Archive

Archive for the ‘సమాజం’ Category

మందు x మందులు

రాష్ట్రంలో మందు దుకాణాల పాటలు కోట్లలో పాడారు. ప్రభుత్వం వేలకోట్ల రూపాయలు పోగేసుకుంది. పాటలు పాడినవాళ్ళలో ఎక్కువమంది రాజకీయులే. ఏదో ఒక కొట్టులో వాటాలేని ఎమ్మెల్యే ఎవరైనా ఉంటే అతగాడు పాపం మరీ అమాయకుడైనా అయ్యుండాలి, లేదా మరింకేదైనా డబ్బులొచ్చే యవ్వారంలో తలమునకలుగా ఉండి ఉండాలి, లేదా జయప్రకాశ్ నారాయణైనా అయ్యుండాలి!

డబ్బులకోసం జనాల జేబులను కొల్లగొడుతోంది ప్రభుత్వమంటూ ఈ వేలంపాటలమీద విమర్శలొచ్చాయి. ఇదేంటయా, మరీ ఇంతలా బరితెగించారేంటి అని అడిగితే, అధికారపార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులూ ఏమంటున్నారూ.. ’ప్రజల చేతుల్లో బాగా డబ్బులాడుతున్నాయి, వాళ్ళు కూడా ఎంజాయి చేద్దామని ఆలోచిస్తున్నారు అంచేతే తాగుతున్నారు’ అని మన చెవుల్లో పూలు పెడుతున్నారు. ఎంత లెక్కలేనితనమో, ఎంత ఎటకారమో చూడండి.

గవర్నరు గారిక్కూడా ఈ పూల పంపకాలు, ఎటకారాలూ నచ్చినట్టులేదు. ఈ సన్నాసి రాజకీయులను తిట్టేందుకు మంచి సమయాన్ని, సందర్భాన్నీ ఎంచుకున్నాడు. ఆరోగ్యశ్రీ పథక పరిశీలనను ఆయుధంగా వాడుకున్నాడు.

 • రాష్ట్రంలో పేదరికం ఈ స్థాయిలో ఉందా? ,
 • ఆర్థికాభివృద్ధిలో దేశంలోనే మూడో స్థానంలో ఉన్నట్లు చెప్పుకుంటున్నాం… ఇక్కడ ఇంత పేదరికం ఎలా ఉంది? అసలు అభివృద్ధి చెందుతున్న వారెవరు?

అంటూ ప్రశ్నలడిగాడు. ఈ ప్రశ్నల ద్వారా అన్యాపదేశంగా రెండు వ్యాఖ్యలు వదిలాడాయన:

 1. తాగుడు దగ్గరకొచ్చేసరికి ప్రజల దగ్గర డబ్బులున్నాయంటున్నారు, ఆరోగ్యశ్రీ మాత్రం 82% పేదరికం ఉందని చెబుతోంది.
 2. ఓ పక్క తాగుడును విచ్చలవిడిగా ప్రోత్సహిస్తూ, మరో పక్క ఆరోగ్యశ్రీ మీద తెగ ఖర్చు చేసేస్తున్నారు

అసలు గవర్నరు టైమింగు చూడండి! ప్రజల దగ్గర డబ్బులున్నాయని వాళ్ళు ఓ పక్క చెబుతూండగానే, ఈయన పేదరికమ్మీద, ఆరోగ్యశ్రీ మీదా వ్యాఖ్యలు చేసాడు. కావాలని అన్నాడో అనుకోకుండా అన్నాడో గానీ, ఈ వ్యాఖ్యలు మాత్రం ప్రభుత్వానికి చురకల్లాంటివే! అయితే ఈ చురకలూ వాతలకు రాజకీయ బ్రహ్మరాక్షసులు అదిరేనా బెదిరేనా? సీయేజీ యే సూటిగా తిట్టిపోసినా కూడా చలించని జాతి వీళ్లది (గతంలో నేను రాసిన టపా ఒకటి చూడండి), ఇలా అన్యాపదేశంగా తిడితే దడుస్తారా? రాజకీయుల మీద విమర్శలు, దున్నపోతు మీద వానా, ఒకటే కాదూ!?

గవర్నరు ఇంకో ప్రశ్న కూడా అడిగాడు: “ముదిరిన జబ్బులకు చికిత్స చేయిస్తున్నారు సరే… మరి ఎక్కువ మంది ప్రజలకు వస్తున్న సాధారణ వ్యాధుల పరిస్థితేమిటి? అని. ఆరోగ్యశ్రీ పెట్టినప్పటి నుంచీ లోక్‍సత్తా అడుగుతున్నది ఇదే! ’ఈ పథకం పేరున కార్పొరేటు ఆసుపత్రుల్ని మేపుతున్నారు, ప్రజలకు ఇంతకంటే ఎంతో అవసరమైన ప్రాథమిక ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టండి’ అంటూ మొత్తుకున్నారు. అయినా అప్పటి ముఖ్యమంత్రి వినిపించుకోలేదు. స్వప్రయోజనాలు, స్వజనులప్రయోజనాలే ముఖ్యమైన మంత్రులు ఇవన్నీ పట్టించుకుంటారా? పట్టించుకున్నారా?

Advertisements

ఐఐఐయో.. ఐఐఐటీ!

రాష్ట్ర ఐఐఐటీల్లో ప్రభుత్వం సీట్లను తగ్గించేసింది. రెండేళ్ళ కిందట మొదలుపెట్టిన ఈ ఐఐఐటి వ్యవస్థను మొక్కగా ఉండగానే కత్తిరించడం మొదలుపెట్టింది. ఈ కత్తిరింపు, మొక్క ఏపుగా ఎదగడానికని ప్రభుత్వం చెబుతోంది.

పదోతరగతి చదివిన పిల్లలను (ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో) ఐఐఐటి కోర్సులో చేర్చుకుని, ఆరేళ్ళ తరవాత ఏకంగా రెండు డిగ్రీలతో బయటికి పంపించడమనేది ఈ సంస్థల ఆశయం. మొత్తం మూడు చోట్ల పెట్టారు – బాసర, నూజివీడు, ఇడుపులపాయ. ఒక్కోదానిలో సంవత్సరానికి 2,000 మందిని చేర్చుకునే ఆలోచనతో మొదలుపెట్టారు. మొదటి రెండేళ్ళూ బాగానే తీసుకున్నారు. ఈ యేడు మాత్రం, అంతమందిని తీసుకోలేమని చెబుతూ దాన్ని వెయ్యికి కుదించారు.


ఐఐఐటీలను పెద్ద యెత్తున ఆర్భాటంగా మొదలుపెట్టారు. చిన్న స్థాయిలో మొదలుపెట్టి, వ్యవస్థ సరిగ్గా ఏర్పడేలా జాగర్తపడుతూ, నిదానంగా విస్తరించుకుంటూ పోతే బాగుండేది. ఏడాదికి 2000 మంది చొప్పున ఆరేళ్ళ కోర్సుకుగాను మొత్తం 12,000 మంది ఒక్కోచోట చదువుకునే సామర్థ్యం కలిగిన సంస్థలివి. మొదటి రెండేళ్ళు ఇంటరు చదువుతారు. తరువాతి నాలుగేళ్ళలో రెండు ఇంజనీరింగు డిగ్రీలు వస్తాయి. ఈ మూడు ఐఐఐటీలు కొత్తగా ఏర్పరచిన ఒక యూనివర్సిటీకి అనుబంధంగా ఉంటాయి. ఆ యూనివర్సిటీ పేరు -మామూలే- రాజీవ్ గాంధీ…గట్రా గట్రా! ఈ యూనివర్సిటీకి చాన్సెలర్ గవర్నరు కాదు, డా. రాజ్ రెడ్డి. డా. రాజ్ రెడ్డి అంటే.. ఫ్రెంచి లీజియన్ ఆఫ్ ఆనర్, ఓయెమ్సీ కంప్యూటర్స్ (ఇప్పుడీ కంపెనీ లేదు), మిలియన్ బుక్స్ కార్యక్రమంలో భారతీయ భాషాపుస్తకాల సాంఖ్యీకరణం (డిజిటైజేషన్) మొదలైనవాటితో ముడిపడ్డ ప్రసిద్ధ వ్యక్తి. వైస్ చాన్సెలరు ఐఐటీ నుంచి వచ్చారు. ప్రో చాన్సెలరని ఇంకో హోదా ఉంది. మొన్నటిదాకా వైసు గా ఉన్నాయన్ను నైసుగా ఇప్పుడు ఈ పదవిలో పెట్టారు. నిరూపణ కాని ఆరోపణలు ఈయన మీద చాలానే ఉన్నాయి.

