2.swfమాహాశాస్త్రవేద్యా మహాతంత్ర విద్యా
మహాబుద్ధిసాధ్యా అసాధ్యా అభేద్యా

భవత్సృష్టి ఈ సృష్టి రూపంబు మార్చెన్, స్వరూపమ్ము దీర్చెన్
భవద్రూపమున్ జూడ నాకేలనో ఆదిదైవంబు విఘ్నేశ భావంబు దోచున్ మనంబందు

ఎన్నడైనేన ఒక్కింత పాడైన చో నాడు మామోము మేమైన చూడంగ కీడౌనుగా ‘ అని అంటున్నాడు కవి.

వాన వెలిసినట్టుంది గదా! 🙂 ఇంకా చూడండి..
http://static.odeo.com/flash/player_audio_embed_v2.swfకంప్యూటరు దేవీ! నీకెన్ని భాషలు తెలుసునో గదా! వేవేల భాషలు, లిపిలేని భాషలు, విశేషాల భాషలు, వినూత్నమైన భాషలు.. ఎన్ని తెలుసమ్మా నీకు!! పాస్కల్లు, లోటస్సు, డీబేసు, బేసిక్కు, కోబాల్, ఒరాకిల్లు, సీప్లస్సు, ప్లస్‌ప్లస్సు,..

http://static.odeo.com/flash/player_audio_embed_v2.swfనీ వ్యాప్తిని ఊహింపశక్యమే నాకు! పెళ్ళిళ్ళలో నీవె, పేరంటములలో నీవె, కాలేజిలన్నీవె, కాటేజిలన్నీవె, పెద్ద హోటళ్ళలో పూటకూటిళ్ళలో, అణ్వాయుధమ్మందు ఆఫీసు ఫైళ్ళందు, రోదశీ యాత్రలో ద్వాదశీ పూజలో.. పెద్దదో చిన్నదో నీ రూపమే కనిపించు గదా!

http://static.odeo.com/flash/player_audio_embed_v2.swfనీవు లేక మేము ఉండటమన్న ఆలోచనే పరిహాసముగా తోచుచున్నది. Y2K గండాన్ని గట్టెక్కి, ప్రపంచాన్ని గట్టెక్కించావు.

http://static.odeo.com/flash/player_audio_embed_v2.swfనీ దివ్యగాథలను చెప్పుకోడానికి శతాబ్దులు సహస్రాబ్దులూ సరిపోవు తల్లీ! ఆరోవేదానివి, ఏడోశాస్త్రానివి కంప్యూటరు తల్లీ!!

సాగరఘోష మొత్తం కావ్యాన్ని గరికపాటి నరసింహారావు గొంతులో ప్రవచనం.కామ్ లో వినండి.

సడిసేయకో గాలి సడిసేయబోకే..

December 5, 2006 6 comments

జోల పాటలు, లాలి పాటలు, మేలుకొలుపు పాటలూ ఉన్నాయి. ఇది జోలకూ మేలుకొలుపుకూ మధ్య లోని పాట.. మెలకువ రాకుండా పాడే పాట!

సడి సేయకో గాలి.. సడి సేయబోకే
బడలి, ఒడిలో రాజు పవ్వళించేనే! సడిసేయకే..

రత్నపీఠికలేని రారాజు నా స్వామి
మణి కిరీటము లేని మహరాజు గాకేమి
చిలిపి పరుగుల మాని కొలిచి పోరాదే.. సడిసేయకే!

ఏటి గలగలలకే ఎగసి లేచేనే
ఆకు కదలికలకే అదరి చూసేనే
నిదుర చెదరిందంటే నేనూరుకోనే.. సడిసేయకే

పండు వెన్నెల నడిగి పాన్పు తేరాదే
పీడ మబ్బుల దాగొ నిదుర తేరాదే
విరుల వీవన పూని విసిరిపోరాదే

సడి సేయకో గాలి సడి సేయబోకే
బడలి, ఒడిలో రాజు పవ్వళించేనే! సడిసేయకే..

నాకెంతో ఇష్టమైన పాటల్లో ఇది ఒకటి; రాజమకుటం సినిమాలోది. అలికిడైతే తన స్వామికి మెలకువ వచ్చేస్తుందేమోనని గాలిని కదలొద్దని అదిలిస్తోందీవిడ! నిదుర చెదరిందంటే నేనూరుకోనే అంటూ హెచ్చరిస్తోంది! “మణి కిరీటము లేని మహరాజు గాకేమి” తరువాత, “పీడ మబ్బుల దాగొ నిదుర తేరాదే” తరువాతా వచ్చే సన్నాయి వాదన.. పాటకెంత సొగసునద్దిందో! మంచి పాట!!

http://odeo.com/flash/audio_player_gray.swf
powered by ODEO

వినుడు వినుడు వీనుల విందుగా..

November 26, 2006 11 comments

ఇక నా బ్లాగును చదవడమే కాదు, విననూ వచ్చు. దీని గురించి తెలియజెప్పి నేర్పించిన శోధన సుధాకర్, అమెరికా నుండి.. వైజాసత్య కు కృతజ్ఞతలతో.. వాళ్ళ లింకుల్లో ఈ ఆడియో బ్లాగు ఎలా పెట్టాలో చాలా వివరంగా ఉంది. అవి చదువుకుని ఎవర్నీ అడక్కుండా మనమే మోత మోగించవచ్చు.

ఇదిగో నా మొదటి పాట. మరిన్ని పాటలు త్వరలో.. (మీరు వినాలే గానీ ప్రస్తుతం రాసేదంతా మాట్లాడి, ఆడియో బ్లాగుగా పెట్టేయనూ!?)
http://odeo.com/flash/audio_player_gray.swf
powered by ODEO

మీరూ మోగించండి, మరి!

Categories: శబ్దం