ఈ ఐఐఐటీల పనిలో కొన్ని లోపాలున్నాయి. ప్రవేశాలను వ్యవస్థీకరించకపోవడం, దానిలో తప్పులు జరగడం ఈ వీటిలో ఒక పెద్ద లోపం. లోపాలు జరిగాయని ఆరోపణలు, ప్రవేశాల రద్దు, తిరిగి జరపడం,.. ఇవన్నీ కలిసి నిరుడు పాఠాలు చెప్పడం మొదలయ్యే సరికి సెప్టెంబరు గడిచిపోయింది (ఇంటర్మీడియెటు కాలేజీలు మాత్రం జూన్ లోనే మొదలౌతాయి). సహజంగానే పదో తరగతిలో మెరుగ్గా ఉన్న కుర్రాళ్ళకే ఐఐఐటీల్లో అవకాశాలొస్తాయి. ఇలాంటి పిల్లలకు ఇంటర్లో చేరేందుకు వలవేసే కార్పొరేటు కాలేజీలవాళ్ళుంటారు. వాళ్ళు, “మీ కుర్రాడికి, అమ్మాయికి ఊరికినే సీటిస్తాం మాదగ్గర చేర్చండి, ఆలస్యమైతే సీట్లయిపోతాయి” అంటూ వెంటపడతారు. ఇటు, ఈ ఐఐఐటీ సీటు సంగతేదో తేలితే వేరేదారి చూసుకోవచ్చుగదా అని అనుకునే పిల్లలకు ఐఐఐటిలు చేసే ఆలస్యం చాలా ఇబ్బంది కలిగిస్తుంది. దానికితోడు, ఈ యేడు చూస్తే ఇదిగో ఈ సీట్ల కోత!


డబ్బుల్లేవని ప్రభుత్వం సీట్ల సంఖ్యలో కోత పెట్టింది. ఇలాంటి చర్యలు తీసుకుంటూంటే వాటిలో చేరాలంటే విద్యార్థులకు ఆందోళనగా ఉండదా? పైగా వాటిలో చేరితే ఆరేళ్ళు కట్టుబడి ఉండాలి. ప్రభుత్వం మధ్యలో చేతులెత్తేస్తే? ప్రభుత్వం కాబట్టి చేతులెత్తెయ్యదులెమ్మనుకున్నా.., సరిగ్గా పట్టించుకోకపోతే? పైగా ఈ పిల్లలేమీ అల్లాటప్పా సరుకు కాదు, ఎక్కడ చదివినా మంచి స్థాయికి పోగలవాళ్ళు. చాకుల్లాంటివాళ్ళు. ఎన్నో ప్రతికూల పరిస్థితుల నెదుర్కొంటూ కూడా చదూకుంటున్నవాళ్ళు. ప్రతిభావంతులైన ఈ పిల్లలు సెప్టెంబరు దాకా వీటి కోసం ఆగటమా లేక, ఏదో ఒక మంచి కాలేజీలో ఇంటరులో చేరటమా అనేది నిశ్చయించుకోవాల్సిన తరుణమిది.

పైగా ఈ యేడు చూడండి.. ప్రవేశార్హతను నిర్ణయించడంలో జాప్యం జరిగింది. గతంలో ఉన్న నిబంధనను మార్చి , ఒక్క పదో తరగతి మాత్రం గ్రామీణ పాఠశాలలో చదివితే చాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం మొన్నమొన్నే జరిగింది. అర్హతలను మార్చాలనుకున్నపుడు ముందే సదరు ఏర్పాట్లు చేసి పెట్టుకోవాలి. తీరా చివరి నిముషంలో ఇప్పుడు మారిస్తే తగువిధంగా దరఖాస్తులనూ మార్చాలి. ఇదీ, సీట్ల కోత నిర్ణయమూ – ఈ రెండూ కలిసి, ఇదిగో ఇంతవరకూ ప్రవేశానికి సంబంధించిన ప్రకటనే రాలేదు. ఈ వ్యవహారాలన్నీ చూసాక, ఐఐఐటిల మీద మనకు నమ్మకం సడలటం సహజం. పూర్తిగా ఆరేళ్ళూ సరిగ్గా చదువు చెబుతారా అనే సందేహం తలెత్తే అవకాశం లేకపోలేదు. ఈ యేడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బట్టి చూస్తే ఐఐఐటీల్లో చేరాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన అవసరం ఏర్పడేట్టుంది.

ఐతే ఐఐఐటీలను మరీ తోసిపుచ్చనక్కర్లేదేమో! వాటి భవిష్యత్తు ఆందోళనకరంగా ఉందన్నమాట నిజమే అయినప్పటికీ, ఇప్పటికిప్పుడు ఐఐఐటీలకొచ్చిన ముప్పు ఏమీ లేదని నా ఉద్దేశం. ఇవ్వాళ ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే, ఐఐఐటీల్లో చేరేందుకు ప్రతికూలతల కంటే అనుకూలతలే కొద్దిగా ఎక్కువ ఉన్నాయనిపిస్తోంది. ఈ అనుకూల ప్రతికూలతలేంటో చూద్దాం..

 1. డా. రాజ్ రెడ్డి ఇంకా తప్పుకోలేదు .అంటే -ఆయన ఇంకా వాటిమీద ఆశ కోల్పోలేదన్నమాట. (తప్పుకుంటారన్న వార్తలు మాత్రం వచ్చాయి) . ఆయన వంటి వారి వలన , పరిశ్రమతో సంబంధాలు పెట్టుకుని, పిల్లలకు ఉద్యోగావకాశాలు ఏర్పరచే నేర్పు కూడా ఐఐఐటీలకు ఏర్పడుతుంది. ఆయన తప్పుకుంటే అది పెద్ద దెబ్బే!
 2. ఇప్పుడు సీట్లు తగ్గించారు కదా, అంటే తిరోగమనం మొదలైనట్లేనేమో.. నిజమే. సీట్లు తగ్గించారు. మిగిలిన ఈ సీట్లనైనా చక్కగా పద్ధతి ప్రకారం నింపి, పిల్లలకు చక్కటి చదువు చెబుతారని కోరుకుందాం. పైగా ఈ కోత వల్ల చేరే పిల్లలకు నష్టమేమీ లేదు, ఎంతో కొంత ఉపయోగమే.
 3. ముందుముందు ఎలా ఉండబోతోందో, ప్రభుత్వం ఇంకా ఏయే నిర్వాకాలు చేస్తుందో .. ఇప్పుడు ఈ చర్యలు తీసుకున్న ప్రభుత్వం, ముందుముందు అసలే మూసేసే ఆలోచనలు చెయ్యదని ఎలా చెప్పగలం.? ఈ సంస్థలపై ప్రజలు పెంచుకున్న ఆశలను బట్టి చూసినా, ప్రస్తుత రాజకీయ వాతావరణాన్ని బట్టి చూసినా, ప్రభుత్వం వాటిని మూసెయ్యకపోవచ్చు. పైగా, కోర్సు ఆరేళ్ళది అయినప్పటికీ, రెండేళ్ళ తరవాత బయటికి వచ్చే సౌకర్యం ఉంది. బైటికొచ్చి, ఎమ్సెట్ రాసుకుని ఏదైనా ఇంజనీరింగు కోర్సులో చేరే అవకాశం ఉంది.
 4. మరి సెప్టెంబరు దాకా ఆగేదెలా? అప్పుడు సీటు రాకపోతే రెంటికి చెడ్డ రేవడ కాదూ? నిజమే, అందుగ్గాను, ఐఐఐటీ సీటు కోసం ఎదురు చూడకుండా, ఏదో ఒక కాలేజీలో ఇంటరులో చేరి చదువుకోవాలి. ఆనక ఐఐఐటీలో సీటొస్తే ఇక్కడ మానేసి, వెళ్ళటమే. కాకపోతే ఈ కాలేజీవాళ్ళకు ముందుగానే ఆ సంగతి చెప్పి, ఫీజు కట్టడం వాయిదా వేసుకోవాలి.

ఐఐఐటీల పట్ల ప్రభుత్వం మరింత బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది. వాటిపట్ల తమ నిబద్ధతను చూపిస్తూ, ప్రజలకు భరోసా ఇస్తే ఇప్పుడు చేరదలచిన పిల్లలకు ధైర్యంగా ఉంటుంది.

  Categories: సమాజం

  శాస్త్రీయ పుకారు

  January 23, 2010 8 comments

  నేను మొదటి ఉద్యోగంలో చేరినపుడు ఇండక్షన్ కార్యక్రమం ఒకటి వారంపాటు జరిగింది. మొత్తం ఒక యాభై మందిమి. ఓరోజున ఓ గదిలో కూలేసి కమ్యూనికేషన్స్ నిపుణుడొకాయన క్లాసు పీకుతున్నాడు. కాసేపయ్యాక, ఒక సరదా ఆట ఆడదామని చెప్పాడు. మొదటి వరసలో కూచ్చున్న మొదటి వాడి దగ్గరికెళ్ళి, ‘ఇదుగో ఇతని చెవిలో రహస్యంగా ఒక కబురు చెబుతాను. అతడు తన పక్కవాడి చెవిలో ఆ సంగతిని ఊదుతాడు. ఆతడు తన పక్కవాడి చెవిలో చెబుతాడు. అలా చెప్పుకుంటూ వెళ్ళగా, చిట్టచివరి వాడు తనకు చేరిన సమాచారమేంటో బోర్డు మిద రాస్తాడు.’ అని చెప్పి, మొదటివాడి చెవిలో ఏదో కబురు చెప్పాడు. దాన్నీ, చిట్టచివరివాడు బోర్డు మీద రాసేదాన్నీ పోల్చి చూస్తాడన్నమాట, ఇదీ ఆట!

  వాడు పక్కనవాడికి, వాడు తన పక్కనవాడికీ,.. అలా చెప్పుకుంటూ పోయాం. చివరివాడు తనకు చేరిన సంగతిని బోర్డు మీద రాసాడు. పంతులు గారు మొదటివాడికి చెవిలో చెప్పిన సంగతికీ, బోర్డుమీద రాసిన దానికీ అసలు సంబంధమే లేదు; ఎంత ‘అ’సంబంధంగా, ఎంత అసంబద్ధంగా ఉన్నాయంటే.. ‘తెలుగు సినిమాల్లో విలనుకు, ఆసిగాళ్ళకూ తెలంగాణ యాస వాడతారు ‘ అనేది మొదటివాడికి చెవిలో చెప్పిన సంగతైతే, చివరివాడికి చేరింది మాత్రం ‘తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చెయ్యాల్సిందే ‘ అన్నట్టుగా నన్నమాట! మరీ ఇంత అసంబద్ధంగా లేకపోయినా, సుమారుగా ఇంత అసంబద్ధంగానే ఉన్నట్టు గుర్తు.

  దీన్నిక్కడ వదిలేసి, ఈ టపాలోని రెండో భాగానికి పోతే..

  ———————-

  ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్ (ఐపీసీసీ) అనే ఐక్యరాజ్యసమితి వారి సంస్థ ఒకటుంది. గ్లోబల్ వార్మింగుపై నివేదికలు తయారుచేస్తూ ఉంటుంది. ఆర్కే పచౌరీ అనే భారతీయుడు దీనికి అధ్యక్షుడు. ఐపీసీసీ 2007 లో ఒక నివేదిక ఇచ్చింది. 2035 కల్లా హిమాలయాల్లోని హిమానీ నదాలు కనుమరుగౌతాయనేది ఈ పెద్ద నివేదికలోని ఒక చిన్న భాగం. అయితే, ఆ నివేదికలో హిమానీనదాల గురించి తాము చెప్పినది తప్పని 2010 జనవరి 20న ఆర్కే పచౌరీ చెప్పాడు.  

  ఈ తప్పు వెనక కథాకమామీషు ఇది:

  అప్పుడెప్పుడో పదేళ్ళ కిందట సయ్యద్ హస్నైన్ అనే సైంటిస్టొకాయన గ్లోబలు వార్మింగు గురించి మాట్టాడుతూ, హిమాలయాల్లోని హిమానీ నదాలు వేగంగా తరిగిపోతున్నాయనీ, ఈ లెక్కన ఇంకో 40 యేళ్ళలో మధ్య, తూర్పు హిమాలయాల్లోని హిమానీ నదాలు అన్నీ కరిగి, కనుమరుగైపోతాయని చెప్పాడు. ఎవరితో..? న్యూ సైంటిస్ట్ అనే పత్రికతో.

  ఆ ఇంటర్వ్యూను చదివిన వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్ అనే సంస్థ 2005 లో హిమాలయాల్లో హిమానీనదాలపై ఒక రిపోర్టు తయారు చేసి, ఈ న్యూ సైంటిస్టు పత్రికలో వచ్చిన ఇంటర్వ్యూను ఉటంకిస్తూ 2035 కల్లా హిమాలయాల్లో హిమానీ నదాలు కనుమరుగౌతాయని రాసింది. దానికి తోడు, హస్నైన్ చెప్పినది మధ్య, తూర్పు హిమాలయాల గురించైతే, వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్ మొత్తం హిమాలయాలన్నిటికీ వర్తించేలా రాసింది.

  దీన్ని చదివేసిన ఐపీసీసీ, గ్లోబల్ వార్మింగుపై తాను ఇచ్చిన ఒక నివేదికలో ఈ సంగతిని చేర్చింది. 2035 కల్లా హిమానీ నదాలు అంతరించిపోతాయని జోస్యం చెప్పింది. దానికి మూలంగా వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్ ఇచ్చిన నివేదికను చూపెట్టింది. చివరికది తప్పని తేలింది. హిమానీనదాలు పూర్తిగా కనుమరుగవ్వాలంటే వీళ్ళు చెప్పే వ్యవధికి పదిరెట్లు సమయం పడుతుందని ఒక అంచనా!

  ఐపీసీసీ నివేదికలోని హిమానీనదాల విభాగాన్ని తయారు చేసిన మురారీ లాల్ అనే గ్లేసియాలజిస్టు, ‘మేం రాయడంలో తప్పేం లేదు. తప్పేదన్నా ఉంటే ఆ ముక్క చెప్పిన హస్నైన్‌దే‘ అని తేల్చేసాడు. ఇక ఆ హస్నైన్ ఏమంటాడంటే ‘నేనేదో నోటిమాటగా ఓ పాత్రికేయుడితో అన్నమాటను పట్టుకుని రిపోర్టులో రాసెయ్యడమేంటి? నేను రాసిన ఏ పరిశోధనా వ్యాసాల్లో కూడా ఈ 2035 అనే సంవత్సరాన్ని ప్రస్తావించలేదు. ఇలాంటి స్పెక్యులేషన్ కబుర్లు రాసేటప్పుడు నిజానిజాలు సరిచూసుకోవాలి’ అని చెప్పాడు.

  ఇక్కడ ఇంకో పుకారుంది.. రష్యా సైంటిస్టొకాయన ఇదే విషయంపై ఇచ్చిన నివేదికలో ‘2350 కల్లా హిమాలయాల్లోని హిమానీ నదాలు అంతరించి పోతాయ’ని చెప్పాడంట. అయితే, డబ్ల్యూ డబ్ల్యూఎఫ్, ఐపీసీసీలు దాన్ని 2035 గా రాసాయంట.

  ఈ మొత్తం ప్రహసనంలో హైలైటేంటంటే.. ఐపీసీసీ ఈ నివేదికను 2007లోఇచ్చాక, 2009 నవంబరులో భారతప్రభుత్వం పనుపున ఒక గ్లేసియాలజిస్టు తయారుచేసిన నివేదికలో ఈ 2035 జ్యోతిష్యాన్ని కొట్టిపారేసాడు. ఐపీసీసీ నివేదికను అనవసర భయాలను కలిగించేదిగా ఉందని మన పర్యావరణమంత్రి జైరామ్ రమేష్ చెప్పాడు. దానికి జవాబు చెబుతూ ఆర్కే పచౌరీ భారత ప్రభుత్వ నివేదికను ‘వూడూ సైన్సు‘ అని అన్నాడంట. అంటే చేతబడి అని అనుకోవచ్చు. ఈ లెక్కన ఐపీసీసీ చెప్పినదాన్ని బాణామతి అని అనుకోవాలి మనం!

  ఇంతకీ ఐపీసీసీకి నోబెల్ పురస్కారం వచ్చింది. “మనిషి చేతల కారణంగా వాతావరణంలో ఏర్పడుతున్న మార్పుల గురించి ఉత్కృష్టమైన విజ్ఞానాన్ని పోగు చేసి, దాన్ని వ్యాపింపజేస్తున్నందుకుగాను, ఆ మార్పులను ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలకు పునాది వేస్తున్నందుకుగాను “, ఐపీసీసీకి అల్ గోర్‌కు కలిపి 2007లో నోబెల్ శాంతిబహుమతి వచ్చింది.

  అయితే ఒక మెచ్చుకోదగ్గ సంగతేంటంటే -న్యూ సైంటిస్టు వ్యాసంలోని అంశాల నిగ్గు తేల్చకుండా (పీర్ రివ్యూ – సాటివారి సమీక్ష) తమ నివేదికల్లో వాడుకున్నందుకుగాను విచారాన్ని ప్రకటిస్తూ డబ్ల్యూడబ్ల్యూఎఫ్, ఐపీసీసీ రెండు కూడా తమ నివేదికల్లో ఈ సంగతిని ప్రముఖంగా రాసాయి.

  Categories: సమాజం

  బాబ్రీకట్టడపు కూల్చివేత వార్షికోత్సవం

  December 7, 2009 33 comments

  పురుషోత్తముడి గుడిని కూల్చేసి మసీదునొకదాన్ని కట్టాడో దురాక్రమణదారు. తన జాతి వారసత్వంపై మక్కువ, గర్వమూ ఉన్న ఏ స్వతంత్ర ప్రభుత్వమైనా ఆ కట్టడాన్ని పడేసి మళ్ళీ గుడి కట్టుకుంటుంది. ఎందుకంటే అది జాతి గౌరవంతో ముడిపడి ఉన్నది కాబట్టి. ఎంచేతో మన ప్రభుత్వాలు ఆ పని చెయ్యట్లేదు. మరి ఇవి ప్రభుత్వాలు కావో, లేక వాటికి ఈ జాతి వారసత్వం పట్ల గౌరవం లేదో!! ప్రభుత్వాలు ఎలాగన్నా పోనీండి.., ఆ పనేదో తామే చేసుకోవాలనుకున్నారు, హిందువులు. ఆ పనిలో సగభాగం పూర్తై మరో ఏడాది గడిచిపోయింది. గుడి కట్టే కార్యక్రమం మాత్రం ఇంకా మొదలు కాలేదు.

  ఇన్నేళ్ళుగా ‘అక్కడ గుడిని కట్టలేదేఁ?’ అని హిందువులెవరూ అడగలేదు. కానీ మైనారిటీ నాయకులు, మైనారిటీవాదపు మహారాజ పోషకులు మాత్రం మసీదు కట్టలేదేంటని వాపోతున్నారు, కళ్ళనీళ్ళు పెట్టేసుకుంటున్నారు, కుళ్ళికుళ్ళి ఏడుస్తున్నారు. హిందూ మతస్తులకు వ్యతిరేకంగా ఐక్యవేదికనొకదాన్ని పెట్టేసుకున్న కొందరు (దానికి హిందూ మతోన్మాద వ్యతిరేక వేదిక అని పేరు పెట్టుకున్నారు) ఆ వేదిక మీద కూచుని హిందువులపై విషం గక్కారు. ఈనాడులో వచ్చిన ఆ వార్త చూడండి..

  బాబ్రీ మసీదును కూల్చిన చోటనే నిర్మించాలని విప్లవ రచయితల సంఘం (విరసం) రాష్ట్ర నాయకులు ——— డిమాండ్‌ చేశారు. రాష్ట్ర హిందూ మతోన్మాద వ్యతిరేక ఐక్య వేదిక ఆధ్వర్యంలో ‘డిసెంబర్‌ 6ను హిందూ మతోన్మాద వ్యతిరేక దినంగా పాటిద్దాం’ అని ధర్నా నిర్వహించారు. బాబ్రీ మసీదు కూల్చివేతపై నియమించిన లిబర్హన్‌ కమిషన్‌ నివేదికలో ఉన్న దోషులను ఇంతవరకూ శిక్షించలేదన్నారు. భాజపా నాయకులు మాజీ ప్రధాని వాజ్‌పేయి, అప్పటి ప్రధాని పి.వి.నరసింహరావు కూడ మసీదు కూల్చివేతకు సహకరించారని ఆరోపించారు. సామ్రాజ్యవాదులు, హిందూమతోన్మాద శక్తులు ముస్లింలపై దాడులు చేస్తున్నారని వివరించారు. అందులో భాగంగానే గతంలో నగరంలో జరిగిన మతకల్లోలాలు వారు సృషించినవేనని ఆయన ఆరోపించారు. …  

   ఈ వేదికనెక్కిన శ్రేష్ఠులందరూ కూడా కావాలనుకున్నప్పుడల్లా గుడ్డితనం, బెమ్మజెముడూ పొందగలిగే వరమొకదాన్ని కమ్యూనిజం/మార్క్సిజం/లెనినిజం/మావోయిజం/పోవోయిజం/రావోయిజం/లేవోయిజం/… వగైరాల నుండి సంపాయించారు. స్వచ్ఛంద మరణం లాగా స్వచ్ఛంద అంగవైకల్యమన్నమాట! వీళ్ళకున్న మానసిక వైకల్యాలకు ఈ శారీరిక వైకల్యాలు తోడై, వీళ్ళను హిందూమత వ్యతిరేక రాక్షసులుగా మార్చాయి. హిందూ వ్యతిరేక, మైనారిటీ పక్షపాత రజాకార్లు వాళ్ళు. పాపం అంచేతే, వీళ్ళకి..

  మక్కా మసీదులో, లుంబినీలో, గోకుల్ చాట్‌లో, దేశంలో ఇంకా అనేక చోట్ల బాంబులు పేలిన ఘటనలు  కనబడవు, ఆ మోతలు వినబడవు. ఒకవేళ వినబడ్డా.. “ఈ పేలుళ్ళకు ముస్లిములను కారకులని అనుమానించడం తగదు.” అంటూ కారుకూతలు కూస్తారు. చివరాకరికి ఆ బాంబులేసినది ఇస్లామిక ఉగ్రవాదులే అని తేలిన తరవాత, ఒక్కడు కనబడ్డు, ఒక్ఖడు ఇనబడ్డు. తమతమ మురికి కూపాల్లోకి, తమ తిమిరలోకాల్లోకి జారిపోతాయి ఈ కప్పలు. శవాగారాల్లాంటి తమతమ కలుగుల్లో నక్కుతాయి, జవసత్వాలను కొరికేసి, జాతిని నిర్వీర్యపరచే ఈ ఎలుకలు, పందికొక్కులు! ప్రతీ డిసెంబరు 6 న మాత్రం బెకబెకమంటూ, కిచకిచమంటూ బయటికొస్తాయి.

  వేదికనెక్కి కారుబెకబెకలు, కారుకిచకిచలూ కూసే ఈ కప్పలూ, నికృష్టపు టెలుకలూ, పందికొక్కులూ.., బాంబుపేలుళ్ళకు బాధ్యులుగా ముస్లిములను అనుమానించరాదంటూ మైకులెట్టుకు మోగిమోగీ ఊగిపోయాయి. ఆ పేలుళ్ళు ఇస్లామిక ఉగ్రవాదుల పనేనని తేలాక, ఇవి వీటి కూపాల్లోంచి, కలుగుల్లోంచి బైటకే రాలేదు. ఇప్పుడు మాత్రం ‘హిందూ మతోన్మాద వ్యతిరేకత’ను వినిపించేందుకు కాళ్ళగ్గజ్జెలు కట్టుకోని, చేతుల్లో చిడతలతో వేదికలెక్కి తైతక్కలాడతన్నై. (నాస్తికులమని చెప్పుకునే ఈ జనం.. మసీదు కట్టాల్సిందేనని  చిందులెయ్యడం చూస్తే వీళ్ళమీద వెగటు కలుగుతోంది!) సమాజాన్ని హిందూ వ్యతిరేకతతో విషపూరితం చెయ్యబూనిన భ్రష్టులారా..! అప్పుడేమైందోయ్, మీ మార్క్సిజమ్ము? ఎక్కడ నక్కాయోయ్, మీపౌరహక్కుల నిఘా సంఘాలూ? ఆనాడెక్కడ దాక్కున్నారోయ్, నేడు మీతో గొంతు కలిపిన ఈ హిందూ వ్యతిరేక మదోన్మత్త చిత్తులు, మీ మిత్రులు? ఈ గాంధారీ పుత్రులు?

  Categories: మతం, సమాజం

  మన హితము గోరి పెద్దలిందరు పలుకుచుండగా..

  November 5, 2009 27 comments

  అసలూ.. తెలుగులో మాట్లాడొద్దని చెప్పినా ఆ పిల్లలు తెలుగులోనే మాట్లాడి పలకలు తగిలించుకునేదాకా ఎందుకు తెచ్చుకున్నారంటారూ?

  మనమంటే పెద్దాళ్ళం, బోలెడు భేషజాలుంటై, బడాయిలుంటై, తెలుగులో మాట్టాడాలంటే నామోషీలుంటై.. అంచేత ఎన్ని తిప్పలు పడైనా,.. ఇంగ్లీషులోనే మాట్టాడతాం. కానీ ఇంగ్లీషొచ్చినట్టు నటించాల్సిన ఖర్మ పిల్లలకేంటి? హాయిగా తెలుగులో మాట్టాడుకుంటారు. తెలీని భాషలో మాట్టాడగలిగే తెలివితేటలు కూడా వాళ్ళకు లేవు! పైగా, తమదిగాని భాషలో మాట్టాడాలంటే పడే తిప్పలు మామూలువి కావు మరి. అంచేత పాపం తెలుగులో మాట్టాడి పలక మెడలో వేయించుకున్నారు.

  ఐదో తరగతి దాకా చదువు తెలుగులో చెప్పకుండా, పరాయిభాషలో చదువు చెప్పడం వాళ్ళకు వేస్తున్న అసలు శిక్ష అనేది మనం గమనించాలి. దానికితోడు తెలుగులో మాట్టాడినందుకు ఈ శిక్ష!

  ఓ సంగతి చూడండి.. సాఫ్టువేరు ఉద్యోగాలు చేసే మన కుర్రాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఎంతలేదన్నా కనీసం ఓ మూణ్ణాలుగు లక్షల మందైనా ఉంటారు. “మన కుర్రాళ్ళు” అంటే 20-30 సంవత్సరాల మధ్య ఉండే తెలుగు వాళ్ళు! దాదాపుగా అంతా ఇంగ్లీషు మీడియములో చదివినవాళ్ళే! ప్రతీ రోజూ కనీసం ఏడెనిమిది గంటలు జాలంలో ఉంటారు. ఇంతమంది తెలుగువాళ్ళు జాలంలో తిరుగుతూంటే తెలుగు బ్లాగులను చూసేవాళ్ళు ఎంతమంది ఉండాలండి? ఏనాడన్నా మీ బ్లాగుకు వెయ్యి మంది వచ్చారా? బ్లాగులకు సందర్శకులను సరఫరా చేసే కూడళ్ళకు కూడా వెయ్యిమంది రారు నా ఉద్దేశంలో! ఈ కుర్రాళ్ళలో బ్లాగులున్నాయని తెలవనివాళ్ళు, బ్లాగులంటే ఆసక్తి లేనివాళ్ళు కొంతమంది పోయినా, కనీసం ఒక్..క శాతం కూడా బ్లాగులను చదవడం లేదెందుకు?

  తెలుగు చదవడం, రాయడం రాకే! ఇంగ్లీషు మీడియమ్ చదువులు వీళ్ళకు తెలుగును నేర్పనివ్వకుండా చేసాయి. (ఇప్పుడు బ్లాగులు చదివేవాళ్ళలో కూడా ఇంగ్లీషు మీడియములో చదివినవాళ్ళు బాగా తక్కువ మంది ఉండొచ్చు.) చిన్నప్పుడు తెలుగులో చదవడం, పెద్దయ్యాక (కనీసం ఇంటరుదాకా) తెలుగు చదవడం – ఈ రెండు పనులు చేస్తే తెలుగు చదవలేక/రాయలేకపోవడం అనేది ఉండదు. 

  తెలుగులో మాట్టాడితేనే తప్పయ్యే పరిస్థితి బడుల్లో ఉంటే, మన పిల్లలకు తెలుగు చదవడం రాయడం వస్తుందా? వాళ్ళ పిల్లలకు మాట్టాడ్డం వస్తుందా? అంచేతే.. ఐదు దాకా పిల్లలకు చదువు తెలుగులోనే చెప్పాలి. పునాదిలో తెలుగుంటే ఆ పైన ఏ భాషలో చదివినా నెగ్గుకొస్తారు. ఆరో తరగతి నుంచి ఇంటరు దాకా ఏ భాషలో చదివినా, తెలుగు సబ్జెక్టు మాత్రం చదివి తీరాలి. ఈ పనులు చేసిన ముఖ్యమంత్రి మరో రాయలే!

  ~~~~~~~~~~~~~~~~~~~

  సరే..
  పెద్దలు కొందరు (మేధావులు) అసలు సంగతిని పక్కనబెట్టి, దీనికి సామాజిక కోణాన్ని ఆపాదిస్తూంటారు.  కులాన్ని, మతాన్ని సమస్యలోకి లాక్కొస్తారు. లాక్కొస్తున్నారు కూడా. ‘పిల్లలకు శిక్ష వెయ్యడమనేది అసలు సమస్య. అంతేగానీ, తెలుగులో మాట్లాడొద్దనడం కాదు‘ అంటూ ఉపదేశాలిస్తున్నారు. ఆ శిక్ష వేసినవాళ్ళకు తగు శిక్ష విధించాలి అని వాదిస్తున్నారు. నిజమే ఆ పంతుళ్ళను బడినీ శిక్షించాల్సిందే, అందులో మరో అభిప్రాయం ఉండటానికి లేదు. కానీ, అదేనా పరిష్కారం? మెడలో పలక వేసిన సంగతి మనకు తెలవగానే నోరెళ్ళబెడుతున్నాంగానీ, అంతలా కాకపోయినా.. ఇంగ్లీషులోనే మాట్లాడాలనే నిబంధన మాత్రం అనేక బడుల్లో ఉంది. ఫైన్లు వేస్తారు. ఒక పీరియడ్లో నిలబెడతారు, ఐడోంట్ స్పీక్ తెలుగు అనీ వంద సార్లు రాయిస్తారు.. ఇలా ఎవరి పద్ధతుల్లో వాళ్ళు శిక్షలు విధిస్తూనే ఉన్నారు. మరి వీళ్ళను ఏంచేస్తాం? 30 యేళ్ళ కిందటే నెల్లూరులో ఒక బడిలో “అయామె తెలుగు డాంకీ” అని రాసున్న పలకలు మెడలో తగిలించేవారని ఓ డాక్టరు గారు చెప్పారు, చూడండి. “తెలుగులో మాట్టాడకూడదనే ఆంక్షలు ఏ ఇంగ్లీషు బడిలోనైనా ఉంటాయి, ఇక్కడేదో పెద్ద హింస జరిగిపోయినట్టు చేస్తున్నారేంటి ” అని కంచె అయిలయ్య అన్నాడు. నిజమే చెప్పాడు. కానీ, అందులో తప్పేమీ లేదన్నట్టు మాట్టాడ్డమే ఆయన ప్రత్యేకత!

  కంచె అయిలయ్య ఇంకా ఏమన్నాడో చూడండి..
  తెలుగు భాష మాట్లాడొద్దని అన్నందుకు, ఆ ప్రిన్సిపల్‌ను పిలిచి అఫిషియల్సు ఎంత హ్యుమిలియేట్ చేస్తున్నారో చూడండి.  పిల్లలకు ఆహారం లేకపోతే అఫిషియల్సు పట్టించుకోట్లేదు, మీడియా పట్టించుకోట్లేదు, సోషల్ వెల్ఫేరు స్కూల్స్ నడవకపోతే పట్టించుకోట్లేదు. బోర్డులు కట్టారనే కారణంతో ఇం..త పెద్ద నన్‌ను, ప్రిన్సిపల్‌ను హెరాస్ చేసే ప్రక్రియ మనం చేస్తున్నామే!
  అని బాధపడిపోయాడాయన!

  ఇంకోమాట కూడా .. ఇదేదో పెద్ద నేరమైనట్టు ఆ బడిమీద చర్య తీసుకోవడం లాంటివి చెయ్యకూడదు. పిలిచి ఓమాట చెప్పి వదిలేస్తే సరిపోద్ది అని అన్నాడు. ఆయన ప్రాథమ్యాలు ఎక్కడున్నాయో మనకు తెలుస్తోంది గదా!  మరికొందరు మేధావులు కూడా ఇలాగే సమస్యను ఏదో ఒకరకంగా పక్కదారి పట్టించాలని చూస్తున్నారు.

  ~~~~~~~~~~~~~~~~~~~

  ఇంతకీ.. అయిలయ్య ఈ సమస్యకో పరిష్కారం చూపించాడు.. దేశవ్యాప్తంగా ఒకటో తరగతి నుంచి ఇంటరు  దాకా పిల్లలందరికీ మూడు సబ్జెక్టులు మాతృభాషలోను, మూడు ఇంగ్లీషులోను చెప్పాలంట. అలాగైతే రెండు భాషలూ వస్తాయంట.  ఉన్న సబ్జెక్టులు ఆరు – తెలుగు, ఇంగ్లీషు, హిందీ, లెక్కలు, సైన్సు, సోషలు – ఇవేగా?
  అందులో మూడు తెలుగులో చెప్పమంటున్నాడు. మాతృభాషలో చదువు చెప్పడమంటే అదే కదా ! -లెక్కలు, సైన్సు, సోషలు తెలుగులో చెబుతారు. ఈయన లెక్కేంటో అర్థం కాలేదు అని అనుకుంటూండగా, ఇంకో ముక్క అన్నాడు..
  – ‘సగం సిలబస్సు మాతృభాషలోను, సగం ఇంగ్లీషులోను చెప్పాలి, ఆ దెబ్బతో రెండు వచ్చేస్తాయం’ట. ఇంకోటేంటంటే.. ఇలా చదివిన పిల్లకాయలు దేశంలో ఏ రాష్ట్రానికి పోయినా చక్కగా చదివెయ్యగలరంట !!!

  అయిలయ్య చెప్పినది ఇలా ఉండగా..

  ~~~~~~~~~~~~~~~~~~~

  ఏ తికమకా లేకుండా కొందరు పెద్దలు ఇలా చెబుతున్నారు..
  “ప్రాథమిక స్థాయిలోనే ఇంగ్లీషు చదువు ప్రవేశించి, తెలుగును మరణశయ్య మీదకి ఎక్కిస్తోంది” ఈ ముక్క ఎవరన్నారో తెలుసా.. రంగనాయకమ్మ!

  “అధికార భాషగా తెలుగును అమలుచెయ్యని ప్రభుత్వానికి తెలుగు ప్రాచీనతను అడిగే నైతిక హక్కు లేదు.” జ్వాలాముఖి

  “గత ఇరవై యేళ్ళుగా ఇంగ్లీషు మాధ్యమ చదువులు విపరీతంగా పెరిగాయి. దాదాపు రెండు తరాల విద్యార్థులు తెలుగు రాకుండానే తెలుగును నామమాత్రంగ చదువుతూనో, అసలు చదవకుండానో పాఠశాల చదువులు, కాలేజీ చదువులూ వెలగబెట్టారు. డాక్టర్లు, ఇంజనీర్లూ అయ్యారు. వీళ్ళంతా పరభాషా సంస్కృతులకు పరాయీకరణం చెంది ఇంట్లో తెలుగు పత్రికను కనబడనీయరు, కనబడ్డా ముట్టరు. వీళ్ళు తెలుగుకు దూరమైతే వీళ్ళ పిల్లలకు రానిస్తారా? ఇలా మరో రెండు తరాలు గడిస్తే వీళ్ళంతా తెలుగు మాటకు కూడా దూరమవుతారు. ఓ సమాజంలో 20 శాతం మంది ఆ భాషను చదవకుండా చదువు ముగిస్తే ఆ భాష మృతభాష అయ్యే ప్రమాదముంది అని యునెస్కో హెచ్చరించింది.”- కాలువ మల్లయ్య. ఈయన రాసిన వ్యాసం పూర్తిగా చదివి తీరాలి. మనం చూస్తున్న కొందరు ఇంగ్లీషు భక్తుల నైజాన్ని ఆ పేజీల్లో పరిచాడాయన.

  వీళ్ళే కాదు, వేలమంది పెద్దలు – విద్యావేత్తలు, భాషావేత్తలు, రచయితలు, పాత్రికేయులు, ఉపాధ్యాయులు –  తెలుగులో బోధన చెయ్యాలనీ, తెలుగును విధిగా నేర్పాలనీ చెబుతున్నారు. వీళ్ళు మనకు రాజకీయ నాయకులు కాకపోవచ్చు, కానీ నాయకులే -సాంస్కృతిక నాయకులు!

  మనమంతా కలసికట్టుగా ప్రభుత్వాన్ని నిలదీసి, పనిచేయించుకోవాల్సిన అవసరం ఉంది.

  ~~~~~ ~~~~ ~~~~ ~~~~ ~~

  ఈ విషయంపై పొద్దులో జరుగుతున్న చర్చ చూడండి.

  పోటెత్తిన కృష్ణ -ప్రమాదంలో రాష్ట్రం

  కృష్ణానది ఉప్పొంగుతోంది. ఊళ్ళను, నగరాలను, మండలాలను కూడా ముంచెత్తుతూ ఉరకలెత్తుతోంది. గత వంద సంవత్సరాల్లో ఎప్పుడూ రానంత వరద వచ్చిందట.  కర్నూలు నగరం నడుంలోతు నీళ్ళలో మునిగిపోయింది.  మంత్రాలయం మునిగిపోయింది. రాఘవేంద్రస్వామి మఠం మునిగిపోయింది. కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అనేక ఊళ్ళు నీళ్ళలో చిక్కుకుపోయాయి. విజయవాడ ప్రమాదపు అంచున ఉంది. పులిచింతల కాఫరు డ్యాము కొట్టుకుపోయింది.  శ్రీశైలం డ్యాము, నాగార్జున సాగరు డ్యాము పాటవ పరీక్షను, పటుత్వ పరీక్షను ఎదుర్కొంటున్నాయి.

  వరద ఎంత ఉధృతంగా ఉందంటే శ్రీశైలం ఆనకట్ట భద్రతను కూడా సందేహించేంతగా! జలాశయ పూర్తి నిల్వ మట్టం 885 అడుగులు. దానిపైన మరో ఆరేడు అడుగులు పెరగవచ్చు. అది గరిష్ఠ స్థాయి అట. ఆపైన మరి కొన్ని అడుగుల వరకు పరవాలేదు, అదీ దాటితే నీళ్ళు డ్యాము పై నుండి ప్రవహిస్తాయి.  అదీ ప్రమాదం. ఈలోగా ఈ నీటి మట్టం పెరుగుతూ ఉండే క్రమంలో డ్యాముకు ఎగువన (ఫోర్‌షోర్) ఉన్న ప్రాంతాలు మునిగిపోతాయి.  కర్నూలు కూడా ఈ ప్రాంతంలోనే ఉంది. శ్రీశైలం జలాశయంలో నీటి చేరిక పరంగా ఇప్పటివరకు ఉన్న రికార్డు 10 లక్షల క్యూసెక్కుల చిల్లర. అసలు ఆనకట్టను కట్టేప్పుడు తీసుకున్న అత్యథిక నీటిచేరిక అంచనా – 24 లక్షల క్యూసెక్కులట.  ప్రస్తుతం అది 20 లక్షల క్యూసెక్కులకంటే ఎక్కువగానే ఉంది. ఇవ్వాళ పొద్దుటి నుండి 10 లక్షలు, 12 లక్షలు, 16 లక్షలు ఇలా పెరుగుతూ ఉన్న చేరిక ఇప్పుడు మధ్యాహ్నం మూడింటికి 20 లక్షల క్యూసెక్కులకు పైగా గా ఉందని అంటున్నారు.  జలాశయం నుంచి కిందకు వదులుతున్నది 10 లక్షల క్యూసెక్కుల కంటే కాస్త తక్కువ. ఈ లెక్కన ఇప్పటికే దాదాపు నిండిపోయిన జలాశయం గరిష్ఠ స్థాయికి చేరడానికి ఎక్కువ సమయమేమీ పట్టేట్టు లేదు. జలాశయంలోకి నీటిచేరిక మరింత పెరిగితే నాగార్జున సాగర్, ప్రకాశం బ్యారేజీలపై కూడా వత్తిడి పెరిగే అవకాశం చాలా ఉంది.  నాగార్జున సాగర్లోకి చేరుకునే నీటిని కిందకు వదిలేందుకు అక్కడి గేట్ల సామర్థ్యం చాలకపోతే పక్కనుండే మట్టికట్ట (ఎర్త్ డ్యాము)కు గండికొట్టి, నీటిని వదిలేసే అవకాశం ఉందని టీవీవాళ్ళు చెబుతున్నారు. అదే జరిగితే విజయవాడే కాదు, డ్యాముకు దిగువన ఉండే అనేక ప్రాంతాలు ప్రమాదంలో పడినట్టే. అయితే డ్యాములకు వచ్చిన ప్రమాదమేమీ లేదని కొందరు సీనియరు ఇంజనీర్లు భరోసా ఇస్తున్నారు.

  కనీవినీ ఎరుగనంత వరద వచ్చిన పరిస్థితిలో  సహజంగానే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాం. ప్రభుత్వమూ అంతే! కానీ అలాంటి పరిస్థితిలోనే ప్రభుత్వం చురుగ్గా పనిచేస్తూ ప్రజలకు ధైర్యం కలిగించాలి. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం పనితీరు ఎలా ఉందంటే..

  • కర్నూలు నగరం మునిగిపోయే ప్రమాదం అంచున ఉంది, జాగ్రత్తలు తీసుకోవాలి అని నిన్నటినుండి ప్రజలు ఘోషిస్తే అలాటిదేం జరగదు, ఏం పరవాలేదు అని కర్నూలు కలెక్టరు మీణా అన్నాడట. నగరం మునిగిపోయి, నడుముల దాకా నీళ్ళొచ్చిన ప్రస్తుత పరిస్థితిలో అక్కడ జనాన్ని తరలించడానికి ఇప్పుడక్కడ పడవల్లేవు, నీళ్ళలో చిక్కుకున్నవారికి అన్నం లేదు, తాగను నీళ్ళు లేవు. 
  • రాష్ట్ర ప్రభుత్వం బెంగళూరు నుంచి కర్నూలుకు హెలికాప్టర్లు పంపించిందట, అవి అక్కడ దిగాయిగానీ పనుల్లోకి దిగలేదట. ఎంచేతంటే .. -వాటికి పెట్రోల్లేదు!  హై. నుండి పెట్రోలు పంపిస్తారంట!!
  —————————————————–
  తాజా:
  వరద బాధితులకు సహాయం అందించదలచినవారు కిందివారిని సంప్రదించవచ్చు:
  హిందూ ధార్మిక సంస్థలు (మళ్ళ వాసుబాబు): 96035 49469
  లోక్‌సత్తా పార్టీ (రత్నం): 93983 03029, 93910 38940

  హిందూ వ్యతిరేక దళితిస్టువాదం

  దేశంలో కొంతమందికి హిందూమతాన్ని విమర్శించడం ఫ్యాషనైపోయింది. హిందూమతాన్ని తిడుతూ, ఇతర మతాలను వెనకేసుకొస్తూంటారు. వీళ్ళు కాలం చెల్లిన, బూజు పట్టిన పాత కబుర్లు చెబుతూ, “మనుస్మృతిలో అలా చెప్పారు, రామాయణంలో ఇలా చెప్పారు, కొన్ని కులాల వాళ్ళను వేదం చదవనీయలేదు, కృష్ణుడు ఇలా చేసాడు, దేవుళ్ళంతా కొన్ని కులాలకే చెందినవాళ్ళు, ఇతర కులాలకు దేవుళ్ళు లేరు..” – ఇలాంటి అరిగిపోయిన వాదనలు చేస్తూంటారు. ఇలాంటి వాదనలు చేసేవాళ్ళను దళితిస్టువాదులు అనీ, వీళ్ళ వాదాన్ని దళితిస్టువాదం అని అంటారు. బ్రాహ్మణవాదం, బ్రాహ్మిణికల్ యాటిట్యూడ్ అంటూ ఒక ఆలోచనాధోరణి ఉందని అంటూంటారు చూసారూ.. అలాంటిదే ఈ దళితిస్టువాదం. ఈ దళితిస్టువాదం కేవలం దళితకులాలవాళ్ళే చేస్తారని అనుకుంటే అది పొరపాటు; ఎవరైనా చేస్తారు. అలాగే దళితవాదం దళితిస్టువాదం ఒకటేనని కూడా పొరపాటు పడకూడదు. దళితవాదం దళితుల అభ్యున్నతి గురించో, దళితుల గురించో మాట్టాడుతుంది. ఇదలాక్కాదు.. దీనిముఖ్యమైన లక్షణమేంటంటే ప్రతిదానికీ హిందూమతాన్ని పట్టుకు విమర్శించడం! ఒక్క ఉదాహరణ చెబితే గబుక్కున అర్థమౌతుంది..

  ఇదిగో మా ఇంట్లో ఇవ్వాళ పాలు విరిగిపోయాయి, మీ ఊళ్ళో నిరుడు శివరాత్రికి వాన కురిసిందిగదా.. అందుకే ఇలా జరిగింది. కాబట్టి తప్పంతా హిందూమతానిదే, అంచేత నువ్వు వెంఠనే మతం మారిపోవాలి.

  ఇలా ఎవరైనా మాట్టాడితే వాళ్ళని దళితిస్టువాదులంటారు. దాన్ని దళితిస్టువాదం అంటారు.

  దళితిస్టువాదులు ‘ఇతర మతం’ చేతిలో బొమ్మలు. ఆ మత ప్రచారకులకు వల్లమాలిన దొంగ తెలివితేటలుంటాయి. ఖతర్నాక్‌లు వాళ్ళు. వాళ్ళు ఈ దళితిస్టువాదులను ఆడిస్తూంటారు. వీళ్ళచేత మాట్టాడిస్తూంటారు. హిందూమతానికి వ్యతిరేకంగా మాట్టాడ్డానికి పురాణాలు వేదాలపై కత్తులు ఝళిపించేవాళ్ళు గతంలో. కానీ తమ కత్తిని హిందూవ్యతిరేకత మీద సానబట్టే క్రమంలో దాన్ని అరగదీసి, అరగదీసి, అరగదీయగా కత్తి పూర్తిగా అరిగిపోయి ఉత్త పిడి మిగిలింది వీళ్ళ చేతుల్లో. అది పట్టుకోని పిడివాదం చేస్తూంటారు. దళితిస్టువాదుల వాదాలు కొన్ని చూద్దాం.

  గతంలో హిందూమతం నిరంకుశంగా పాలించి కొన్ని కులాలను అణిచేసింది. కాబట్టి వాళ్ళంతా ఇప్పుడు గబగబా మతం మార్చేసుకోవాలి అని అంటూంటారు. అందుకోసం ఒక భావజాలాన్ని వాడతారు వీళ్ళు. కొందరు, ‘దళితుల తిండి వేరు, వాళ్ళ సంస్కృతి వేరు,’ అంటారు. కొందరు ఇంకాస్త అతికిపోయి ‘అసలు వాళ్ళు హిందువులే కాదు. వాళ్ళ దేవుళ్ళు వేరు, హిందూ దేవుళ్ళు వేరు’ అంటూంటారు. పోచమ్మ, పోలేరమ్మలు హిందూ దేవతలు కారని ఒక ప్రొఫెసరు మాట్టాడితే ఓ పత్రికాసంపాదకుడు ఉదాహరణలతో సహా గట్టిగా జవాబిచ్చాడు.

  ఇంకొంతమంది మాటల్లో విషం గక్కుతూ ఉంటారు. కొన్ని కులాలవాళ్ళ ఆహారపుటలవాట్లను హేళన చేస్తూంటారు, అక్కడికి వీళ్ళేదో రోజులో ఏడెనిమిదిపూట్ల ఉపవాసముంటున్నట్టు. ఇంకొందరుంటారు.. అసలు హిందూమతం అనే మతమే లేదంటారు. అదెప్పుడో తెలుసాండి.. ఎల్లప్పుడూ ఆమాట అనరు. దళితులు ఏ మతమైనా అవలంబించొచ్చు అని చెప్పేటపుడు ‘అసలు హిందూ మతమనేదేలేదు, అంచేత మతమార్పిడి మార్పిడే కాదు ‘ అంటారు. కొన్ని కులాలను అణచివేసింది అని చెప్పేటపుడు మాత్రం వాళ్ళకి హిందూమతం ఉంటుంది. ఎందుకంటే అణచివేసిందెవరో చెప్పేందుకు ఒక మతం ఉనికి కావాలి కదా, అదన్నమాట! ప్రభుత్వంవారి దరఖాస్తుల్లో మతం అనేచోట హిందూ అని రాసేస్తూంటాం. మళ్ళీ అప్పుడు హిందూమతం ఉంటది.

  కేవలం హిందూమతం మీద ఉన్న కసి కారణంగా తమకు తోచిన విధంగా హిందూమతాన్ని అడ్డగోలుగా విమర్శిస్తూంటారు. వీళ్ళ వాదనలు వైరుధ్యాల పుట్టలు.

  కానీ ఇతరమతాలను పల్లెత్తి మాట అనరు. ఆయా మతాలతో రహస్య ఒప్పందమేదో ఉన్నట్టు ప్రవర్తిస్తూంటారు. ఆ మతాలను వెనకేసుకు వస్తూంటారు. లేదు లేదు, ఆయామతాలే వీళ్ళను ముందుపెట్టుకు వస్తూంటాయి. ఇస్లామిక ఉగ్రవాదులు ముంబైలో మారణకాండ సృష్టించారని ఎవరైనా అన్నారనుకోండి.. “అలా మతం పేరుపెట్టి అనకూడదు, తప్పు తప్పు”, అంటూ మీదకొస్తారు. వీళ్ళు మాత్రం హిందూమతాన్నే కాదు, హిందూదేవుళ్ళను కూడా అడ్డగోలుగా విమర్శిస్తూంటారు.

  ‘హిందూమతం మిమ్మల్ని అణచేసింది కాబట్టి మీరు హిందూమతాన్ని వీడిపోవాలి, పదండి పదండి’ అని అమాయకులను ఎగదోస్తూ ఉంటారు. (ఈ సందర్భంలో హిందూమతం అనేది ఉంది -గమనించండి) అక్కడికి అవతలి మతాలేదో స్వర్గతుల్యమైనట్టు! ప్రపంచంలోని మతాలన్నిటికంటే ఈ దళితిస్టువాదులను నడిపిస్తున్న మతాలే భయంకరమైనవి. క్రూసేడ్లు చూడండి. తెల్లోడు మన దేశాన్ని ఆక్రమించుకునే క్రమంలో మతాన్ని ఒక ఆయుధంగా వాడిన సంగతి చూడండి. అసలు మన సంగతి ఎంత లెండి.. చాలా చిన్నది.. మొన్నటిదాకా జింబాబ్వే పేరు రోడీషియా. రోడ్స్ అనేవాడి పేరిట ఆ పేరు వచ్చింది. సంగతేంటంటే వాడు ఇంగ్లండు నుండి ఆ దేశానికి వలసవెళ్ళి, అక్కడ మైనింగు కోసమని భూముల్ని కాజేసి స్థిరపడిపోయాడు. వాడు పెట్టిన కంపెనీయేనట, డి బీర్స్ అనే వజ్రాల వ్యాపార సంస్థ. కాజెయ్యడమంటే మన దొరగారిలాగా ప్రభుత్వభూమి ఓ ఆరేడొందల ఎకరాలను ఆక్రమించేసుకోడం కాదు, మొత్తం దేశాన్ని ఆక్రమించేసుకుని దేశానికి తన పేరు పెట్టేసుకున్నాడు వాడు. ఇదీ వాళ్ళ గొప్పదనం. అమెరికాలో ఉన్నదెవరు? ఆస్ట్రేలియాలో ఉన్నదెవరు? -వీళ్ళు అణచివేత గురించి దళితిస్టువాదులచేత మనకు చెప్పిస్తూంటారు, భలే!

  యూరపులో ననుకుంటా.. ఒక సన్నటి కొండ ఉంది.. ప్రాచీన మానవులు వేలాది గుర్రాలను మూడువైపుల నుండి కమ్ముకుని తమ ఆయుధాలు, కాగడాలతో భయపెట్టి, బెదరగొట్టి, తరిమికొట్టి వాటిని ఆ కొండకొమ్ముకు పరుగెత్తించి అక్కడినుంచి కింద లోయలోకి దూకేసేలా చేసేవారంట. అంత ఎత్తునుంచి అవి పడిపోయి తక్షణం చచ్చిపోయేవి. ఆనక తీరిగ్గా వాటిని తినేవారట.

  ఇప్పుడు హిందూ వ్యతిరేకవాదులు, ప్రచ్ఛన్న మతప్రచారకులు కలిసి అమాయక హిందువులను తమ భావజాలంతో, దళితిస్టువాదంతో భయపెట్టి ‘ఇతరమతం’ లోకి దూకేలా చేస్తున్నారు. అదుగదుగో ఆ కొండకొమ్ముకు వెళ్ళి ‘ఇతరమతం’ లోకి దూకండి, అక్కడ మీకు స్వర్గం ఉంది అని చెబుతున్నారు. దూకాక ఇంకేముంది.. ఆనక ఆ ‘ఇతరమతస్తులు’ వాళ్ళను తీరుబడిగా నంజుకు తింటారు, అది ఖాయం!

  ప్రజలను మతమార్పిడి కోసం ఉసిగొల్పేందుకుగాను, హిందూమతం గురించి ఎట్టా మాట్టాడినా పరవాలేదని దళితిస్టువాదం అనుకుంటోంది. వీళ్ళ వాదనల్లోని డొల్లతనాన్ని మనం బయటపెడుతూనే ఉండాలి.

  ——————- — X — ——————-